S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/27/2018 - 12:58

శ్రీనగర్ : ‘‘మీరు మాకు అతిధులు, మా సంస్థ అమరనాథ్ యాత్రకు వచ్చే భక్తులపై దాడి చేసే ప్రణాళికలేమి లేవు’’ అని అమరనాథ యాత్ర గురువారం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాశ్మీర్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ సంస్థ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ అహ్మద్ నైకో పేరిట పై ఆడియో మెసేజ్ విడుదల అయింది.

06/27/2018 - 12:46

ఢిల్లీ : ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కి హేలే ఢిల్లీలోని హుమాయూన్ టూంబ్‌ను సందర్శించారు. 28 వరకు భారత్‌లో పర్యటించనున్న నిక్కి హేలే ఈ సందర్భంగా పలువురు భారత అధికారులతోనూ, ప్రముఖ ఎన్‌జిఒల నాయకులతోనూ సమావేశమవుతారు.

06/27/2018 - 04:15

న్యూఢిల్లీ, జూన్ 26: ఔరంగజేబులా వ్యవహరిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. మంగళవారం సుర్జేవాలా ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జనసంఘ్‌కు మద్దతు ఇస్తున్న రాజులు, సంస్థానాల భరణాలను రద్దు చేసేందుకు యుద్ధం చేసిందన్నారు.

06/27/2018 - 04:11

లక్నో, జూన్ 26: గత నాలుగేళ్లుగా దేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ కొనసాగుతున్నదని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఈ కాలంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలకు ఊపిరి సలపనివ్వడంలేదన్నారు. కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు పేదలు, రైతులు, శ్రామికులు, వెనుకబడిన తరగతులు, ఎస్సీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.

06/27/2018 - 04:06

న్యూఢిల్లీ, జూన్ 26: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఓ మేరుపర్వతమని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ స్పష్టం చేశారు. కోట్లాది మంది భారతీయుల ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ ఓ నియంత అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విమర్శంపై శర్మ విరుచుపడ్డారు. ‘జైట్లీ వ్యాఖ్యలు అసంబద్ధం, దారుణం’ అని మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు.

06/27/2018 - 04:05

న్యూఢిల్లీ, జూన్ 26: భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. రాజ్యసభలో తమ సంఖ్యా బలాన్ని పెంచుకోవటంతోపాటు ఇంతవరకు తమకు దూరంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు తెరవెనక చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం 69.

06/27/2018 - 04:04

న్యూఢిల్లీ, జూన్ 26: ఎమర్జెన్సీ విధింపు వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధానికి దారితీసింది. తాజాగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై వామపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. అరుణ్ జైట్లీ తన ‘ఎమర్జెన్సీ రీవిజిటెడ్’ పేరుతో రాసిన వ్యాసం మూడోభాగంలో లెఫ్ట్‌పార్టీల వైఖరిని విమర్శించారు. ‘ రామ్‌మనోహర్ లోహియా అనుయాయులు దీర్ఘకాలంగా కాంగ్రెస్‌తో అంటకాగడం విచిత్రం.

06/27/2018 - 04:04

వారణాసి, జూన్ 26: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలను తీవ్రతరం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ఇక్కడ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొనకపోయినప్పటికీ, ఫోన్ ద్వారా సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను తూర్పారబట్టారు.

06/27/2018 - 03:53

జమ్ము, జూన్ 26: పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వార్షిక అమర్‌నాథ్ యాత్ర జమ్ములోని భాగవతి నగర్ నుంచి ప్రారంభం కానున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రెండు లక్షలమంది, అమర్‌నాథ్ యాత్రకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి తీర్థయాత్రికులతో పాటు సాధువులు కూడా అమర్‌నాథ్ యాత్రకోసం జమ్ముకు రావడం మొదలైంది.

06/27/2018 - 03:55

ముంబయి, జూన్ 26: దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబమే ప్రధాన కారణమని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. అత్యయిక పరిస్థితిని కాంగ్రెస్ చేసిన మహా పాపంగా అభివర్ణించిన ఆయన ఒకే కుటుంబం కోసం మొత్తం రాజ్యాంగానే్న దుర్వినియోగం చేశారని అన్నారు.

Pages