S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/30/2018 - 05:19

బెంగళూరు, జూన్ 29: కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ మనుగడకు వచ్చిన ఢోకా ఏమీ లేదని, ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య అన్నారు. ఈ ప్రభుత్వం పనితీరుపై తనకు ఎటువంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వం పనితీరుపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు లీకయ్యాయి.

06/30/2018 - 05:19

న్యూఢిల్లీ, జూన్ 29: ఆర్మీని అగౌరపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, సైఫుద్దీన్ సోజ్‌పై ఢిల్లీ కోర్టులో దేశద్రోహం పిటిషన్ దాఖలైంది. శశిభూషణ్ అనే న్యాయవాది పాటియాల హౌస్ కోర్టులో ఈ పిటిషన్ వేశారు. భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజాద్, సైఫుద్దీన్‌పై క్రిమినల్ కేసు పెట్టినట్టు పిటిషనర్ వెల్లడించారు.

06/30/2018 - 05:14

ముంబయి, జూన్ 29: ముంబయిలో నిర్మాణంలో ఉన్నభవనంపై విమానం కూలిన ఘటన నుంచి 40 మంది కార్మికులు తృటిలో మృతువు వొడిలోకి వెళ్లకుండా తప్పించుకున్నారు. ఈ విమానం మరి కొన్ని నిమిషాల్లో నిర్మాణ ప్రదేశంలో కూలుతుందనగా, వీరు భోజనం సమయం కావడంతో బయటకు వచ్చారు. ముంబయిలో నివాస ప్రాంతం ఘట్కాపార్‌లో విమానం కూలిన సంఘటన విదితమే. ఈ సంఘటనలో నలుగురు విమాన సిబ్బంది, ఒక పాదచారి మరణించారు.

06/30/2018 - 05:18

న్యూ ఢిల్లీ, జూన్ 29: దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని 42 లక్షల మంది సీనియర్ సిటిజన్లు స్వచ్ఛందంగా రైల్వే పాస్ రాయితీలను వదులుకున్నారని, అలాగే 1.25 కోట్ల మంది గ్యాస్ సబ్సిడీని ఏజన్సీలకు సరెండర్ చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో చట్టాలను గౌరవించే ధోరణి, సంస్కృతి, విధేయత పెరిగిందన్నారు.

06/30/2018 - 00:17

న్యూ ఢిల్లీ, జూన్ 29: స్విస్ బ్యాంకులో దాచుకున్నదంతా నల్లధనమని అనుకోవడానికి వీలులేదని, వచ్చే ఏడాది ఈ ఏడాది బ్యాంకులో భారతీయులు దాచుకున్న సొమ్ము వివరాలు తెలుస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 2017 సంవత్సరంలో స్విస్‌బ్యాంకులో భారతీయులు దాచుకున్న సొమ్ము

06/30/2018 - 00:15

న్యూఢిల్లీ, జూన్ 29: భారతీయులు స్విస్ బ్యాంకుల్లో పెట్టుకున్న డబ్బు నల్ల ధనమా? తెల్ల ధనమా? అని శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు నల్ల ధనమా? తెల్లధనమా? అంటూ ట్వీట్‌లో నిలదీశారు.

06/29/2018 - 16:42

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను ఆరోగ్య కారణాల రీత్యా ఆగస్టు 17వ తేదీ వరకూ రాంచీ హైకోర్టు పొడిగించింది. పశుగ్రాసం కుంభకోణం కేసుల్లో ఆయన జైలుశిక్ష అనుభవిస్తూ ఇటీవల తాత్కాలిక బెయిల్ పొందారు.

06/29/2018 - 14:06

ముంబయి: ఐసీఐసీఐ బ్యాంక్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి గిరీశ్‌ చంద్ర చతుర్వేదిని నియమిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ శుక్రవారం వెల్లడించింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. చతుర్వేది నియామకానికి వాటాదారులు సమ్మతిస్తే ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

06/29/2018 - 13:57

న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ వద్ద భారత్‌ పాస్‌పోర్టు తప్ప ఇంకేమి లేవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇతర దేశాల పాస్‌పోర్టులతో నీరవ్‌ మోదీ గతవారం బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం దేశాలను సందర్శించినట్లు వచ్చిన వార్తలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ ‌కుమార్‌ స్పందించారు. నీరవ్‌ను పట్టుకునేందుకు సహకరించాలని పలు ఐరోపా దేశాలకు లేఖలు రాసినట్లు తెలిపారు.

06/29/2018 - 12:14

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా అడవుల్లో తెల్లవారుజామున ఉగ్రవాదులు, సైనికుల మధ్య హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా షోపియాన్‌లో జరిగిన మరో సంఘటనలో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

Pages