S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2018 - 20:39

బాలీవుడ్ క్రేజీ భామ ప్రియాంక చోప్రాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. 90వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) బరిలో వున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ప్రియాంకను ఆస్కార్ కమిటీ ఎంపిక చేయడం విశేషం. ‘బిహైండ్ ద సీన్స్ విత్ ప్రియాంక చోప్రా’.

01/23/2018 - 20:38

నందమూరి బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి నటించిన చిత్రం ‘జై సింహా’. నిర్మాత సి.కల్యాణ్, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్‌లో డిస్ట్రిబ్యూటర్స్ పార్థసారధిరెడ్డి, శివారెడ్డి, ఫణి, శక్తి పిక్చర్స్, రమేశ్, విజయ్, మహేశ్, కృష్ణ తదితరులు పాల్గొని సినిమా సక్సెస్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

01/23/2018 - 20:37

హీరో నాగార్జున ఈ మధ్య కొత్త తరహా కథలపై మోజు పెంచుకుంటున్నారు. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు కథలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో నాగార్జున, ఎప్పటికప్పుడు కొత్త తరహా కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న యంగ్ హీరో నానిలు కలిసి మల్టీస్టారర్‌లో నటించనున్న సంగతి తెలిసిందే.

01/23/2018 - 20:35

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రీరామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్‌పై లగడపాటి శ్రీ్ధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఇందులో బన్నీ ఆవేశం కలిగిన సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ కూడా బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయనున్నారు.

01/23/2018 - 20:34

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అడివి శేష్ హీరోగా ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘2 స్టేట్స్’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. రాజశేఖర్-జీవిత తనయ శివాని ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.

01/23/2018 - 20:41

సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. ఆర్ట్‌కూడా అంతే ముఖ్యం. సదరు ఆ సన్నివేశాన్ని బలంగా పండించాలంటే అక్కడి పరిసరాలు కథలో భాగం అవ్వాలి. అప్పుడే ప్రేక్షకుడు ఆ సన్నివేశానికి సంబంధించిన మూడ్‌ని ఫీల్ అవుతారు. కొన్ని సినిమాల్లో సెట్స్ కూడా పాలు పంచుకుని యాక్టర్స్‌గా మారతాయి. ఇపుడు అలాంటిదే ‘్భగమతి’ సెట్.

01/21/2018 - 20:33

ఇటీవల కాకతీయ కళా వైభోత్సవాల పేరుతో ‘కళాబంధు’ టి. సుబ్బిరామిరెడ్డి కళలను ప్రోత్సహిస్తూ కళాకారులను సత్కరిస్తూ కళల పట్ల, సంస్కృతి పట్ల తన గౌరవాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు పాపారావు సినీ నటులను సత్కరించకూడదని విమర్శిస్తూ మాట్లాడడం సంచలనం రేపుతోంది.

01/21/2018 - 20:32

‘ప్రయోగాత్మక సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు చేయాలన్నదే నా కోరిక’ అని అంటున్నారు హీరో విక్రమ్. ప్రయోగాల కథానాయకుడిగా కమల్‌హాసన్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు. ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధమనే విక్రమ్ తాజాగా ‘స్కెచ్’ చిత్రంతో మరోసారి ముందుకు వస్తున్నారు.

01/21/2018 - 20:29

వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘తొలిప్రేమ’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ - ఈ సినిమా కోసం ఏ టైటిల్ పెడదామా అని ఆరు నెలలుగా ఆలోచించాం.

01/21/2018 - 20:28

సురేష్ కమల్, వైశాలి, కిమయా హీరో హీరోయిన్లుగా మెహమాయా ఎంటర్‌టైన్ మెంట్స్, రెడ్‌నోడ్ మీడియా బ్యానర్లపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దివ్యమణి’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నర్తకి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత యామిని కృష్ణమూర్తి ఆడియోను విడుదల చేశారు.

Pages