S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/31/2018 - 01:19

న్యూఢిల్లీ, జనవరి 30: భారత అభివృద్ధి మాగాణిలో సిరులు పండుతున్నాయి. ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న దేశంగా సరికొత్త వెలుగులను సంతరించుకుంది. 2017 సంవత్సరానికి జరిగిన సంపద గణాంకాల్లో 8,230 బిలియన్ డాలర్లతో భారత్ ఆరోస్థానాన్ని సంతరించుకుందని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది.

01/31/2018 - 00:49

న్యూఢిల్లీ, జనవరి 30: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఐదేళ్లకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను రద్దుచేయనున్నారు. ఈ మేరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని అన్ని మంత్రిత్వశాఖలను కేంద్రం ఆదేశించింది.

01/30/2018 - 03:55

గణతంత్ర దినోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ‘బీటింగ్ రిట్రీట్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరైనారు.

చిత్రం.. కార్యక్రమానికి వస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్

01/30/2018 - 03:20

శ్రీనగర్, జనవరి 29: జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్రికులపై దాడి కేసుకు సంబంధించి 11 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులపై పోలీసులు సోమవారం చార్జిషీట్ దాఖలు చేశారు. 2017 జూలైలో జరిగిన ఉగ్రదాదిలో ఎనిమిది మంది యాత్రికులు మృతి చెందారు. రణ్‌బీర్ పీనల్‌కోడ్ కింద (ఐపీసీ లాంటిదే) వివిధ సెక్షన్లు నిందితులపై పెట్టారు.

01/30/2018 - 03:19

న్యూఢిల్లీ, జనవరి 29: ఈ సంవత్సరాంతంలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరిపే ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది.

01/30/2018 - 03:18

బహరాంపూర్, జనవరి 29: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ప్రయాణికుల బస్సు కాల్వలోకి బోల్తాపడ్డ ఘటనలో 36 మంది మృతి చెందారు. ఘోగ్రా వద్ద వంతెన రైలింగ్‌ను ఢీకొని బస్సు కాల్వలో పడిపోయింది. దుర్ఘటనలో 36 మంది మృతి చెందగా, వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. సమాచారం తెలిసినా పోలీసులు సంఘటనా స్థలానికి సకాలంలో చేరుకోలేదని స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

01/30/2018 - 03:15

చిత్రం..తమిళనాట బస్సు చార్జీలు పెంచినందుకు నిరసనగా విపక్షాలు నిర్వహించిన ఆందోళనతో చెన్నైలో సోమవారం స్తంభించిన ట్రాఫిక్

01/30/2018 - 03:13

న్యూఢిల్లీ, జనవరి 29: దేశంలో తొమ్మిది ఎన్నికల ట్రస్టుల నుంచి రాజకీయ పార్టీలకు 637.54 కోట్ల రూపాయలు విరాళాలు అందాయి. 2013-14,2016-17 కాలంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక్క పార్టీకే 488.94 కోట్ల రూపాయలు వచ్చాయి. కాంగ్రెస్‌కు 86.65 కోట్ల రూపాయల విరాళంగా దక్కాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సోమవారం ఇక్కడ వెల్లడించింది.

01/30/2018 - 03:13

న్యూఢిల్లీ, జనవరి 29: విభజన సమయంలో ఉత్తరాంధ్రాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉత్తరంధ్ర చర్చా వేదిక కన్వినర్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యర్వంలో ఐదు రోజులపాటు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు జరుగుత్ను అన్యాయంపై అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో వివరించానున్నారు.

01/30/2018 - 03:10

న్యూఢిల్లీ, జనవరి 29: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వారికి భరోసా కల్పిచేందుకే ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Pages