S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/19/2018 - 12:39

తారాబాది: బీహార్‌లో దారుణం జరిగింది. ఓ కారు ప్రమాదవశాత్తు చెరువులో పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. తారాబాది సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో చిన్నారిని కాపాడారు.

06/19/2018 - 13:24

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ సుదీర్ఘకాలం, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ఇవాళ తన ట్వీట్‌లో వెల్లడించారు.

06/19/2018 - 05:46

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. బీజేపీ యేతర ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడిపోయింది. కొత్త డిప్యూటీ చైర్మన్ పదవిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్‌సీపీతోపాటు ఒడిశ్శాకు చెందిన బీజూ జనతా దళ్ పార్టీల మద్దతు కీలకంగా మారింది.

06/19/2018 - 02:55

న్యూఢిల్లీ, జూన్ 18: హిందువుల ఓట్ల కోసం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు పాకులాడుతున్నాయని ఎమ్‌ఐఎమ్ అధ్యక్షుడు ఒవైసీ అన్నారు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

06/19/2018 - 02:51

పనాజీ, జూన్ 18: ఈఏడాది చివరినాటికి గోవాను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. అమెరికాలో వైద్య చికిత్సలు పొంది సంపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలిసారి బహిరంగ సభలో మాట్లాడారు. ‘వలసపాలనకు వ్యతిరేకంగా మనం చేసిన పోరాటం అయిపోయిందని నేను భావించడం లేదు. మన ముందు అనేక సమస్యలున్నాయి.

06/19/2018 - 02:27

న్యూఢిల్లీ, జూన్ 18: అరవింద్ కేజ్రీవాల్ నిరసన, బీజేపీ వైఖరి వల్ల ఢిల్లీ నగరంలో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయంటూ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంక్షోభాన్ని సరిగ్గా అంచనా వేయడం లేదంటూ ఆరోపించారు. ‘్ఢల్లీ ముఖ్యమంత్రి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నాకు దిగారు. ఇక బీజేపీ ముఖ్యమంత్రి ఇంటి వద్ద ధర్నాకు దిగింది.

06/19/2018 - 01:59

న్యూఢిల్లీ, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని మాత్రమే కేంద్రరైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ఏన్డీయే ప్రభుత్వం గత నాలుగేళ్లలో రైల్వేశాఖ చేపట్టిన సంక్షేమ కార్యకలపాలు, అభివృద్ధికి సంబంధించిన విషయాలను ఆయన విలేఖరులకు వివరించారు.

06/19/2018 - 04:49

న్యూఢిల్లీ, జూన్ 18: ‘్ధర్నాలు చేసేది పనిప్రదేశాలు, ఇళ్లల్లో కాదు. బయట. మరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేయడానికి కేజ్రీవాల్‌కు ఎవరు అధికారమిచ్చారు?’ అంటూ ఢిల్లీ హైకోర్టు చీవాట్లు పెట్టింది. కేజ్రీవాల్ నిరనసనపై ఒకటి, ఐఏఎస్ అధికార్ల సమ్మెపై మరొకటి...మొత్తం రెండు పిటిషన్లపై జస్టిస్ ఏకే చావ్లా, జస్టిస్ నవీన్ చావ్లాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.

06/18/2018 - 18:08

న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నివాసంలో బైఠాయింపు ధర్నా జరుపుతుండటంపై 'ఆమ్ ఆద్మీ పార్టీ'ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. ధర్నాకు ఎవరు అనుమతించారని నిలదీసింది. వీరి దీక్షపై హైకోర్టులో రెండు పిటిషన్లు పడ్డాయి. దీనిపై న్యాయవాదులు ఏకే చావ్లా, నవీన్ చావ్లా విచారణ చేపట్టారు.'మీ 'సమ్మె'ను 'సమ్మె'గా భావించలేమని అన్నారు. పిటిషన్లపై తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.

06/18/2018 - 16:48

న్యూఢిల్లీ : అన్ని రాష్ర్టాల కంటే ఎక్కువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కే విద్యాలయాలు మంజూరు చేశామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 15 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్యార్థులకు సిలబస్ తగ్గించి సామాజిక విద్య నేర్చుకునేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Pages