S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/19/2018 - 05:38

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అవినీతిని ఎండగట్టేందుకు కాంగ్రెస్ నెల రోజుల ఉద్యమాన్ని ప్రకటించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతితోపాటు మోదీ ప్రభుత్వం ఇతర అవినీతి గురించి వివరించేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నాయకులకు పిలునిచ్చారు.

08/19/2018 - 05:50

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరిపించాలనే ఆలోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగే పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది.

08/18/2018 - 17:09

న్యూఢిల్లీ: కేరళ వరదను జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విజ్ఞప్తిచేశారు. ఈమేరకు కేంద్రం సాయం చేయాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. దీన్ని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి కొట్టిపారేశారు. ప్రకృతి విపత్తులు వస్తుంటాయి. కేరళ వరదలను చూస్తుంటే బాధేస్తుంది. కేంద్రం చేయగలిగినదంతా చేస్తుంది.

08/18/2018 - 17:08

న్యూఢిల్లీ: కనీవినీ ఎరుగని రీతిలో వరదలతో కకావికలమైన కేరళ ప్రజలను ఆదుకునేందుకు అనేక రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రూ.10 కోట్లు, హర్యానా రూ.10 కోట్లు, ఒడిస్సా రూ.5 కోట్ల సాయం ప్రకటించాయి. జార్ఖండ్ రూ.5 కోట్లు, మహారాష్ట్ర రూ.20 కోట్ల సాయాన్ని ప్రకటించాయి.

08/18/2018 - 13:55

ఢిల్లీ: పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. సాయంత్రం వరకు కొనసాగనున్న ఈ సమావేశంలో రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై నేతలకు రాహుల్‌ అవగాహన కల్పించనున్నారు. మధ్యాహ్నం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

08/18/2018 - 12:39

లక్నో: యూపీలోని చిన్నా,పెద్ద నదుల్లో మాజీ ప్రధాని వాజ్‌పేయి అస్థికలను నిమజ్జనం చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. మహానేత కర్మభూమి అయిన ఉత్తరప్రదేశ్‌లో ఆయన అస్థికలు నిమజ్జనం చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాగా వాజ్‌పేయి లక్నో నుంచి పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన విషయం విదితమే.

08/18/2018 - 12:28

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళకు తక్షణ సాయంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.500 కోట్ల సాయాన్ని ప్రకటించారు. శనివారం ఆయన అధికారులతో, ముఖ్యమంత్రితో సమీక్ష నిర్వహించారు. తొలుత వాతావరణ పరిస్థితులు అనూకలించకపోవటంతో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించలేకపోయారు. తదనంతరం వాతావరణం అనుకూలించటంతో ఏరియల్ సర్వే నిర్వహించి వరద నష్టాన్ని పరిశీలించారు.

08/18/2018 - 05:36

న్యూఢిల్లీ: దేశంలో అనేకానేక సంస్కరణలకు, సరికొత్త రాజకీయ ఒరవడికి ఆద్యుడిగా దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయిని పేర్కోవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆయన ఎన్నో రకాలుగా తోడ్పడ్డారు. ఎవరూ ఊహించని విధంగా శాస్తవ్రేత్త అబ్దుల్ కలాంను రాష్టప్రతిగా ఎంచుకున్న ఘనత ఆయనది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు, అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

08/18/2018 - 05:20

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సీబీఐ చేపట్టిన విస్తృత కోణంలో దర్యాప్తుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రాజీవ్ హత్య వెనక కుట్రకోణంపై 1998లో అప్పటి కేంద్రప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

08/18/2018 - 05:08

మాజీ ప్రధాని వాజపేయి

Pages