S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/04/2017 - 19:50

నటుడు అజయ్ ప్రధాన పాత్ర లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పెషల్’ (ద స్టోరీ ఆఫ్ ఎ మైండ్ రీడర్). వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 40 రోజులపాటు హైదరాబాద్, మాల్దీవ్స్‌లో జరిగిన షూటింగ్‌తో క్లైమాక్స్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం. మైండ్ రీడర్ అనే పాయింట్ చుట్టూ తిరిగే కథ.

10/04/2017 - 19:49

జాకీచాన్ తాజాగా నటించిన చిత్రం ‘ది ఫారినర్’. మార్టిన్ కాంప్‌బెల్ దర్శకుడు. 1992లో స్టీఫెన్ లీథ్ రచించిన ‘ద చైనా మ్యాన్’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈనెల 13న అత్యధిక థియేటర్స్‌లో విడుదల కానుంది. ఖాసీం, ఎం.రాజశేఖర్‌రెడ్డి సమర్పణలో నక్షత్ర మీడియా బ్యానర్‌పై నక్షత్ర రాజశేఖర్ సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

10/04/2017 - 19:47

సాంబ, యోధ, కిరణ్, పావని ముఖ్యపాత్రల్లో వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మి, సి.నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘లావణ్య విత్ లవర్‌బాయ్స్’. ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్లాటినమ్స్ డిస్క్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలు తెలియజేస్తూ కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రమిది.

10/04/2017 - 19:46

నాగ అనే్వష్, హెబ్బాపటేల్ జంటగా బాహుబలి ఫళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన సాగర్ నిర్మిస్తున్న ‘ఏంజెల్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా వుంది.

10/04/2017 - 19:44

తాజాగా అల్లు అర్జున్ సరసన డీజే (దువ్వాడ జగన్నాథమ్) సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు ఐటెం గర్ల్‌గా మారేందుకు సిద్ధమైంది. తాజాగా మరో మెగా హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోంది ఈ బ్యూటీ.

10/03/2017 - 19:49

నాగార్జున.. తెలుగు ప్రేక్షకులను భిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటూనే మరోవైపు కమర్షియల్ హీరోగా స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. ‘సోగ్గాడే చిన్నినాయన’ లాంటి గ్లామర్ పాత్రలు చేయాలన్నా, నమో వెంకటేశాయ లాంటి భక్తిరస సినిమాలు చేయాలన్నా ఆయనకే చెల్లింది. అటు నిర్మాతగా కూడా అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తున్నాడు.

10/03/2017 - 19:46

అమెరికాలోని సియాటెల్ నగరంలో ఈనెల 6న జరగబోయే తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకోమని ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, వెయ్యి చిత్రాలతో గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసిన డా. బ్రహ్మానందంకి ఆహ్వానం అందింది. ఇదే వేదికపై ఈనెల 7న యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందంను ఘనంగా సత్కరించనుంది.

10/03/2017 - 19:41

మొదటి సినిమాతోనే ఆస్కార్ అవార్డు నామినేషన్ అందుకున్న అనూప్ భండారి దర్శకత్వంలో తెలుగు సినిమా తెరకెక్కిస్తున్నాడు. జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. నిరూప్ భండారి, అవంతికా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నా రు. అజయ్ రెడ్డి నిర్మా త.

10/03/2017 - 19:40

శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎం.అర్జున్ దర్శకత్వంలో శ్రవణ్, మీనాక్షి గోస్వామి జంటగా ఎం.లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పందెం’. ఈ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ- చాలా ఆసక్తి కలిగించే కథ ఇది. ముఖ్యంగా హీరోయిన్ మీనాక్షి అద్భుతంగా నటించింది. ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

10/03/2017 - 19:38

శ్రీ రత్నం దవేజా సమర్పణలో సాయి పవన్‌పుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ దర్శకుడిగా నూతన నటీనటులతో జె.వి.నాయుడు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత జె.వి.నాయుడు వివరాలు తెలియజేస్తూ- ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం క్రియేట్ చేస్తున్న హర్రర్ ట్రెండ్ నేపథ్యంలో వస్తున్న చిత్రమిది.

Pages