S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/29/2018 - 05:02

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గ్ధామంగా మారింది. దీన్ని ఎంతమాత్రం సహించడానికి వీల్లేదు. యుఎస్ ఇప్పటికే దీనిపై పాక్‌కు సందేశం పంపిందని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ఒక పక్క తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుంటే చూస్తూ ఊరుకోవడం సాధ్యం కాదన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్-యుఎస్‌లు ప్రపంచానికి నాయకత్వ వహించాలన్నారు.

06/29/2018 - 01:35

చిత్రం..అహ్మదాబాద్‌లో రథయాత్రను పురస్కరించుకొని సబర్మతి నది నుంచి
పుణ్య జలాలను బిందెలు, కుండల్లో మోసుకొస్తున్న భక్తులు

06/29/2018 - 01:31

న్యూ ఢిల్లీ, జూన్ 28: ఎన్నికల సమయంలో పోలింగ్‌కు 48 గంటలకు ముందు రాజకీయ పార్టీల ప్రచార ప్రకటనలను నిలిపివేసే విషయమై పరిశీలించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం వినతిని ఫేస్‌బుక్ పరిశీలిస్తోంది. కాని ఈ అంశంపై మాత్రం ఇంతవరకు స్పందించలేదు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో సామాజిక మాద్యమాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్న విషయం విదితమే.

06/29/2018 - 01:30

న్యూఢిల్లీ, జూన్ 28: కర్నాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బీజేపీ యేతర ఆరు పార్టీలు హాజరైన నేపథ్యంలో వీరంతా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తారని భావించడానికి వీల్లేదని జేడీ(ఎస్) అధినేత మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవడానికి థర్డ్‌ఫ్రంట్ సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు కావాలని కూడా ఆయన సూచించారు.

06/29/2018 - 01:29

పురులియా, జూన్ 28: పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం నాడిక్కడ ఓ బహిరంగ సభలో మాట్లాడిన అమిత్‌షా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ కార్యకర్తల తాగ్యాలు వృధా పోవని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 22 స్థానాలు గెలుచుకుంటామని షా ధీమా వ్యక్తం చేశారు.

06/29/2018 - 01:28

న్యూఢిల్లీ, జూన్ 28: సీబీఎస్‌ఈ టెన్త్, ట్వెల్త్ పరీక్షా పేపర్ల మూల్యాంకనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయులపై వేటు పడింది. మార్కులు లెక్కించడంలో ఉపాధ్యాయులు పొరపాటును గుర్తించిన బోర్డు ఐదుగురు టీచర్లను సస్పెడ్ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన విద్యార్థులు రీ వాల్యుయేషన్ కోసం బోర్డును ఆశ్రయించారు.

06/29/2018 - 01:21

న్యూఢిల్లీ, జూన్ 28: రెండేళ్ల క్రితం పాక్‌లోని ఉగ్రవాదులపై జరిపిన సర్జికల్ స్ట్రైక్ వీడియోలను విడుదల చేసిన బీజేపీ ప్రభుత్వం దానిని రాజకీయం చేస్తోందని, దేశం కోసం సైనికులు చిందించిన రక్తాన్ని, త్యాగాన్ని, ధైర్య సాహసాలను రాజకీయ ఓటు కోసం ఆయుధంగా మలచుకోవద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.

06/29/2018 - 01:52

న్యూఢిల్లీ, జూన్ 28: ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేసేందుకు సంబంధించిన వ్యవహారం తుది దశకు చేరుకున్నదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర గురువారం తెలిపారు. అయితే మెకాన్ సంస్థ నివేదికను త్వరగా తెప్పించే అంశంపై హామీ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.

06/29/2018 - 01:03

న్యూఢిల్లీ, జూన్ 28: కాలనీల అభివృద్ధి పేరుతో నగరంలోని వేలాది చెట్లను కొట్టివేస్తున్నారంటూ కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఏడు కాలనీల్లో రాష్ట్ర ప్రభుత్వం 16,500 చెట్లు నరికివేయడానికి ప్రయత్నిస్తోందని మంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.

06/29/2018 - 01:22

న్యూఢిల్లీ, జూన్ 28: పాకిస్తాన్‌పై గతంలో జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ వీడియోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఏన్డీయే ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నీలం లోయ, నేపా లోయలో జరిపిన మెరుపుదాడి వీడియోను అనధికారికంగా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Pages