S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/12/2017 - 02:47

న్యూఢిల్లీ,డిసెంబర్ 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ ప్రధానమంత్రులు, మాజీ సైన్యాధ్యక్షులను అవమానాలకు గురిచేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోపించారు. మన్మోహన్ సింగ్ సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన బాధ, ఆవేదనను వ్యక్తం చేశారు.

12/12/2017 - 02:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: గుజరాత్ ఎన్నికల్లో బేజేపీని ఓడించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పాకిస్తాన్‌తో చేతులు కలిపారంటూ ఆరోపణలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

12/12/2017 - 02:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలిగించే పాక్షిక అవరోధాలను తొలగించుకోవడంపై చైనా, రష్యా విదేశాంగ మంత్రులతో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చర్చలు జరిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌తో ద్వైపాక్షిక అంశాలపై సుష్మ వేర్వేరుగా సమావేశమైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

12/12/2017 - 02:43

మీర్జాపూర్/లక్నో, డిసెంబర్ 11: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో మరిహాన్‌లోని కృషి విజ్ఞాన్ కేంద్రం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. నలుగురు గాయపడ్డారు. ఒక ట్రక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సీతాలాధమ్ ఆలయంలో జరుగుతున్న జాతరకు జనాన్ని తీసుకెళ్లి తిరిగి వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఓ ట్రక్‌ను బలంగా ఢీకొందని మీర్జాపూర్ ఎస్పీ అశీష్ తివారీ వెల్లడించారు.

12/12/2017 - 02:43

ముంబయి, డిసెంబర్ 11: బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్‌కుమార్ సోమవారం నాడు 95వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఈ ఏడాది ఆయన జన్మదినాన్ని కుటుంబ సభ్యులు, అశేష అభిమానులు వేడుకగా జరుపుకున్నారు. ‘ఆయన ఆరోగ్యం కుదుటపడింది.. అల్లా దయ వల్ల అంతా బాగానే ఉంది.. ఆయనకు సంబంధించిన తాజా ఫొటోను వారంలోగా విడుదల చేస్తాం..’ అని దిలీప్ భార్య సైరాబాను ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

12/12/2017 - 02:41

విస్తారా విమానంలో సినీనటి జైరా వాసిమ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భావిస్తున్న వికాస్ సచ్‌దేవ్‌ను ముంబయ పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు. అనంతరం దిందోషి గోరెగావ్ కోర్టులో హాజరుపరిచారు.

12/12/2017 - 02:39

ఆపైన కాశ్మీరం.. ఇంకేముంది..
జమ్ముకాశ్మీర్ కొత్త అందాలను సింగారించుకుంది. వారం రోజులుగా విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఆ రాష్ట్రం ఇలా కనువిందు చేస్తోంది.

12/12/2017 - 01:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: పోలవరం జాతీయ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌గడ్కరీ సోమవారం మీడియాకు వెల్లడించారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామన్నారు. తాను, సీఎం చంద్రబాబు కలిసి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం. లక్ష్య సాధనకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

12/12/2017 - 01:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నేటినుంచి రాహుల్ శకం మొదలైంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం పార్టీ అధ్యక్ష కిరీటం పెట్టారు. కాంగ్రెస్ పదహారవ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని కాంగ్రెస్ ఎన్నికల సంఘం అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ ఏఐసిసిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

12/12/2017 - 00:45

ముంబయి, డిసెంబర్ 11: ఇందజాలాన్ని కళగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న ముంబయి మహా నగరంలో ‘జాదూ ఉత్సవ్’పేరిట ఓ సమావేశం జరుగుతోంది. అలాగే ఇంద్రజాలికులకు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడంతోపాటు కళను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఆఫ్ ఇల్యూసియోనిస్ట్ అండ్ మెజీషియన్స్ (ఏఐఎం) కోరుతోంది.

Pages