S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/28/2018 - 04:26

రాంచి, జూన్ 27: జార్ఖండ్‌లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. బుధవారం పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ హతమయ్యాడు. రాష్ట్రంలో నక్సలైట్లు పెట్టిన మందుపాతర పేలి ఆరుగురు జవాన్లు మరణించిన సంగతి విదితమే. దీంతో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున వ్యూహాత్మక ప్రాంతాల్లో మొహరించారు.

06/28/2018 - 02:45

వాషింగ్టన్, జూన్ 27: ఇరాన్‌పై అమెరికా మరోసారి పంజా విసిరింది. ఈసారి ప్రపంచ దేశాల నుంచి వెలివేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలని భారత్, చైనాసహా అన్ని దేశాలకూ అమెరికా సూచించింది. తక్షణమే చర్యలు మొదలుపెట్టి, నవంబర్ నాలుగో తేదీలోగా చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని కోరింది.

06/28/2018 - 02:42

న్యూఢిల్లీ, జూన్ 27: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికోసం అధికార, ప్రతిపక్షం మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. డిప్యూటీ చైర్మన్ పదవికి ప్రతిపక్షం తరపున తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్‌ను రంగంలోకి దింపుతోంది. డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్‌డీఏ పోటీ చేస్తుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇంతకుముందే ప్రకటించారు.

06/28/2018 - 05:15

న్యూఢిల్లీ, జూన్ 27: బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు ఖాయమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కర్మాగారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసిందిగా ప్రధాని నరేంద్ర మోదీని కోరిన కేటీఆర్ ఒకవేళ కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకోకపోతే తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుందని అన్నారు.

06/28/2018 - 05:12

న్యూఢిల్లీ, జూన్ 27: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కార్మాగారాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మెకాన్ టాస్క్ఫోర్సు నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ తెలుగుదేశం ఎంపీలకు హామీ ఇచ్చారు. అయితే నివేదిక ఎప్పటిలోగా వస్తుందనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

06/27/2018 - 17:32

బెంగళూరు: జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య కేసులో పలు రాజకీయ నాయకుల హస్తం ఉందని గతంలో వ్యాఖ్యానించిన ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను కూడా హత్య చేయాలని అనుకున్నట్లు కన్నడ మీడియా వార్తల్నిప్రచురించింది. గౌరీ లంకేష్‌ హత్య కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ సంచలనమైన విషయాన్ని బయటపెట్టింది. దోషులు ప్రకాశ్‌రాజ్‌ను కూడా హత్య చేయాలని అనుకున్నట్లు బయటపెట్టింది.

06/27/2018 - 17:23

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోందని, టాస్క్‌ఫోర్స్‌ అడిగిన వాటిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్నింటికి సమాధానం చెప్పిందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ తెలిపారు. తెదేపా ఎంపీలు పరిశ్రమల ఏర్పాటు కోసం కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

06/27/2018 - 17:14

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసును మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణ బాధ్యతలను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణకు అప్పగించింది. గతవారం ఈ కేసులో మద్రాసు హైకోర్టు మిశ్రమ తీర్పు చెప్పడంతో... మూడో న్యాయమూర్తి విచారణ అనివార్యమైంది.

06/27/2018 - 13:48

ముంబయి: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన సుఖోయ్ జెట్ విమానం మహారాష్ట్రలోని నాశిక్‌లో కుప్పకూలి పోయింది. ఈ విమానం నడుపుతున్న ఇద్దరు పైలట్లు ప్రమాదానికి ముందే పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు డిఫెన్స్ శాఖ పీఆర్‌వో తెలిపారు.ఈ ప్రమాదంపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం ధాటికి విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

06/27/2018 - 13:37

న్యూఢిల్లీ: కాశ్మీర్‌పై ఐక్య రాజ్య సమితి (ఐరాస) ఇటీవల వెలువరించిన నివేదకను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. ఈ నివేదికలో ప్రస్తావించిన కొన్ని విషయాలు ప్రేరేపణకు గురై చెప్పినట్టు ఉన్నాయన్నారు.

Pages