S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/29/2018 - 01:38

సంత్ కబీర్‌నగర్ (యూపీ), జూన్ 28: స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు వాస్తవ పరిస్థితులను విస్మరించి లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తూ ప్రజల్లో అస్థిరతను సృష్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. యూపీలోని సంత్‌కబీర్‌నగర్‌లో తొలిసారిగా పర్యటించిన మోదీ కవి కబీర్‌దాస్ 500వ వర్థంతి సందర్భంగా చద్దర్ కప్పి నివాళి అర్పించిన అనంతరం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.

06/29/2018 - 00:16

ముంబయి, జూన్ 28: ముంబయిలో 12 సీటర్ల విమానం ఇళ్లపై కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. గురువారం మధ్యాహ్న 1 గంట ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పైలెట్లు, ఇద్దరు మెయింటినెన్స్ ఇంజనీర్లు, ఒక పాదచారి చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఘట్కోపార్ ప్రాంతంలో ప్రమాదం జరిగిందని అధికారులు అన్నారు. రాష్ట్రంలో కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు విమాన ప్రమాదాలు జరిగాయి.

06/28/2018 - 16:25

న్యూఢిల్లీ : ఉడీ ఘటనకు ప్రతీకారంగా పాక్‌ అక్రమిత కశ్మీర్‌లోని(పీఓకే) ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 2016 సెప్టెంబర్‌లో భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ సంబంధించిన వీడియో బయటికొచ్చింది. నాలుగు ఉగ్ర స్థావరాలను భారత్‌ సైన్యం ఏ విధంగా భూ స్థాపితం చేసిందో ఈ వీడియోలో కనబడుతుంది.

06/28/2018 - 16:05

ముంబయి: చార్టెడ్ విమానం ముంబయిలోని ఘాట్ కోపర్ వద్ద కుప్పకూలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ఎయిర్ క్రాప్ట్ ఇంజినీర్లు, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. విమానం బిల్డింగ్ పక్కన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. చార్టెడ్ విమానం ఇంజినీరింగ్ టెస్ట్ కోసం ఉపయోగించేదని తెలుస్తోంది.

06/28/2018 - 13:05

నైనిటాల్ : ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇక దేవాలయాలు, మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. హరిద్వార్, తీర్థనగరి ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ధ్వని కాలుష్యాన్ని నివారించాలని హైకోర్టు జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ లోక్ పాల్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

06/28/2018 - 12:35

హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. అద్భుతమైన పాలనాదక్షతతో తనదైన ముద్ర వేశారని మోదీ ట్వీట్ చేశారు. పీవీ దేశానికి అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని, ఆయన చిరస్మరణీయుడని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

06/28/2018 - 04:32

*ఎలాంటి ఫిర్యాదు అందలేదు *పూరీ జగన్నాథ ఆలయ *నిర్వాహకుల స్పష్టీకరణ

06/28/2018 - 04:31

నాసిక్, జూన్ 27: నాసిక్‌కు సమీపంలో ఒక సుఖోయ్ విమానం కూలిపోయింది. అయితే అందులోని ఇద్దరు పైలెట్‌లు ప్యారాచూట్‌ల ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. సాంకేతిక కారణాల వల్లే ఇది కూలిపోయి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

06/28/2018 - 04:29

న్యూఢిల్లీ, జూన్ 27: తన బావమరిది రాబర్ట్ వాద్రాకు ఆదాయపు పన్ను విభాగం జారీ చేసిన నోటీసులపై, రాహుల్ గాంధీ ఎందుకు పెదవి విప్పడం లేదంటూ బీజేపీ ప్రశ్నించింది. ‘కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఎ ప్రభుత్వ హయాంలో విజయ్ మాల్యా, రాబర్ట్ వాద్రాలు అవినీతి, అక్రమాలకు నిదర్శనంగా నిలిచారు. ఇప్పుడు వారికి చట్టం అంటే ఎంటో తెలుస్తోంది.

06/28/2018 - 04:28

న్యూఢిల్లీ, జూన్ 27: అమెరికా రాయబారి నిక్కీ హీలీ, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థిని బుధవారం కలుసుకున్నారు. చిన పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో అమెరికా నిబద్ధతతో వ్యవహరిస్తుందని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ‘ముక్తి ఆశ్రమ్’లో కైలాస్ సత్యార్థిని కలుసుకున్నారు.

Pages