S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/30/2018 - 12:52

శబరిమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలలో శుక్రవారం అపశ్రుతి చోటు చేసుకుంది. అయ్యప్పస్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు శబరిమలలోని నీలిమలైలో ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఊరేగింప కొనసాగుతున్న సమయంలో ఓ ఏనుగు పరుగులు తీసింది. దీంతో తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులతో పాటు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

03/30/2018 - 12:37

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహలో 200లకు పైగా కోతులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాయి. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేశారు. అమ్రోహకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. కోతుల మృతికి గల కారణాలపై దృష్టి సారించారు. ఆ గ్రామంలోని డ్రైనేజీలో ఉన్న శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. కోతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బరేలికి తరలించారు.

03/30/2018 - 12:21

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ క్రికెటర్ సిద్దూ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. 2014-15 దాఖలుచేసిన ఆదాయం పన్ను రిటర్న్స్‌లో అవకతవకలు జరిగినట్లు వెల్లడవ్వటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జనవరిలోనే అధికారులు సిద్దూకు నోటీసులు జారీ చేశారు. సిద్దూ అప్పీల్‌కు వెళ్లటంతో దీనిపై కమిషనర్ తీర్పు చెబుతూ పన్ను కట్టాల్సిందేనని తెలిపారు.

03/30/2018 - 12:20

బ్యాంకాంక్: ధాయిలాండ్ రాజధాని బ్యాంకాంక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో డ్రైవర్‌తో సహా 20 మంది ప్రయాణీకులు సజీవ దహనం అయ్యారు. వీరంతా మయన్మార్‌కు చెందిన ప్రయాణీకులు. ప్రమాదం జరిగేటపుడు బస్సులో 48 మంది ప్రయాణీకులు ఉన్నారు. డ్రైవర్ డ్రగ్స్ తీసుకుని బస్సు నడుపుతున్నట్లు తెలిసింది.

03/30/2018 - 04:38

చెన్నై: సాధ్యమైనంత త్వరగా కావేరీ జలాల నిర్వహణ బోర్డును (సీఎంబీ) ఏర్పాటు చేయాలని, నటుడు, మక్కల్ నీతి మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ప్రధానిగా మీకు కావేరీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసే అధికారం ఉంది. అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఆ దిశగా చర్యలు తీసుకోండి’ అని ఇక్కడ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

03/30/2018 - 04:30

న్యూఢిల్లీ, మార్చి 29: న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ కలుగజేసుకుంటున్న అంశంపై న్యాయమూర్తులతో సమావేశం ఏర్పాటుచేయాలని కోరుతూ సీనియర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు మార్చి 21న ఒక లేఖ రాశారు.

03/30/2018 - 04:27

ఇస్లామాబాద్, మార్చి 29: మానవ హక్కులు, బాలికల విద్యకోసం ప్రచారం చేస్తూ నోబెల్ బహుమతిని అందుకున్న మలాల యూసఫ్‌జాయ్ గురువారం తన మాతృభూమి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఆమె రక్షణకు అక్కడి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. 2012లో తాలిబన్ మిలిటెంట్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మలాలాను చికిత్స నిమిత్తం బ్రిటన్‌కు తరలించిన విషయం తెలిసిందే.

03/30/2018 - 03:56

న్యూఢిల్లీ, మార్చి 29: ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగప్రవేశం చేయాలి.. రాష్ట్ర విభజనపై తాను సుప్రీం కోర్టులో వేసిన కేసు.. పోలవరంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు రాష్ట్ర హైకోర్టులో వేసిన కేసుల్లో ప్రభుత్వం తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయించాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

03/30/2018 - 04:02

న్యూఢిల్లీ, మార్చి 29: సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీక్‌పై ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ట్విటర్ వేధికగా చేసుకుని మోదీపై ఘాటైన విమర్శలు చేశారు. ‘మోదీ సర్కార్‌లో లీకులే లీకులు. డేటా లీక్. ఆధార్ లీక్. ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ లీక్. ఎలక్షన్ డేట్ లీక్.. ఇప్పుడు సీబీఎసీఈ పేపర్ల లీక్, యాతావాతా చౌకీదార్ వీక్’ అంటూ కాంగ్రెస్ చీఫ్ సెటైర్లు వేశారు.

03/30/2018 - 04:03

న్యూఢిల్లీ, మార్చి 29: సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. సీబీఎస్‌ఈ టెన్త్ మేథ్స్, ట్వెల్త్ ఎకనామిక్స్ పేపర్ల లీక్‌కు సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జావడేకర్, బోర్డు చైర్‌పర్సన్ అనితాకర్వాల్‌ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పరీక్షా పేపర్ల లీక్‌పై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.

Pages