S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/06/2017 - 20:16

స్టార్ కమెడియన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న సునీల్‌కు ఈమధ్య వరుసగా సినిమాలు పరాజయం పాలవుతూ టెన్షన్ పెడుతున్నాయి. కాస్త బ్రేక్ తీసుకుని తర్వాత చేసిన కృష్ణాష్టమి, వీడు గోల్డ్ ఎహే, జక్కన్న, తాజాగా ఉంగరాల రాంబాబు సినిమాలతో కమర్షియల్ విజయానికి దూరమైన సునీల్, మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా సునీల్‌తో సినిమా చేయడానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది.

10/06/2017 - 20:15

తెలుగు భామ అంజలి, జై జంటగా నటిస్తున్న చిత్రం బెలూన్. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హర్రర్ నేపథ్యంలో ఉంటుం ది. సినీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసారు. అంజలి సోషల్ మీడియాలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

10/06/2017 - 20:13

విభిన్నమైన చిత్రాలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం ఇంద్రసేన. ఆర్ స్టుడియోస్, విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్స్ పతాకంపై రాధిక శరత్‌కుమార్, ఫాతిమా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఈనెల 11న విడుదల చేయనున్నారు. బిచ్చగాడు సినిమాతో సంచలన విజయం అందుకున్న విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.

10/06/2017 - 20:12

దిలీప్, శేఖర్, శ్రీలక్ష్మి, గాయత్రి గుప్తా ముఖ్యపాత్రల్లో కృష్ణవర్మ దర్శకత్వంలో కీర్తి క్రియేషన్స్ పతాకంపై కార్తీక్‌రెడ్డి, అశోక్ సిరియాల నిర్మిస్తున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’.

10/06/2017 - 20:11

బాలీవుడ్ అందాల భామ దీపికా అంటే మంచి క్రేజ్. నటిగా అందాల రాశిగా తనదైన ప్రత్యేకత చాటుకున్న ఈమె ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పద్మావతి’ చిత్రంలో నటిస్తోంది. దాంతోపాటు ఈమధ్యే హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికాకు అక్కడనుండి వరస అవకాశాలు వస్తున్నాయి. దాంతోపాటు బాలీవుడ్‌లో కూడా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న దీపిక అతిథి పాత్రలో నటిస్తోంది.

10/06/2017 - 20:09

వౌర్య, చరిష్మా హీరోహీరోయిన్లుగా సెవెన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీ య చిత్రంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ యు మ్యారీడ్?’. రొమాంటిక్ లవ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అళహరి దర్శక, నిర్మాత. ఇటీవలే ఫిలిం చాంబర్‌లో ప్రారంభమైన ఈ సినిమా వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖు హాజరై యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

10/05/2017 - 21:02

టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంతల వివాహం నేడు గోవాలో జరగనుంది.
ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో 6న హిందూ సాంప్రదాయ పద్దతిలో వివాహం జరగనుండగా, 7న క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం చర్చిలో వివాహం జరుపనున్నారు.

10/05/2017 - 20:06

నందమూరి బాలకృష్ణ వేగం పెంచాడు. 100 సినిమాల తరువాత ఆయన వరుసపెట్టి సినిమాలు చేస్తూనే వున్నాడు. ఇటీవలే 101వ చిత్రంతో ముందుకొచ్చిన బాలయ్య, ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 102వ చిత్రంలో నటిస్తున్నాడు. దానితోపాటు 103, 104వ చిత్రాలను లైన్‌లో పెట్టిన బాలయ్య, తాజాగా ‘సామి’ తమిళ సినిమా సీక్వెల్‌పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

10/05/2017 - 20:05

శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ఎ.వి.ఎల్.ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుం ది. అభయ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి జైరాజాసింగ్ దర్శకత్వం వహిస్తున్నా రు. వైద్య రం గం నేపథ్యం లో మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావచ్చాయి. ఈ సందర్భంగా శ్రీకాంత్ వివరాలు తెలియజేస్తూ- ‘‘కథ బాగా ఆకట్టుకుంది. ఇందులో నాది వైవిధ్యమైన పాత్ర.

10/05/2017 - 20:04

ప్రముఖ నటుడు, విప్లవ చిత్రాల కథానాయకుడు ఆర్.నారాయణమూర్తికి కొమరం భీమ్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు. తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరం, ఆదివాసి సంస్కృతిక పరిషత్, గోండువానా కల్చరల్ ప్రొటెక్టైన్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మంగా అం దించే ఈ అవార్డును 2017కు గాను నారాయణమూర్తికి అందజేయనున్నారు. అక్టోబర్ 6న కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆయన్ను ఎంపిక చేశారు.

Pages