S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/03/2018 - 22:47

న్యూఢిల్లీ, జనవరి 3: ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించే అంశంపై ఎన్‌డిఏ మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తో కలిసిపోయింది.

01/03/2018 - 22:46

పనాజీ, జనవరి 3: గోవాలోని ఐఎన్‌ఎస్ హన్స నేవల్ బేస్‌లో బుధవారం మధ్యాహ్నం ఎంఐజీ 29కే యుద్ధ విమానం పైకి లేచే సమయంలో రన్‌వే నుంచి జారిపడింది. అయితే, పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఈ యుద్ధ విమానాన్ని సురక్షితంగా యథాస్థానానికి చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారత నావికాదళంలో కొత్తగా చేరిన ఎంఐజీ 29కే యుద్ధ విమానానికి ఈ తరహా ఘటన ఎదురుకావడం ఇదే ప్రథమం.

01/03/2018 - 22:44

న్యూఢిల్లీ, జనవరి 3: ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా ప్రకటించడానికి నిబంధనలు అవరోధంగా మారాయని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఐరాసలో హిందీ భాష అమలుకు అవసరమయ్యే 4 బిలియన్లు ఖర్చుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బుధవారం ఇక్కడ తెలిపారు. ‘ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం మొత్తం సభ్యుల్లో మూడింట రెండో వంతు సభ్యుల మద్దతు ఉండాలి.

01/03/2018 - 22:41

ముంబయి, జనవరి 3: భీమా-కొరెగావ్ యుద్ధం 200వ వార్షికోత్సవం సందర్భంగా చెలరేగిన హింసకు నిరసనగా బుధవారం జరిగిన మహారాష్ట్ర బంద్‌లో అక్కడక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. భారిపా బహుజన్ మహాసంఘ్ నేత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపు మేరకు మహారాష్ట్ర బంద్ జరిగింది.

01/03/2018 - 22:37

కేంద్రం సమాధానం చెప్పాలని లోక్‌సభలో కాంగ్రెస్ డిమాండ్
ఓటమిని జీర్ణించుకోలేకే ఆరోపణలు: బీజేపీ
రాజ్యసభలో చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు
సభా కార్యక్రమాలకు అంతరాయం.. వాయిదాలు

01/03/2018 - 03:30

మంచు కమ్మినా పొగమంచు కుమ్మేసినా ఆగనిది జీవన పోరాటం. చలికి వణుకుతూ బతుకు బండిని నడిపించాల్సిందే. అది కాలి నడకైనా సైకిలైనా మరో వాహనమైనా మంచు ఏటికి ఎదురీదాల్సిందే. మంచుతో పాటు కాలుష్యం కాటేస్తున్నా దిలాసాగా ఉండలేని బతుకు పోరాటమిది. అమృత్‌సర్‌లో ఈ దృశ్యాన్ని చూసిన ఎవరికైనా ఎవరి మదిలోనైనా కలిగే భావన ఇదే. రెక్కాడితే డొక్కాడని బడుగు
జీవులకు నిత్య పోరాటంతోనే
జీవనం సాగేది.

01/03/2018 - 03:30

ఏసీ కార్లు, విమానాలే పార్లమెంటు సభ్యుల జీవితాలనుకుంటాం. వీటికి అతీతంగా ఓ సామాన్యుడిలా సైకిల్‌పై వెళ్లే అసామాన్యులు ఉంటారని చెప్పడానికి ఈ చిత్రానికి మించిన నిదర్శనం మరొకటి ఉండదు. ఎప్పుడో ఎంపీలు బస్సుల్లో వెళ్లడం, రిక్షాల్లో వెళ్లడం జరిగేది. ఇప్పుడు కాలం మారింది. వీటి జోలికి ఎవరూ పోవడం లేదు. కానీ కేంద్రంలో అధికారం తమదే అయనా బిజెపి రాజ్యసభ సభ్యుడు వికాస్ మహాత్మే మాత్రం తన రూటే వేరంటున్నారు.

01/03/2018 - 03:29

పల్వాల్, జనవరి 2: హర్యానాలోని పల్వాల్‌లో మంగళవారం వేకువజామున దారుణం చోటుచేసుకుంది. మతిభ్రమించిన ఓ మాజీ సైనిక ఉద్యోగి ఇనుపరాడ్‌తో ఆరుగుర్ని కొట్టి చంపేశాడు. తెల్లవారుజామున 2.30 నుంచి 3.30 మధ్య ఈ బీభత్సకాండ సాగింది. పోలీసుల కథనం ప్రకారం నరేష్ ధన్‌కాడ్ అనే 40ఏళ్ల వ్యక్తి సైన్యంలో లెఫ్టినెంట్‌గా పనిచేశాడు. ఆరోగ్య కారణాలతో 2003లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.

01/03/2018 - 03:28

న్యూఢిల్లీ, జనవరి 2: లెసతో అభివృద్ధి సాధనకు భారత్ అన్ని విధాలా సహకారం అందించడానికి కట్టుబడి ఉందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎన్నికైన దల్వీర్ భండారీ సహా బహుపాక్షిక కార్యవర్గాల ఏర్పాటు విషయంలో భారత్‌కు లెసతో అందిస్తున్న సహకారం మర్చిపోలేనిదన్నారు. ఈమేరకు రాష్టప్రతి కార్యాలయం ఓ అధికారిక ప్రకటన వెలువరించింది.

01/03/2018 - 03:27

న్యూఢిల్లీ, జనవరి 2: నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు-2017 పార్లమెంట్ సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మంగళవారం జరగాల్సిన వైద్యుల సమ్మె ఉపసంహరించుకున్నారు. బిల్లును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్‌పేషెంట్ సేవలు 12 గంటల పాటు నిలిపివేయాలని ఐఎంఐ నిర్ణయించింది.

Pages