S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/19/2018 - 20:47

నిర్మాత ఎన్.ఎస్.నాయక్ సహాయ సహకారాలతో అవార్డ్ విన్నింగ్ లఘు చిత్రాల దర్శకులు డా.ఆనంద్‌కుమార్ దర్శకత్వంలో తన అద్భుత మేధాశక్తితో ప్రపంచ రికార్డును నెలకొల్పిన గిరిజన బాలిక చిరుతేజ్‌సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన బాలల చిత్రం చిరుతేజ్‌సింగ్. ఫ్యాషన్ డిజైనర్ ఫేమ్ మనాలి రాథోడ్, కాటమరాయుడు ఫేమ్ సౌమ్యవేణుగోపాల్ ప్రధాన పాత్ర పోషించారు.

03/19/2018 - 20:45

మా ఎంఎల్‌ఏ ఈనెల 23న ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. తప్పకుండా ఓటేసి గెలిపించగలరని అంటున్నాడు మంచి లక్షణాలున్న అబ్బాయి (ఎంఎల్‌ఏ) కళ్యాణ్‌రామ్. హీరోగా తనదైన ఇమేజ్‌ను కాపాడుకుంటూ మరోవైపు విభిన్నమైన చిత్రాలతో నిర్మాతగానూ సత్తా చాటుకుంటున్నాడు. ఆయన తాజాగా ఎంఎల్‌ఏగా మన ముందుకు వస్తున్నాడు.

03/18/2018 - 21:41

నందమూరి బాలకృష్ణ -మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్ అంటే ఆ క్రేజే వేరు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’ సంచలన విజయం సాధిస్తే ఆ తరువాత వచ్చిన ‘లెజెండ్’ అంతకుమించి హిట్ అందుకుంది. అందుకే బాలయ్య-బోయపాటి కలయికలో వచ్చే సినిమా కోసం అటు నందమూరి అభిమానులు కూడా ఆసక్తి ఎదురుచూస్తున్నారు.

03/18/2018 - 21:32

చక్కనమ్మ చిక్కినా అందమే. కానీ మరీ ఇంత చిక్కిపోవడం ఏమిటా? అని అందరూ షాక్ అవుతున్నారు. తెలుగు భామ అంజలిని ఇప్పటివరకూ బొద్దుగుమ్మగా చూసినవాళ్లే. తాజాగా ఆమె ఫొటోలు చూసి ఏంటీ, అంజలేనా? అంటూ అడుగుతున్నారట. సీతమ్మ వాకిట్లో.., గీతాంజలి వంటి చిత్రాల్లో బొద్దుగుమ్మగా నటించి ఆకట్టుకున్న అంజలీకి ఆ తరువాత చేసిన సినిమాలు వరుస పరాజయాలను అందించాయి.

03/18/2018 - 21:43

‘టచ్ చేసి చూడు’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించిన రవితేజ ప్రస్తుతం ‘నేల టికెట్’ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారట. ఈ సెట్లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. మే నెల ఆరంభానికి షూటింగ్ మొత్తం పూర్తయి అదే నెలాఖరున చిత్రం విడుదలవుతుందట.

03/18/2018 - 21:19

ప్రస్తుతం నేల టికెట్ చిత్రంలో నటిస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత రవితేజ మరో దర్శకుడికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వి.ఐ.ఆనంద్‌తో చిత్రం ఉంటుందని తెలిసింది. ఆనంద్ ఇటీవలే ఒక్కక్షణం చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నాడు.

03/18/2018 - 21:30

అఖిల్ మూడో సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరితో చెయ్యబోతున్నాడు. బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈనెల 26న జరగబోతున్నాయి. వెంకీ అట్లూరి చెప్పిన పాయింట్ నచ్చడంతో నాగార్జున ఈ స్క్రిప్ట్ ఓకే చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు ముహూర్తం రోజున తెలియనున్నాయి. ముందుగా అఖిల్ సినిమా కొరటాలతో ఉంటుందని వార్తలు వచ్చాయి.

03/18/2018 - 21:33

‘డుం డుం డిగా డిగా’ అనే నూతన తెలుగు చలనచిత్రం ద్వారా సందీప్, శివ రస్తో ముఖ్య పాత్రధారులుగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో సందీప్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అతను ఇంతకుముందు తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘అసుర’ చిత్ర దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. ‘డుం డుం డిగా డిగా’ చిత్రాన్ని పర్నిక ఆర్ట్స్, ధృవ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ల మీద గోపికృష్ణ శేషం, ప్రదీప్ గడ్డపు నిర్మిస్తున్నారు.

03/18/2018 - 21:45

అందాల చందమామ కాజల్ క్రేజ్ ఈమధ్య కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత ఇప్పటిదాకా ఒక్క సినిమాలోనూ కనిపించడంలేదు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఎంఎల్‌ఏ. నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన నటిస్తున్న కాజల్‌కు అటు కొత్త అవకాశాలు కూడా రావడంలేదు. దీనికి కారణం ఈమధ్య చేసిన సినిమాలన్నీ వరుస పరాజయాలు అందుకోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి.

03/18/2018 - 21:48

రెమ్యూనరేషన్ విషయంలో హీరోయిన్స్ ఏ మాత్రం వెనకడుగు వేయడంలేదు. స్టార్ హీరోలతో సమానంగా కావాలని డిమాండ్ చేస్తున్నారు కూడా. దాదాపు మన స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఇపుడు రెండంకెల సంఖ్యలో నడుస్తోంది. హీరోయిన్స్ కూడా రెండు హిట్స్ అందుకునే సరికి లక్షల్లో నుంచి కోట్లలోకి జంప్ చేస్తున్నారు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఓ బాలీవుడ్ భామ రెమ్యూనరేషన్‌లో అప్పుడే భారీ మార్పులు చేసింది.

Pages