S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/20/2018 - 17:19

కోట: కాషాయ వస్త్రాలు కట్టుకున్నవారంతా బాబాలు కాలేరని, వారి ప్రవర్తనను బట్టి బాబాలు అవుతారని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ధాతి మహారాజ్ శనిధామ్ ఆశ్రమంలో అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణలపై స్పందించారు. అక్రమాలకు పాల్పడుతున్న బాబాలను జైలుకు పంపిస్తున్నారని, కాని వారిని ఉరి తీయాలని అన్నారు

06/20/2018 - 17:17

ముంబయి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మహారాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఒక దాడి సంఘటనలో బాలల గుర్తింపు వివరాలను వెల్లడించినందుకు ఈ నోటీసులు జారీ చేసింది. రాహుల్‌గాంధీతో పాటు ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. పదిరోజుల్లోగా సమాధానం చేప్పాలని డిమాండ్ చేసింది.

06/20/2018 - 17:16

న్యూఢిల్లీ: డబ్బులిచ్చి రోహిత్ తల్లి రాధిక వేములతో నరేంద్ర మోదీని, బీజేపీని తిట్టిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమె స్టేట్‌మేంట్ చూస్తుంటే ఆమెపై ఒత్తిడి ఉన్నట్లు వెల్లడవుతుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అబద్ధాలతో నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

06/20/2018 - 17:11

న్యూఢిల్లీ: ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కుటుంబపరమైన కారణాలతోనే తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఫేస్‌బుక్‌లో తెలియజేశారు. అరవింద్ మళ్లీ అమెరికా వెళ్లిపోవాలనుకున్నట్లు జైట్లీ తన ట్వీట్‌లో తెలిపారు.

06/20/2018 - 14:01

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని పోలీసుస్టేషన్లలో అత్యాచార పరిశోధక కిట్‌లను అందుబాటులో ఉంచాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకాగాంధీ సూచించారు. బాలికలపై సాగుతున్న నేరాలపై చట్టపరమైన చర్యల గురించి ప్రచురించిన పుస్తకాన్ని మంత్రి మనేకాగాంధీ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు.

06/20/2018 - 13:54

శ్రీనగర్: ఉగ్రవాదుల చేతుల్లో హతమైన ఆర్మీ జవాను ఔరంగజేబు కుటుంబసభ్యులను బుధవారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ కు ఆమె వెళ్లారు. ఆమెతో పాటు భారతీయ ఆర్మీకి చెందిన హై ర్యాంక్ అధికారులు, పోలీసులు కూడా ఔరంగజేబు ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులకు జవాను మృతి పట్ల సీతారామన్ సంతాపం తెలిపారు. హంతకులను శిక్షిస్తామని ఆమె కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.

06/20/2018 - 12:59

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన చర్యలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆ రాష్ట్ర డీజీపీ శేషు పాల్‌ వైద్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఉగ్రవాదులకు ఊపిరినిచ్చినట్లైందని డీజీపీ పేర్కొన్నారు. ఈ సమయాన్ని ఉగ్రవాదులు వారికి అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు.అలాగే జర్నలిస్టు సుజాత్‌ బుఖారీ హత్య కేసును కూడా వీలైనంత త్వరగా ఛేదిస్తామని తెలిపారు.

06/20/2018 - 12:17

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో గవర్నర్‌ పాలన విధించాలంటూ మంగళవారం గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. గవర్నర్ పాలనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు ఉదయం ఆమోదం తెలిపారు. దీంతో కాశ్మీర్‌లో నేటి నుంచి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది.

06/20/2018 - 05:48

బెంగళూరు: పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే విషయంలో కాంగ్రెస్-జేడీఎస్‌ల మధ్య విభేదాలు పొడచూపాయన్న వార్తలను కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఖండించారు. జూలై మొదటి లేదా రెండోవారంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి యోచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ‘‘ సిద్దరామయ్య వ్యక్తిగతంగా ఒక సలహా ఇచ్చారు. రాబోయే రెండు రోజుల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తాం’ అన్నారు.

06/20/2018 - 02:39

న్యూఢిల్లీ, జూన్ 19: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురైన ఓటమితో భయపడిపోయిన బీజేపీ అధినాయకత్వం ఈ సంవత్సరాంతంలో జరిగే మూడు రాష్ట్రాల శాసన సభలు, వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలకోసం ఇప్పటినుంచే వ్యూహ రచనకు ఉపక్రమించింది. మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకులతో సూరజ్‌కుండ్‌లో మూడు రోజులపాటు సమాలోచనలు జరిపింది.

Pages