S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/21/2018 - 13:58

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆపన్నహస్తం అందించింది. రూ.700 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు యూఏఈ పంపిందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.

08/21/2018 - 13:57

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు నోటా ఆఫ్షన్ వర్తించబోదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈమేరకు దీనిపై నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు అనుమతిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఈ సందర్భంగా ధర్మాసనం పక్కన పెట్టింది. నోటా అనేది ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

08/21/2018 - 12:57

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కోశికొలన్ రైల్వేస్టేషన్‌లో రైల్వే ట్రాక్ దాటుతున్న ఏడుగురు ప్రయాణీకులను రైలు ఢీకొట్టింది. వీరిలో ఓకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. మిగిలిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

08/21/2018 - 12:57

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిష్టావర్‌లో మాచెల్ మాత దర్శనానికి వెళుతున్న వాహనం నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 11మంది చనిపోగా, బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతుంది.

08/21/2018 - 12:55

సాగర్: మధ్యప్రదేశ్‌లోని కరీలా ప్రాంతంలో చిన్నారిపై కామందులు అత్యాచారానికి పాల్పడగా.. పెంపుడు శునకం వారిపై పడి కరిచి ఆ బాలికను కాపాడింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కరీలా గ్రామానికి చెందిన బాలిక రాత్రివేళ ఒంటరిగా ఇంటి నుంచి రావటాన్ని గమనించిన ఇద్దరు యువకులు కత్తితో బెదిరించి సమీపంలోని నిర్మానుష్యప్రాంతానికి తీసుకువెళ్లారు.

08/21/2018 - 04:53

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖ నేతలు సోమవారం నాడిక్కడ ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ 74వ జయంత్యుత్సవాల నేపథ్యంలో ఆయన సేవలను నేతలు కొనియాడారు.

08/21/2018 - 04:32

బళ్ళారి, ఆగస్టు 20: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద తగ్గిపోయింది. శివమొగ్గ, చిక్కమంగళూరు జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు అధికారులు తెలిపారు. దీంతో జలాశయానికి ఇన్‌ఫ్లో కూడా తగ్గింది. నాలుగు రోజులుగా 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కావడంతో 33 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని నదిలోకి విడుదల చేశారు. సోమవారం ఇన్‌ఫ్లో తగ్గడంతో 13 గేట్లు మూసివేశారు.

08/21/2018 - 02:44

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దివంగత మాజీ ప్రధాని వాజపేయి వత్తిడిలో కృంగిపోవడం, కష్టాల్లో నిరాశపడటం ఎన్నడూ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాజపేయికి సంతాపంగా జరిపిన ప్రార్థనల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై కొన్నిదేశాల వైఖరిని మార్చడంలో వాజపేయి కృతకృత్యులయ్యారని అన్నారు. వాజపేయి కారణంగానే ఉగ్రవాదం అంశం ప్రపంచం దృష్టికి వచ్చిందని అన్నారు.

08/21/2018 - 02:41

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశంలో నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఏపీ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనతంరం ఉమ విలేఖరులతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినందునే నదుల అనుసంధానంపై కేంద్రం సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు.

08/21/2018 - 02:38

చండీగఢ్, ఆగస్టు 20: తనపై వస్తున్న విమర్శలకు అవసరమైనప్పుడు గట్టి సమాధానం చెబుతానని మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు పేర్కొన్నారు. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకార వేడుకల్లో పాల్గొనేందుకు పాక్ వెళ్లిన సందర్భంగా సిద్దూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమ్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిన్న తీవ్రంగా దుమ్మెత్తిపోసిన విషయం విదితమే.

Pages