S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/21/2018 - 20:25

వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న అల్లరి నరేష్, తాజాగా తనకు సుడిగాడులాంటి సంచలన విజయాన్ని అందించిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ కూడా నటిస్తున్నాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

03/21/2018 - 20:24

నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలి హిట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం రాజరథం. అంజు వల్లభనేని, విసు దకప్పదారి, సతీష్ శాస్ర్తీ, అజయ్‌రెడ్డి గొల్లపల్లి నిర్మాతలు.

03/21/2018 - 20:22

కళ్యాణ్‌రామ్, కాజల్ అగర్వాల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో బ్లూప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై తెరకెక్కిన చిత్రం ఎంఎల్‌ఏ. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ- కథను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలంటే చాలా ఇష్టం. అలాంటివారిలో ఈ నిర్మాతలు ముందుంటారు.

03/21/2018 - 20:21

సుధాకర్ ఇంపెక్స్ ఇండియా పతాకంపై డి.నరసింహ సమర్పణలో వరుణ్ సందేశ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మర్లపులి. డి.రామకృష్ణ దర్శకత్వంలో బి.సుధాకర్‌రెడ్డి, బి.్భవానీ శంకర్, ఖమ్మం శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమైన సందర్భంగా హైదరాబాద్‌లో పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ- 1983లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.

03/21/2018 - 20:19

తెలుగులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనదైన ఇమేజ్ స్వంతం చేసుకుంది అందాల భామ అనుష్క. స్టార్ హీరోలకు ధీటుగా బాక్సాఫీస్‌పై కలెక్షన్ల సునామీ సృష్టించే అనుష్క మరోవైపు గ్లామర్ హీరోయిన్‌గా కూడా సత్తా చాటుకుంది. తాజాగా ‘్భగమతి’ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న ఈమె, ప్రస్తుతం స్లిమ్‌గా మారే పనిలో బిజీగా వుంది. అందుకే వచ్చిన అవకాశాలకు నో చెబుతూనే వుంది.

03/20/2018 - 21:14

హాట్ హాట్ అందాలతో సౌత్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకున్న హాట్ భామ ఇలియానాకు బాలీవుడ్‌లో చుక్కెదురైంది. అక్కడ హీరోయిన్‌గా వెలగాలని తెగ ఆరాటపడి సౌత్‌లో వున్న మంచి అవకాశాలను వదిలేసి వెళ్లింది. బాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి తెచ్చుకుంది. ఆమె చేసిన ఏ హిందీ సినిమా కూడా కెరీర్ పరంగా సరైన సక్సెస్ ఇవ్వలేకపోయింది.

03/20/2018 - 21:12

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఓ రేంజ్‌లో భారీ హైప్‌ని క్రియేట్ చేసింది. అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేక ఐటెమ్ సాంగ్ కోసం బిగ్‌బాస్ భామను దింపుతున్నారు.

03/20/2018 - 21:11

సీనియర్ నటుడు డా.వి.కె నరేష్‌ను ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ డిప్లమాటిక్ రిలేషన్స్, హ్యూమన్ రైట్స్ అండ్ పీస్ కౌన్సిల్ జనరల్ (కల్చరల్ ఎఫైర్స్)గా నియమించింది. ఈ నెల 17న ఫిలిప్పినీస్ రాజధాని మనిలలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫిలిప్పినీస్ దేశాధ్యక్షుడు రోడిగ్రో ఆర్.దుటురోస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

03/20/2018 - 21:09

ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్‌లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు విడుదలవుతాయి. ఈ ఉగాది సందర్భంగా యువ కథానాయకుడు నితిన్, కథానాయిక మేఘా ఆకాష్‌తో కలసి నటించిన ‘్ఛల్ మోహన్ రంగ’ చిత్ర ఆల్బమ్‌ని విడుదలచేశారు.

03/20/2018 - 21:04

ఒక సినిమాను మించి మరో సినిమాతో సంచలన విజయాలు అందుకున్న దర్శకుడు కొరటాల శివ అంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ క్రేజ్. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూలో ఉన్నారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో భరత్ అనే నేను సినిమా తెరకెక్కిస్తున్న కొరటాల ఈ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఓ షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదల కానుంది.

Pages