S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/10/2018 - 12:56

న్యూఢిల్లీ: కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ఇచ్చిన భారత్‌బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. ఈ బంద్‌కు ఏ ఒక్క పార్టీ బాధ్యత వహించలేదు. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కొన్నిచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో 144వ సెక్షన్‌ను విధించారు.

04/10/2018 - 12:55

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైకాపా ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షలు ఐదవరోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ దీక్షల్లో పాల్గొన్న ఎంపీల్లో ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షలకు సంఘీభావంగా జిల్లా కేంద్రాల్లో వైకాపా శ్రేణులు ధర్నాలు నిర్వహిస్తున్నారు.

04/10/2018 - 13:14

న్యూఢిల్లీ: మహారాష్టల్రోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ రహదారులు నెత్తురోడాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్టల్రోని సతారా జిల్లాలో కూలీలతో వెళుతున్న ఓ ట్రక్కు మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో సతార సమీపంలో ఖాంబట్కీ సమీపంలో మూల మలుపు తిరుగుతుండగా..

04/10/2018 - 04:48

న్యూఢిల్లీ: వంద రోజుల వ్యవధిలో ప్రగతి కార్యాచరణ రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. పీఎస్‌యూలను అన్ని విధాలుగా శక్తివంతం చేయడంతోపాటు అభివృద్ధి కార్యకలాపాలను ఇవి ప్రోత్సహించే విధంగా ఉండేలా ఈ రోడ్‌మ్యాప్ ఉండాలని సోమవారం నాడిక్కడ జరిగిన సీపీఎస్‌ఈ సదస్సులో మోదీ ఉద్ఘాటించారు.

04/10/2018 - 03:14

చెన్నై: కావేరీ జల వివాదం చెన్నైలో నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌లపైనా ప్రభావం చూపనుంది. కర్నాటకకు నీటి కేటాయింపులు పెంచి తమిళనాడుకు అన్యాయం చేశారంటూ పెద్దఎత్తున నిరసనలు నిర్వహిస్తున్న రాజకీయ పార్టీలు, తమిళనాడు ప్రజా సంఘాలు చెన్నైలో జరిగే మ్యాచ్‌లనూ అడ్డుకుంటామని అంటున్నారు. రాష్ట్రం రగిలిపోతుంటే, క్రికెట్ వినోదాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

04/10/2018 - 02:59

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సోమవారం రాజ్‌ఘాట్ వద్ద జరిగిన నిరాహారదీక్షను ఓ ప్రహసనంగా బీజేపీ అభివర్ణించింది. 1984లో ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితులైన సజ్జన్ కుమార్, జగదీశ్ టైట్లర్‌లను ఈ నిరసన వేదిక వద్ద కూర్చోనివ్వకపోవడం ‘నేరాన్ని ఒప్పుకోవడం’గా అభివర్ణించింది.

04/10/2018 - 02:59

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: తెలుగుదేశం ఎంపీలు కేవలం ప్రచారం కోసం వీధి నాటకాలకు తెర లేపారని బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేవలం రాజకీయ అభద్రతోనే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి టీడీపీ కేంద్రంపై ఆందోళనలు చేస్తోందని చెప్పారు. టీడీపీ ఎంపీలు ప్రధాని నివాసం ముట్టడికి వెళ్తే, పోలీసులు వారి పని వారు చేస్తారు కదా అని ఆయన అన్నారు.

04/10/2018 - 02:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించి గోధుమ పంటను రైతులనుంచి సేకరించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు 19.31 లక్షల టన్నుల గోధుమ ధాన్యాన్ని సేకరించినట్టు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 320 లక్షల టన్నుల గోధుమను సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.

04/10/2018 - 02:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని, ఇరు దేశాలు ప్రశాంత పరిస్థితులను పరిరక్షించుకుతీరాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

04/10/2018 - 02:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: రైల్వేలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అవినీతి తారస్థాయిలో కొనసాగుతున్నదని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నివేదిక స్పష్టం చేసింది. అయితే 2016లో ఈ అవినీతిపై వచ్చిన ఫిర్యాదులతో పోలిస్తే 2017లో 50 శాతం వరకు తగ్గిపోయాయని, సీవీసీ వెల్లడించింది. 2017 సంవత్సరానికి సీవీసీ వార్షిక నివేదికను పార్లమెంట్‌లో ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టింది.

Pages