S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/18/2018 - 16:20

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సోమవారం ఉదయం 10:30 సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన భీకర కాల్పుల వల్ల ముగ్గురు మృతిచెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. టిల్లు తాజ్‌పుర్ గ్యాంగ్‌తో పాటు జితేందర్ హోగీ గ్యాంగ్‌లు ఈ గొడవకు దిగాయి. శాంత్ నగర్‌లో ఉన్న మార్కెట్‌లో ఆ రెండు గ్రూపులు పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో పాటు.. స్థానికులపైనా విచక్షణా రహితంగా బుల్లెట్లు కురిపించారు.

06/18/2018 - 13:02

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పార్టీ నేతలపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి పాలనను వదిలేసి బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఎక్కడైనా ఉందా? ప్రజల శ్రేయస్సును పక్కన పెట్టి మరీ ఆయన ధర్నాలు చేయడం ఎంతమాత్రం సరైంది కాదు. దానికి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు ఇవ్వడం మరింత విడ్డూరంగా ఉందన్నారు.

06/18/2018 - 12:43

బెంగుళూరు: కర్నాటకకు చెందిన శ్రీ రామ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో ఓ కుక్క చనిపోతే .. దానికి ప్రధాని ఎందుకు స్పందించాలని ఆయన ఓ పబ్లిక్ మీటింగ్‌లో అన్నారు. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసును ప్రస్తావిస్తూ శ్రీ రామ సేన చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గౌరీ లంకేశ్ హత్య కేసులో పరుశరామ్ వాగ్మేర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

06/18/2018 - 12:40

న్యూఢిల్లీ : కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీనియర్‌ జేడీఎస్‌ నేత ధనిష్‌ అలీ, కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే విషయంలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం నేపథ్యంలో భేటీ జరిగింది.

06/18/2018 - 12:31

న్యూఢిల్లీ: పెరుగుతున్న డీజిల్‌ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా ట్రక్కు యజమానులు, ఆపరేటర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. దాదాపు 90లక్షల ట్రక్కుల రాకపోకలు నిలిచిపోయాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అత్యధిక పన్నుల వల్లే చమురు ధరలు పెరుగుతున్నాయి’ అని ఆల్‌ ఇండియా కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ గూడ్స్‌ వెహికల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చన్నారెడ్డి తెలిపారు.

06/18/2018 - 03:58

న్యూ ఢిల్లీ, జూన్ 17: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఐఎఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఢిల్లీ ఐఎఎస్ అధికారుల సంఘం విమర్శించింది. ఆదివారం ఇక్కడ రెవెన్యూ కార్యిదర్శి మనీషా సక్సేనా, రవాణా శాఖ కమిషనర్ వర్ష జోషి, దక్షిణ ఢిల్లీ మెజిస్ట్రేట్ అంజాద్ తక్, సమాచారశాఖ కార్యదర్శి జాదవ్ సారంగి మాట్లాడుతూ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారులు నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు.

06/18/2018 - 03:56

చిత్రం..ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మండీ హ స్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం వరకు నిర్వహించిన ర్యాలీ

06/18/2018 - 03:53

న్యూ ఢిల్లీ, జూన్ 17: వచ్చే సార్వత్రిక పార్లమెంటు ఎన్నికల్లో బీజేపిని మట్టికరిపించాలనే తాపత్రయం ఉంటే, దేశంలోని అన్ని బీజేపియేతర పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయాలని, రాహుల్ గాంధీ సహజమైన నాయకుడని సీనియర్ కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ పిలుపునిచ్చారు.

06/18/2018 - 03:47

న్యూఢిల్లీ, జూన్ 17: ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే, ఇందుకు కేంద్రం సహకరించాలని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.

06/18/2018 - 03:47

న్యూ ఢిల్లీ, జూన్ 17: ఢిల్లీ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి హామీ లభించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ అంశాన్ని నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆదివారం ఇక్కడ నీతి ఆయోగ్ సమావేశం జరిగింది.

Pages