S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/21/2018 - 17:40

కోల్‌కతా: బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని యత్నిస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు క్రైస్తవులు, ముస్లింలతోపాటు హిందువుల మధ్య కూడా చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

06/21/2018 - 16:41

ఢిల్లీ : యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీతో విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ గురువారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే సోనియాను కలిశానని చెప్పారు. తమ మధ్య పొత్తుకు సంబంధించిన చర్చ రాలేదని, తమిళనాడు రాజకీయాల గురించే మాట్లాడామని తెలిపారు.

06/21/2018 - 13:11

డెహ్రాడూన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానితో కలిసి 55 వేల మంది ఔత్సాహికులు యోగాఆసనాలు వేశారు. అలాగే వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన యోగా వేడుకల్లో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

06/21/2018 - 12:39

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మోరెనా ప్రాంతంలో గురువారం ప్రయాణికులతో వెళ్తున్న జీపును ఇసుక ట్రాక్టర్‌ వేగంగా ఢీకొట్టడంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విషాదకరం. గ్వాలియర్‌కు చెందిన కొందరు తమ బంధువు అంత్యక్రియలకు జీపులో బయల్దేరారు. మార్గమధ్యంలో గంజమపూర్‌ వద్ద మలుపు తిరుగుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ ఢీకొట్టింది.

06/21/2018 - 05:23

న్యూఢిల్లీ: నాల్గవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దేశ వ్యాప్తంగా యోగా సంస్థలు విస్తృత ఏర్పాట్లుచేశాయి. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం విదితమే. యోగా అంటే ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. ఆయన గురువారం డెహ్రాడూన్‌లో 55 వేల మంది ప్రజల సమక్షంలో జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.

06/21/2018 - 04:59

న్యూఢిల్లీ/శ్రీనగర్, జూన్ 20: జమ్ము-కశ్మీర్‌లో గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. గత దశాబ్దకాలంలో జమ్ము-కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించడం ఇది నాలుగోసారి. బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో, పీడీపీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. జమ్ము-కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించక తప్పదన్న పలువురి అంచనాలు నిజమయ్యాయి.

06/21/2018 - 05:03

న్యూఢిల్లీ, జూన్ 20: ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింప జేసేందుకు ప్రత్యేక కార్యచరణ పథకాన్ని సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి ఉమన్ చాందీ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని చాందీ ఆరోపించారు.

06/21/2018 - 05:04

న్యూ ఢిల్లీ, జూన్ 20: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా చేశారు. కేంద్రంలో కీలకమైన బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనానమిక్స్‌లో సీనియర్ ఫెలోగా పనిచేశారు. ఆయన వయస్సు 59 ఏళ్లు. రఘురాం రాజన్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియమితులు కావడంతో, ప్రధాన ఆర్థిక సలహాదారు పదవిలో సుబ్రమణియన్ చేరారు.

06/21/2018 - 02:41

మాస్కో, జూన్ 20: ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల సమితి నుంచి అమెరికా వైదొలగడాన్ని దురదృష్టకరమైన సంఘటనగా రష్యా అభివర్ణించింది. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న అనేకానేక పరిణామాలపై అమెరికా ఏకపక్ష విధానాలను అనురిస్తున్నదనడానికి ఇదో నిదర్శనమని ఒక ప్రకటనలో తెలిపింది. మానవ హక్కులను కాలరాస్తున్న చైనా, క్యూబా, వెనెజులా, కాంగో తదితర దేశాల బాటనే అమెరికా కూడా అనుసరిస్తున్నదని విమర్శించింది.

06/21/2018 - 02:35

లక్నో, జూన్ 20: కాశ్మీర్‌లో కాల్పుల విరమణను ఆసరాగా చేసుకుని అనేక మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి చొరబడ్డారని, వీరిని కదలికలను గుర్తించి తుదముట్టిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద సంస్థలకు చెందిన దళాలు చురుకుగా పనిచేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఉగ్రవాదులను ఏరివేస్తామన్నారు.

Pages