S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/20/2018 - 21:02

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, యువ హీరో అఖిల్ ఎట్టకేలకు తన తదుపరి సినిమా వివరాలను ట్విట్టర్ వేదికగా ఉగాది పండుగ సంద్భంగా స్వయంగా ప్రకటించాడు. ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నట్లు ట్వీట్ చేశాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు నిజమేనంటూ అఖిల్ తాజాగా చెప్పడం గమనార్హం.

03/20/2018 - 21:00

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణం సినిమా నిర్మించే సన్నాహాలు చేస్తున్నారు తెలుగు నిర్మాత అల్లు అరవింద్. గీత ఆర్ట్స్‌తోపాటు మరో రెండు పెద్ద బ్యానర్స్ కలిపి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా 3డి వెర్షన్‌లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట.

03/20/2018 - 21:00

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రాజరథం’ విడుదల దగ్గరయ్యేకొద్దీ చిత్ర బృందం మరో పాటని విడుదల చేశారు. ‘నిన్ను నేను ప్రేమించానంటూ’ అంటూ సాగే ఈ యుగళ గీతం వినసొంపుగా ఉండడమేగాక, అద్భుతమైన దృశ్యాలతో కనువిందు చేయనుంది. బర్ఫీ, జగ్గా జాసూస్ వంటి చిత్రాలకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రజత్ పొద్దార్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పాటని ఊహ, వాస్తవాల కలయికగా ఒక భారీ సెట్‌లో ఎంతో అందంగా తీర్చిదిద్దారు.

03/20/2018 - 20:54

సినిమాల్లో అవకాశాలు రావాలంటే నాకు టాలెంట్ ఉంది.. నేను గొప్పగా నటిస్తా అంటూ కథలు చెబితే ఎవ్వరు అవకాశాలు ఇవ్వరు.. తప్పకుండా అందాల ఆరబోయాల్సిందే అని ఖరాఖండీగా చెప్పింది గ్లామర్ భామ ఆండ్రియా. ఇప్పటికే సంచలన హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈ అమ్మడు ఎన్ని సినిమాలు చేసినగాని పాపం కెరీర్ పరంగా సరైన కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో సెకెండ్ హీరోయిన్‌గానే సెటిల్ అయింది.

03/19/2018 - 20:57

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలతో యువ హీరోగా స్టార్ ఇమేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సీవాలా’. గీతా ఆర్ట్స్ 2, యువి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్.కె.ఎన్. నిర్మాత. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం మే 18న విడుదల కానుంది.

03/19/2018 - 20:56

సూపర్ స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘్భరత్ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రంలో మహేష్ ట్రెడిషనల్‌లుక్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.

03/19/2018 - 20:55

రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. 1980 నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

03/19/2018 - 20:52

ఛలో చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం నర్తనశాల ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారభోత్సవ పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వంశీ పైడిపల్లి హీరో నాగశౌర్యపై క్లాప్ కొట్టారు.శంకర్‌ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయవౌతున్నాడు.

03/19/2018 - 20:50

ఇటీవల ‘మళ్ళీ రావా’వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా కథానాయికగా నటిస్తున్నది.

03/19/2018 - 20:49

రిచాపణయ్, హర్షవర్ధన్ రానే హీరో హీరోయిన్లుగా జస్ట్ ఎంటర్‌టైన్ మెంట్ క్రియేషన్స్ పతాకంపై తేజ డైమండ్స్ అధినేత శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి కూతురు (ఎన్.ఆర్.ఐ) నిర్మాతలుగా శ్రీ్ధర్ సీపాన దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘బృందావనమది అందరిది’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని సెంపుల్ వీడియో విడుదలమ చేశారు.

Pages