S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/14/2018 - 21:52

జె.డి. చక్రవర్తి హీరోగా అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో నక్షత్ర మీడియా పతాకంపై రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ఉగ్రం. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు.

03/14/2018 - 21:49

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఉగాది పురస్కారాలను అందించనుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ..

03/14/2018 - 22:07

బాలీవుడ్‌లో నటిగా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో ఫైర్‌బ్రాండ్‌గా కూడా అలాంటి గుర్తింపే తెచ్చుకుంది రాధికా ఆప్టే. సంచలన పాత్రలతో పెద్ద దుమారమే రేపిన ఈమెపై ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా వెంటనే రీకౌంటర్ ఇవ్వడం పరిపాటే. తాజాగా ఆమె బీచ్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలు కావడంతో. మరి ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

03/14/2018 - 21:55

‘రంగస్థలం’ పాటలకు వస్తున్న స్పందనకు ఉబ్బితబ్బిబ్బు అవుతున్న చంద్రబోస్ ఆనందం రెట్టింపుచేస్తూ... ‘సత్య గ్యాంగ్’ చిత్రానికి చంద్రబోస్ రాసిన పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబోస్ స్వయంగా మీడియాతో పంచుకున్నారు. ‘సత్యగ్యాంగ్’లో అనాధలపై రాసిన పాటకు అనూహ్యమైన స్పందన వస్తోందని..

03/14/2018 - 21:58

ప్రముఖ బాలీవుడ్ నటుడు నరేంద్రఝా (55) బుధవారం ఉదయం గుండె పోటుతో మృతి చెందారు. హదర్, రాయిస్, మెహంజోదారో, కాబిల్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మోడలింగ్‌తోపాటు టెలివిజన్ రంగాల్లో కూడా తనదైన సత్తా చాటారు. తెలుగులో రాజవౌళి దర్శకత్వంలో ఛత్రపతి, యమదొంగ చిత్రాల్లో నటించారు. అలాగే బాలకృష్ణ లెజెండ్ సినిమాలో కూడా నటించి మెప్పించారు.

03/13/2018 - 22:03

ఆర్.కె.్ఫలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మహిళా కబడ్డీ’. రచన స్మిత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవలే మూడవ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రంకోసం ఉగాది పండుగపై ఒక ప్రత్యేక పాటను సంగీత దర్శకుడు బోలే షావళి సంగీత సారధ్యంలో రూపొందించడం జరిగింది.

03/13/2018 - 22:21

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు కుర్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ‘కందిరీగ’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతగాడు ఆ తరువాత ఎన్టీఆర్‌తో ‘రభస’ చేశాడు. ‘అజ్ఞాతవాసి’ తరువాత పవన్‌తో సినిమా చేయాలని ఆయనకు కథ చెప్పి మరీ ఒప్పించాడు.

03/13/2018 - 22:17

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్‌చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో, రాజా ది గ్రేట్‌తో అదరగొట్టిన మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా రామ్ తాళ్లూరిగారు నిర్మిస్తున్న సినిమా ఫస్ట్‌లుక్‌ని తెలుగువారి మొదటి పండుగ ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలుపుతూ...

03/13/2018 - 22:09

బిపిన్, రమ్య, అక్షర, లయన్ ఏవి స్వామి, బాబూమోహన్, సాయి త్రిశాంక్ ప్రధాన పాత్రలలో షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై కూర అంజిరెడ్డి సమర్పణలో బిపిన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘బంగారు తెలంగాణ’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆడియో సీడీలను రిలీజ్ చేసారు.

03/13/2018 - 22:13

రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కామరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శే్వతావర్మ, భూషణ్ కళ్యాణ్, అజయ్‌ఘోష్ తదితరులు మెయిన్ లీడ్‌గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. ప్రత్యేకంగా వికారాబాద్‌లో వేసిన సెట్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. అలాగే ఈ సినిమాతో పరిచయం కానున్న అర్ష పోస్టర్‌ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు.

Pages