S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/16/2018 - 13:09

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్‌పేరుూ ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్‌బులెటన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా వాజ్‌పేరుూ ఆరోగ్యం మరింత క్షీణించటంతో బీజేపీ అగ్రనేతలు వచ్చి ఆయనను పరామర్శిస్తున్నారు. ప్రధాని మోదీ నిన్న ఆయనను పరామర్శించారు. మళ్లీ ఈ రోజు కూడా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది.

08/16/2018 - 06:11

న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఆర్మీలో తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే నియమితులవుతున్న మహిళా అధికారులకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. ఇతర పురుష ఆర్మీ అధికారుల్లాగే వారిని కూడా పర్మినెంట్ కమిషన్ ద్వారా నియమిస్తామని ఆయన ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని చేసిన ప్రసంగంలో ఆయనఈ విషయాన్ని వెల్లడించారు.

08/16/2018 - 04:48

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అగ్రనేత అశుతోష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లే పార్టీనీ వీడుతున్నానని ఆయన బుధవారం ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా ఆయన రాజీనామాను తాను అంగీకరించడం లేదని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.

08/16/2018 - 04:47

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ మువ్వనె్నల జెండా ఎగరేశారు.

08/16/2018 - 04:44

ఇస్లామాబాద్, ఆగస్టు 15: పాకిస్తాన్ పార్లమెంట్‌కు ఇటీవల ఎన్నికైన సభ్యులు కొత్త స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రధానిగా ప్రమాణం చేయబోయే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కి చెందిన అసద్ ఖైజర్‌ను పార్లమెంట్ దిగువ సభకు స్పీకర్‌గా ఎన్నుకున్నట్టు డాన్ న్యూస్ వెల్లడించింది. ఖైజర్ తన ప్రత్యర్థి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన చెందిన సయ్యద్ ఖుర్షీద్ షాపై విజయం సాదించారు.

08/16/2018 - 05:13

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి ఉద్దేశించి చేసిన ప్రసంగం వినేందుకు వచ్చిన ఆహుతుల్లో ఈ సారి దివ్యాంగులకు ప్రత్యేక గ్యాలరీని కేటాయించారు. పైగా మూగ, బధిర విద్యార్థులకు ప్రధాని మోదీ ప్రసంగం విశేషాలను తెలియచేసేందుకు సంజ్ఞల ద్వారా తెలియచేసే సాంకేతిక భాషా నిపుణులను నియమించారు.

08/16/2018 - 04:32

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ‘ఆయుష్మాన్ భారత్’ పేరుతో ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై పరిశ్రమ సానుకూలంగా స్పందించింది. ఈ పథకాన్ని మనసారా స్వాగతిస్తామని పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్ర కోటలో జాతీయ పతాకాన్ని ఎగరేసిన తర్వాత మోదీ మాట్లాడుతూ ‘ఆయుష్మాన్’ పథకాన్ని ప్రస్తావించారు.

08/16/2018 - 05:16

తిరువనంతపురం, ఆగస్టు 15: కేరళలో వరదల వల్ల ప్రజా జీవనం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ఇంతవరకు 67 మంది మృతి చెందారు. బుధవారం ఒక్క రోజు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 25 మంది మరణించారు. కాగా కేరళలో వచ్చే 48 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

08/16/2018 - 02:08

న్యూఢిల్లీ, ఆగస్టు 15: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యం విషమించింది. కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయిని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో జూన్ 11న చేర్చించారు. బుధవారం వాజపేయి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ప్రధాన నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. 93 ఏళ్ల వయస్సున్న వాజపేయి 2009 నుంచి తీవ్రమైన అస్వస్తతతో బాధపడుతున్నారు.

08/15/2018 - 16:52

తిరువనంతపురం: కేరళలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దాదాపు 30 ఆనకట్టల గేట్లు తెరిచి నీళ్లను దిగువ ప్రాంతాలకు వదిలారు. అలాగే కొచ్చి విమానాశ్రయాన్ని మూసివేశారు. ముళ్లపెరియార్ డ్యామ్ నీటి సామర్థ్యం 142 అడుగులు కాగా ఇప్పటికే 142 అడుగులకు చేరింది. ఇంకా వరద నీరు చేరితే ప్రమాదం అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pages