S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2018 - 20:17

మనీష్‌బాబు, అక్షిత జంటగా రాజా వనె్నంరెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి నిర్మిస్తున్న ‘ప్రశ్నిస్తా’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత జెమిని కిరణ్ స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బాబి క్లాప్‌కొట్టారు. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.

03/22/2018 - 20:16

మలయాళంలో ఘనవిజయం సాధించిన ఆనందం చిత్రాన్ని అదే పేరుతో సుఖీభవ మూవీస్ పతాకంపై నిర్మాత గురురాజ్ విడుదల చేస్తున్నారు. సీతారామరాజు సమర్పణలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

03/22/2018 - 20:14

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. పూరి మార్క్ స్టైల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కరెప్టెడ్ పోలీసు అధికారిగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రణ్‌వీర్‌సింగ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తమిళంలో కూడా ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది.

03/22/2018 - 20:13

శ్రీవిష్ణు, సాత్నాటైటస్ జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో అరాన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణవిజయ్ నిర్మించిన ‘నీది నాది ఒకే కథ’ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ- ఈమధ్య కొత్త దర్శకుల ప్రభంజనం మొదలైంది. అదే కోవలో వేణు కూడా ఉంటాడని ఖచ్చితంగా చెబుతున్నాను. ట్రైలర్ బాగుంది.

03/22/2018 - 20:11

సౌత్‌లో దశాబ్దకాలంపాటు గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రీయ వివాహం జరిగినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా రష్యన్ యువకుడితో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న ఈమె, పలుమార్లు మీడియా కంట పడడంతో నేరుగా ప్రేమ విషయం గురించి అడిగారు. కానీ ప్రేమా, గీమా లేదంటూ దాటవేస్తూ వస్తున్న శ్రీయ, ఈనెల 12న ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నట్టు సమాచారం.

03/22/2018 - 20:10

దాదాపు దశాబ్దకాలంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ కాజల్. గ్లామర్‌తోపాటు నటిగా కూడా సత్తా చాటిన కాజల్, సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన ఎంఎల్‌ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ కాజల్‌తో ఇంటర్వ్యూ...

03/21/2018 - 20:31

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్‌టిఆర్ బయోపిక్ సినిమాకోసం బిజీగా మారాడు. మహానటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీఆర్. తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఈనెల 29న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది.

03/21/2018 - 20:29

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ ఈనెల 30న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాలతోపాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన పాటలు ఓ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలోని పాటలు తనకు బాగా నచ్చాయని, స్టెప్పులు కూడా అదిరిపోయేలా వుంటాయని చెబుతున్నాడు చరణ్.

03/21/2018 - 20:28

భలే మంచి రోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్‌హిట్ సినిమాలనందించిన 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మూడవ చిత్రంగా ‘యాత్ర’ పేరుతో ఓ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆనందోబ్రహ్మ ఫేం మహి వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్నాడు.

03/21/2018 - 20:26

గోపీచంద్, మెహరీన్ జంటగా చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘పంతం’. ఫర్ ఏ కాజ్ అనేది ఉపశీర్షిక. గోపీచంద్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. మంచి మెసేజ్‌తోపాటు కమర్షియల్ హంగులతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.

Pages