S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/14/2018 - 20:22

గాయత్రి గుప్త, శే్వతావర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో రెడ్ యాంట్స్ బేనర్‌పై తెరకెక్కుతున్న ‘మిఠాయి’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి విజయ్ దేవరకొండ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో దర్శకులు క్రాంతి మాధవ్, సందీప్ వంగా తదితరులు పాల్గొన్నారు.

01/14/2018 - 20:21

నవీన్‌బాబు, సంజన, అమృత హీరోహీరోయిన్లుగా శ్రీమతి రమాదేవి సమర్పణ లో రామ్‌సాయి గోకులం క్రియేషన్స్ బేనర్‌పై షాలినీ ఫేమ్ షేరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అనగనగా ఓ రాజకుమారుడు’. పి.వి.రాఘవులు నిర్మాత. కమెడియన్ సుమన్‌శెట్టి ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూలును గోవాలో పూర్తి చేసుకుంది.

01/14/2018 - 20:20

తమిళ హీరో అయినా తెలుగు హీరోలతో సమానంగా మార్కెట్‌ను, అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు సూర్య. ఆయన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకూ అంతే ఆసక్తి. సూర్య నటించిన ‘తానా సెరెందాకూట్టమ్’ తమిళ చిత్రాన్ని ‘గ్యాంగ్’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

01/14/2018 - 20:18

ఆట టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ఓంకార్, ఆ తరువాత దర్శకుడిగా మారి రాజుగారి గది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన రాజుగారి గది-2 కూడా మంచి విజయం సాధించడంతో ఓంకార్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. తాజాగా ఆయన మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి హర్రర్ నేపథ్యంలో కాకుండా ఓ ఆట నేపథ్యంలో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

01/14/2018 - 20:17

పటాస్ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన నందమూరి కల్యాణ్‌రామ్ ఆ తర్వాత నటించిన రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాయి. అందుకే ఈసారి కొత్తగా ఆ కట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ఆయన ఎంఎల్‌ఏ అవతారం ఎత్తాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేసారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

01/14/2018 - 20:16

యువ హీరో నాని దూకుడు మామూలుగా లేదు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నాని మరో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న కృష్ణార్జున యుద్ధం చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని సంక్రాంతి కానుకగా విడుదల చేసారు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తుండడంతో కృష్ణ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది.

01/14/2018 - 20:14

బాలీవుడ్‌లో విక్కీ డోనార్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన యామి గౌతమ్ అంతకంటే ముందు తెలుగు, తమిళ భాషల్లో నటించింది. తెలుగులో నితిన్ సరసన కొరయర్‌బాయ్ కళ్యాణ్, గౌరవం చిత్రాల్లో నటించిన ఈమెకు తెలుగులో పెద్దగా కలిసిరాలేదు. దాంతో హిందీలోనే సెటిల్ అయి అక్కడే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈమధ్యే కాబిల్ లాంటి ప్రయోగాత్మక చిత్రంలో అంధరాలిగా నటించి మెప్పించిన యామి, నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది.

01/13/2018 - 19:50

బాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పరిణీతి చోప్రాకు కెరీర్ పరంగా పెద్దగా గుర్తింపు తెచ్చిన సినిమాలేవీ లేవు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈమెకు వస్తున్న అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దాంతో కాస్త గ్లామర్ డోస్ పెంచిన ఈ భామకు ఓ బంపర్ ఆఫర్ దక్కింది.

01/13/2018 - 19:49

జైలవకుశ తరువాత తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు ఎన్టీఆర్. ఇప్పటికే క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఆయన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నదట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నాడట. దానికి కారణం కథ ప్రకారం కొత్త లుక్‌లో కన్పిస్తే బాగుంటుందని దర్శకుడు చెప్పడంతో ప్రస్తుతం అదే ప్రయత్నాల్లో వున్నాడు.

01/13/2018 - 19:48

నాగార్జున కొత్తదనాన్ని అందించడంలో ముందుంటారు. హీరోగా ఓవైపు విభిన్నమైన సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం రంగులరాట్నం. రాజ్‌తరుణ్ హీరోగా శ్రీరంజని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఆదివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...

Pages