S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/18/2018 - 21:13

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే అంటేనే ఓ సంచలనం. సినిమాలోని పాత్రకోసం ఎంతకైనా తెగించేసేందుకు సిద్ధం అనే ప్రతిభగల అందాల భామలు చాలా అరుదుగా వుంటారు. సన్నివేశం డిమాండ్ చేస్తే ఏ తరహాగా అయినా నటించేందుకు రెడీ అనేసే రాధికా ఆప్టే.. పొదుపు కూడా పాటించేస్తోందిట. ఆ విషయం కూడా తనే చెప్పేస్తోంది. ఈవిడ భర్త పేరు బెనడిక్ట్ టేలర్.. యూకెలో ఓ మ్యుజీషియన్. తనేమో అక్కడే ఉంటాడు. ప్రొఫెషనల్‌గా బిజీ.

03/18/2018 - 21:46

ఎంతో కష్టపడి అడుగుపెట్టిన సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ లేకుంటే అవకాశాలు దక్కించుకోవడానికి నటీమణులు రెగ్యులర్ దారిలోనే వెళుతూ సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ ఆదాశర్మ కూడా వుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్‌ఎటాక్ సినిమాతో ఈ బ్యూటీ పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత మూడు నాలుగు చిత్రాల్లో నటించిన ఈమెకు సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో అవకాశాలు తగ్గాయి.

03/16/2018 - 21:06

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. రెండో షెడ్యూల్‌ను ఈనెల 23 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్‌లోనే చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న బిగ్ బి అమితాబ్, నయనతారలు పాల్గొంటారట.

03/16/2018 - 21:04

నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘సవ్యసాచి’. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘ప్రేమమ్’ తర్వాత నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘తన రెండు చేతులను సమర్ధవంతంగా వినియోగించగల అర్జునుడిని ‘సవ్యసాచి’ అంటారు.

03/16/2018 - 21:02

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ లండన్‌లో జరుగుతోంది. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై సంచలనం రేపుతోంది. ఏకంగా 13 మిలియన్ వ్యూస్‌తో టాలీవుడ్‌లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా దుమ్మురేపింది.

03/16/2018 - 21:01

విష్ణు మంచు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. చిత్ర టైటిల్‌కు చక్కటి స్పందన రాగా, ఎస్.్థమన్ స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. విష్ణు, జి.నాగేశ్వర్‌రెడ్డిల కలయికలో‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన విషయం తెలిసిందే.

03/16/2018 - 20:58

స్పేస్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ మహిళా సైంటిస్టుగా కల్పనా చావ్లా చరిత్ర సృష్టించింది. సాదా సీదా నిరుపేద కుటుంబం నుంచి సైన్సు విద్యార్థిగా గొప్ప స్థాయికి ఎదిగిన కల్పనా చావ్లా అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకుంది. కొలంబియా నౌక ప్రమాదంలో ఆకస్మికంగా మరణించిన ఆమె జీవిత కథతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

03/16/2018 - 20:56

బీరువా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ సురభి, ఆ తరువాత హీరోయిన్‌గా పలు అవకాశాలతో తెలుగులోనే కాకుండా తమిళ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. నానితో చేసిన జెంటిల్‌మన్, అల్లు శిరీష్ చేసిన ఒక్కక్షణం సినిమాలు విజయాలు సాధించడంతో సురభికి మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. గ్లామర్‌తోపాటు నటిగా కూడా మంచి పేరుతెచ్చుకున్న ఈమెకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది.

03/16/2018 - 20:54

నందమూరి కళ్యాణ్‌రామ్-కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎంఎల్‌ఏ. మంచి లక్షణాలున్న అబ్బాయి ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవలే విడుదల చేశారు. తాజాగా శుక్రవారం అన్ని పాటలను యూ ట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

03/15/2018 - 21:33

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్) నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతుంది. 18న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది.

Pages