S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/21/2018 - 01:59

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారీవర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళకు సాయం అందించడంతో ప్రధాని నరేంద్ర మోదీ వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ చేసింది. రాష్ట్రానికి రూ.500 కోట్ల ఆర్థిక సహాయం ఏమేరకు సరిపోతుందని పార్టీ నిలదీసింది. కేరళకు ఇతోధిక సాయం అందించి ఆదుకోవాలని కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ప్రకృతి బీభత్సాన్ని జాతీయ విపత్తిగా ప్రకటించాలని ఆయన కోరారు.

08/21/2018 - 01:56

న్యూఢిల్లీ, ఆగస్టు 20: కేరళను అదుకునేందుకు పార్లమెంట్ సభ్యులు ముందుకు రావాలని ఉప రాష్టప్రతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో, సుమిత్రా మహాజన్‌తో వేర్వేరుగా చర్చించిన వెంకయ్య నాయుడు కేరళకు సహాయం చేసే అంశంపై చొరవ తీసుకోవాలని సూచించారు.

08/21/2018 - 01:55

భువనేశ్వర్, ఆగస్టు 20: ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ ఒడిశా ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

08/21/2018 - 00:59

న్యూఢిల్లీ, ఆగస్టు 20: తెలంగాణ నీటి అవసరాలు తీర్చిన తర్వాత మిగిలిన జలాలను అనుసంధానానికి వినియోగించుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

08/21/2018 - 02:12

తిరువనంతపురం/కొచ్చి, ఆగస్టు 20: కేరళలో ప్రకృతి ప్రళయ బీభత్సం కొంతమేర తగ్గినప్పటికీ అంతకు మించిన స్థాయిలో పెనుసవాళ్లు అధికార యంత్రాంగాన్ని కమ్ముకుంటున్నాయి. వందేళ్లలో ఎన్నడూ చవిచూడని రీతిలో గత వారం రోజులుగా ప్రకృతి కనె్నర్రకు కకావికలమైంది. లక్షలాది మంది నిర్వాశితులయ్యారు. వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక, పంట నష్టం సంభవించింది. వీటిని అధిగమించి కేరళ మళ్లీ కోలుకోవడం ఒక ఎత్తయితే..

08/20/2018 - 13:34

రాంచీ : జార్ఖండ్‌లోని లాహోర్‌దగాలో ఇద్దరు ఇద్దరు బాలికలపై 11 మంది అత్యాచారం చేశారు. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సర్దార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు.. మరో వ్యక్తి కలిసి మోటార్ సైకిల్‌పై లాహోర్‌దగా నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. వీరి వాహనం మధ్యలో ఫెయిల్ అవడంతో.. సహాయం కోసం ఆ ఇద్దరు బాలికలు.. తమ స్నేహితుడికి ఫోన్ చేశారు. ఇదే అదునుగా భావించిన అతడు..

08/20/2018 - 13:15

కొచ్చి:కుండపోత వర్షాలు, వరద బీభత్సంతో అల్లాడిపోయిన కేరళ ప్రజలను కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్ష సూచన లేదని అధికారులు వెల్లడించడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 400 మంది చనిపోయారు. ఏడు లక్షల మందికి పైగా పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

08/20/2018 - 13:10

కొచ్చి: కొచ్చిలోని నావికా స్థావరాన్ని విమానాలు నడిపించేందుకు ఉపయోగిస్తున్నారు. ఈరోజు తొలి కమర్షియల్‌ విమానం ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ అయ్యింది. ప్రయాణికుల విమానాలను నడిపించేందుకు వీలుగా నావికాస్థావరంలో ఏర్పాట్లు చేశారు. ఇతర విమానయాన సంస్థల విమానాలు కూడా నావల్‌ బేస్‌ నుంచి నడిచే అవకాశం ఉంది.

08/20/2018 - 12:55

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం వీర్‌భూమిలోని ఆయన స్మృతి చిహ్నానికి నివాళులు అర్పించారు. వీరితో పాటు ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌లు కూడా నివాళులు అర్పించారు.

08/20/2018 - 05:55

తిరువనంతపురం, ఆగస్టు 19: కేరళలో జల విధ్వంసం కొనసాగుతోంది. పది రోజులుగా ఎడతెరిపిలేకుండా కొనసాగుతున్న భారీ వర్షాల వల్ల ఇంతవరకు మృతుల సంఖ్య 197కు చేరుకుంది. త్రిశ్శూర్, ఎర్నాకుళం, ఆల్పుజా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పట్టణాలు, గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కోచి నావల్ ఎయిర్‌పోర్టులో సోమవారం నుంచి విమాన రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Pages