S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/12/2018 - 01:55

కోచీ/న్యూఢిల్లీ, ఆగస్టు 11: కేరళలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదలు ప్రమాద స్థాయిన దాటి ప్రవహిస్తున్నాయి. పెరియార్ నది, ఉప నదుల్లో వరద ఉద్ధృంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల నుంచి 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన డ్యామ్‌లు ప్రమాద సూచీని దాటి ప్రవహిస్తున్నాయి.

08/12/2018 - 01:29

న్యూఢిల్లీ: తెలుగుదేశం ప్రభుత్వం ‘పర్సనల్ డిపాజిట్’ (పీడీ) అకౌంట్స్‌లో నగదు లావాదేవీలపై ‘కాగ్ స్పెషల్ ఆడిట్’కు, సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీడీ ఖాతాలద్వారా భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు లేఖ రాశారు.

08/12/2018 - 00:28

జైపూర్, ఆగస్టు 11: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోళ్లలో వేల కోట్లాది రూపాయల స్కాంకు పాల్పడిందని, ఈ అంశంపై పార్లమెంటులో నిలదీస్తే సమాధానం చెప్పలేదని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ఈ స్కాంలో పూర్తిగా కూరుకుపోయిందని, అడిగిన ప్రశ్నలకు స్పష్టత ఇవ్వకుండా దాటవేత వైఖరిని అవలంభిస్తున్నారన్నారు.

08/12/2018 - 00:24

కోల్‌కతా, ఆగస్టు 11: దేశ ప్రయోజనాలా లేక ఓటు బ్యాంక్ రాజకీయాలా? ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బీజేపీ చీఫ్ అమిత్ షా నిలదీశారు. జాతీయ పౌర రిజిష్టర్ (ఎన్‌ఆర్‌సీ)ను వారు వ్యతిరేకించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకలించి వేయాలని పిలుపునిచ్చారు.

08/11/2018 - 17:09

కేరళ: కేరళలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రాంతాల్లో మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, ఇళ్లు, పొలాలు ముంపునకు గురైన బాధితులకు రూ.10 లక్షల నష్టపరిహారాన్ని అందజేశారు. కాగా ఈ వరదల్లో 30 మంది చనిపోయారు. కేరళ రాష్ట్రాన్ని ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

08/11/2018 - 17:05

ముంబయి: దేశ నిర్మాణంలోనూ, అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయటంలో ఐఐటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఐఐటీ-బీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ..ఐఐటీలు సాధించిన ఘనతను చూసి దేశం గర్విస్తుందని అన్నారు. ఇక్కడ విద్యార్థులు భారతదేశ వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తారని అన్నారు.

08/11/2018 - 17:04

కోల్‌కతా: అమిత్‌షా కోల్‌కతా పర్యటన ఉద్రిక్తంగా మారింది. వందేమాతరం, జై శ్రీరామ్ నినాదాలతో ఆయనకు కార్యకర్తలు స్వాగతం పలికారు. అయితే ఆయన పర్యటన సందర్భంగా ‘బీజేపీ గో బ్యాక్’ వంటి నినాదాలతో పోస్టర్లు వెలిశాయి. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ గూండారాజ్యం నెలకొన్నదని అన్నారు. తాము బెంగాల్‌కు వ్యతిరేకం కాదని, మమత బెనర్జీకి మాత్రమే వ్యతిరేకమని అన్నారు.

08/11/2018 - 13:41

సియటెల్: సియటెల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కెట్రాన్ దీవుల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం నడిపిన మృతిచెందాడు. విమానంలో ప్రయాణీకులు లేరు. విమానాశ్రయంలో పనిచేసే మెకానిక్ ఈ విమానాన్ని దొంగిలించి ఆకాశంలో విన్యాసాలు చేశాడు. చివరకు నియంత్రించే సామర్థ్యం లేకపోవటంతో ఈ విమానం కెట్రాన్ దీవుల్లో కుప్పకూలింది.

08/11/2018 - 13:40

వడోదర: గుజరాత్‌లోని వడోదరలో మూడంతస్తుల భవనం కుప్పకూలి ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో నెలల వయసు ఉన్న చిన్నారిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగతావారిని తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు తీసుకున్నారు.

08/11/2018 - 12:54

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి నలుగురు కార్మికులు గాయపడ్డారు. బస్తీ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Pages