S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/27/2018 - 03:56

న్యూఢిల్లీ, జూన్ 26: దేశ సరిహద్దుల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం పెనుసవాల్‌గా మారాయని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ హెచ్చరించారు. వీటినుంచి దేశాన్ని కాపాడుకోడానికి సరిహద్దును ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో మరింత అప్రమత్తతంగా ఉండాలని మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. పంజాబ్, మణిపూర్ సహా పలు సరిహద్దు రాష్ట్రాల్లో గస్తీ మరింత పెంచాలని ఆయన అన్నారు.

06/27/2018 - 00:22

న్యూఢిల్లీ, జూన్ 26: కేంద్ర ప్రభుత్వం, ఒవర్‌టైమ్ అలవెన్స్‌ను కొంతమందికి మాత్రమే పరిమితం చేస్తూ, ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది శాఖ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, ఆపరేషనల్ ఉద్యోగులకు మాత్రమే ఓటీ అందుతుంది. ఏడో కేంద్ర వేతన సంఘం సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

06/27/2018 - 00:18

న్యూఢిల్లీ, జూన్ 26: తెలంగాణలోని బయ్యారం, ఆంధ్ర ప్రదేశ్‌లోని కడపలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేసేందుకువ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్ తమకు హామీ ఇచ్చారని ఏపీ బీజేపీ నాయకులు రఘునాధ బాబు, కందుల రాజమోహన్ రెడ్డి తెలిపారు.

06/27/2018 - 00:12

న్యూఢిల్లీ, జూన్ 26: ప్రధాని నరేంద్ర మోదీకి మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తూ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. మోదీకి ఎల్లవేళలా ముప్పు ఉందని కేంద్ర హోమ్‌మంత్రిత్వశాఖ హెచ్చరించిన దృష్ట్యా ఈ చర్యలు చేపట్టారు. ప్రధానిని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) ఉంటోంది. ఇక నుంచి ప్రధానిని కలవాలంటే ఎస్‌పీజీ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే.

06/26/2018 - 16:32

న్యూఢిల్లీ: పాస్‌‌పోర్టు దరఖాస్తును సులభతరం చేసి, సత్వరమే జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ‘పాస్‌పోర్టు సేవా దివస్’ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఇవాళ ‘పాస్‌పోర్ట్ సేవా’ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాల అధికారులు, విదేశాంగ మంత్రిత్వశాఖ సభ్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

06/26/2018 - 13:59

ముంబయి: ‘‘దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ బందీ చేసిందని’’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవారిని ప్రశంసిస్తూ ముంబయిలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లైన సందర్భంగా బీజేపీ ముంబయి విభాగం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

06/26/2018 - 13:28

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తూ హోంశాఖ అన్ని రాష్ట్రాల్లోని పోలీస్‌ చీఫ్‌లకు లేఖలు రాసింది. . ప్రధాని పర్యటన సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సందేశమిచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ప్రధాని సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవ్వరినీ ప్రధానికి దగ్గరగా వెళ్లేందుకు అనుమతించొద్దని..

06/26/2018 - 12:44

ముంబయి:ఆర్థిక స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా భారత్ ముందుకు వెళ్తోందన్నారు. సంపూర్ణ, సమగ్ర ఆర్థిక అభివృద్ధి కోసం ఏఐఐబీ, భారత్ కట్టుబడి ఉన్నాయని ప్రధాని చెప్పారు.

06/26/2018 - 05:57

న్యూఢిల్లీ: పరస్పర ప్రయోజనాల ఆధారంగా సియాఛెల్లెస్‌కు చెందిన అసమ్షన్ ద్వీపంలో ఉమ్మడి నౌకాస్థావరం ఏర్పాటుపై ముందడుగు వేయాలని ప్రధాని నరేంద్రమోదీ, ఆ దేశ అధ్యక్షుడు డాన్నీ ఫారేలు నిర్ణయించారు. అంతకు ముందు రెండు దేశాలు నౌకాస్థావరాన్ని ఏర్పాటు చేయాలని ఒక అంగీకరానికి వచ్చాయి. అయితే దీన్ని రద్దు చేసుకోబోతున్నదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

06/26/2018 - 01:34

న్యూఢిల్లీ, జూన్ 25: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన జీఎస్టీని ‘నిజాయితీ వేడుక’గా వర్ణించడాన్ని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తప్పుపట్టారు. ఒకవేళ అదే నిజమైతే తాము అధికారంలోకి రాకముందు 2014 వరకు బీజేపీ దీనిని ఎందుకు వ్యతిరేకించిందని ఆయన నిలదీసారు.

Pages