S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/08/2017 - 21:02

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా రోబో 2.0 చిత్రం తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసారు.

10/08/2017 - 21:01

భారీ చిత్రాల నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్, స్టుడియో గ్రీన్ బ్యానర్లు కలిసి వి4 క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించి తొలి ప్రయత్నంగా ఆది, వైభవి శాండిల్య, రష్మి ముఖ్య పాత్రల్లో నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియోను దర్శకుడు బోయపాటి శ్రీను ఆవిష్కరించారు.

10/08/2017 - 20:58

భరత్, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్‌వికె సినిమాస్ పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ‘ఓయ్ నినే్న’ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీకృష్ణ మాట్లాడుతూ మా బ్యానర్‌పై విడుదలైన ‘ఓయ్ నినే్న’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

10/08/2017 - 20:56

ప్రముఖ నటుడు రాజశేఖర్, పూజా కుమార్ ముఖ్యపాత్రల్లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పిఎస్‌వి గరుడవేగ.

10/08/2017 - 20:54

కొంకా ప్రొడషన్స్ పతాకంపై సూర్య తేజ, సాయి దన్సిక, ఆలీ, సోనీ చరిష్టా, మంజు ప్రధాన పాత్ర ల్లో కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో సతీష్ కొంకా నిర్మించిన చిత్రం మేళ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో ఆదివారం విడుదల చేసా రు. ఈ కార్యక్రమంలో నటుడు ఆలీ మాట్లాడుతూ ‘కబాలి’ చిత్రంలో దన్సిక అదరగొట్టిన సంగతి తెలిసిందే.

10/08/2017 - 20:51

పోసాని ప్రధాన పాత్రలో శ్రీకర్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన నేను కిడ్నాప్ అయ్యాను చిత్రం ఇటీవల విడదలై మంచి టాక్ ను తెచ్చుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మాధవి మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చి సినిమా తీసాం, అద్భుతమైన విజయాన్ని అందుకుంది, పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉందని ప్రేక్షకులంటున్నారు అన్నారు.

10/08/2017 - 20:50

పొట్లూరి స్టుడియోస్ పతాకంపై పృధ్వి పొట్లూరి, సౌమ్యాశెట్టి జంటగా జో దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యువర్స్ లవింగ్లీ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 13న విడుదలకు సిద్ధమైంది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసారు.

10/08/2017 - 20:48

సౌత్ అందాల భామ శృతి హాసన్ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించుకుంది. ప్రస్తుతం సౌత్‌లో మంచి క్రేజ్ వున్న టైమ్‌లో ఆమె కొత్త సినిమాలను అంగీకరించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలగాలని ఆశపడుతున్న శృతికి అక్కడ నిరాశలే ఎదురవుతున్నాయి. తాజాగా విడుదలైన బెహన్ హోగీ తేరీ సినిమా కూడా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

10/07/2017 - 20:11

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ఇటీవల ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్‌ను జరుపుకుంది. తాజాగా విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అక్కడే వుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా మొదలై చాలా రోజులవుతున్నా కూడా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించకపోవడం కాస్త నిరాశకు గురి చేస్తోంది.

10/07/2017 - 20:09

ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత కుందన్‌షా (69) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శనివారం తెల్లవారు జామున ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో తన నివాసంలోనే నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ‘జానే భీ దో యారో’, ‘కభీ హా కభీ నా’లాంటి చిత్రాలు ఆయన దర్శక్వంలో రూపుదిద్దుకొని మంచి పేరుని తెచ్చిపెట్టాయి. షా మృతిని ఆయన కూతురు ధ్రువీకరించారు.

Pages