S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/21/2018 - 02:35

న్యూయార్క్‌లో నిర్వహించిన 38 ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్న వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, సినీనటులు కమల్‌హసన్, పూజా కుమార్, ప్రముఖ సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్.

08/21/2018 - 02:33

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని భారత్‌లో న్యూజిలాండ్ రాయబారి జొన్నా కెంప్‌కెర్స్ వెల్లడించారు. ప్రతి ఏటా దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్థులు తమ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వస్తున్నారని, వారి సంఖ్యను మరింత పెంచేందుకు మూడేళ్ల కాలానికి పోస్ట్-స్టడీ వర్క్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

08/21/2018 - 02:31

న్యూఢిల్లీ, ఆగస్టు 20: కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన ‘్భటీబచావో-్భటీ పడావో’ పథకం లోగోతో ఒక నకిలీ వెబ్‌సైట్ ప్రజలను మోసం చేస్తోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మహిళ, శిక్ష సంక్షేమ శాఖ అధికారులు హెచ్చరించారు.

08/21/2018 - 02:30

హిసార్, ఆగస్టు 20: బౌద్ధమతం స్వీకరించినందుకు దాదాపు 300 మంది దళితులను ఏడాదికి పైగా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ సంఘటన హర్యానాలోని హిసార్ జిల్లాలో వెలుగుచూసింది. భాట్లా గ్రామంలోని 300 మంది దళితులు బౌద్ధమతాన్ని స్వీకరించారు. దీనిని సహించలేని అగ్రవర్ణాలవారు వారిని ఏడాదిపాటు గ్రామ బహిష్కరణ విధించారు.

08/21/2018 - 02:29

న్యూఢిల్లీ, ఆగస్టు 20: బక్రీద్ సెలవు దినాన్ని ఈ నెల 22కు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలకు గురువారం కాకుండా ఒకరోజు ముందే బుధవారం సెలవుదినం ఉంటుంది. చాంద్రమానం ఆధారంగా ఈ పండుగ నిర్ణయించే ఢిల్లీలోని షాహి ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ నేతృత్వంలోని కమిటీ రూయత్ హిలాల్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ మార్పు చేసింది.

08/21/2018 - 02:09

న్యూఢిల్లీ, ఆగస్టు 20: కేరళ ప్రకృతి విలయాన్ని అత్యంత తీవ్ర స్వభావం కలిగిన ప్రకృతి వైపరీత్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులుగా రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు, వరదలు, మరణాలు, ఆర్థిక నష్ట తీవ్రతను, పరిధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోమ్‌మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.

08/21/2018 - 02:08

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారీ వర్షాలు, వరదలతో కకావికలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలు ముందుకు రావాలని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న కేరళ ప్రజలకు మానవతా దృక్పధంతో చేయూత నివ్వాలని సోమవారం ఆయన విజ్ఞప్తి చేశారు. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖలతోపాటు పౌర విమాన యాన శాఖను సురేష్ ప్రభు చూస్తున్నారు.

08/21/2018 - 02:07

తిరువనంతపురం, ఆగస్టు 20: కేరళ జలవిలయంలో బాధితులకు సెంట్రల్ జైలు ఖైదీలు కూడా తమవంతు సాయం అందించేందుకు శ్రమిస్తున్నారు. తిరువనంతపురం పుజప్పురాలోని కేంద్ర కారాగారంలో ఖైదీలు చపాతీల తయారీలో ప్రస్తుతం తలమునకలయ్యారు. ఈ చపాతీలను శిబిరాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులకు అందజేస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. పెద్దమొత్తంలో చపాతీలు, శాఖాహార వంటకాలను జైలులో ఈ ఖైదీలు తయారుచేస్తున్నారు.

08/21/2018 - 02:05

ముంబయి, ఆగస్టు 20: ప్రకృతి విలయానికి అల్లకల్లోలమైన కేరళలో త్రివిధ దళాలు ప్రాణాలకు సైతం తెగించి అందరి మన్ననలూ అందుకుంటున్నారు. శుక్రవారం నావికాదళం చూపిన సమయస్పూర్తి, తెగువ 26 మంది ప్రాణాలను కాపాడింది. పైలెట్ చిన్న పొరపాటు చేసినా సెకన్లలో హెలికాప్టర్ తునాతునకలైపోవడమే కాదు, అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోయేవి. థ్రిల్లర్ సినిమా దృశ్యంలా ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

08/21/2018 - 02:00

వర్షాలు తగ్గుముఖం పట్టి వరద నీరు వెనక్కి వెళ్లిపోవడంతో రోడ్లపై పేరుకుపోయన బురద.
కొచ్చి నగరంలో ఓ వీధిలోని దృశ్యమిది.

Pages