S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/29/2016 - 04:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై కేంద్రానికి త్వరలోనే నివేదిక ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిజిటల్ ఉపసంఘం కన్వీనర్ చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు అధ్యక్షతన బుధవారం నీతి ఆయోగ్ కార్యాలయంలో జరిగిన ఉపసంఘం సమావేశానికి సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, సిఇవో అమితాబ్ కాంత్ తదితరులు హాజరయ్యారు.

12/29/2016 - 04:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 28:మరో రెండు రోజుల్లో పెద్ద నోట్ల రద్దు డిపాజిట్ గడువు పూర్తికానున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ఓ కీలక ఆర్డినెన్స్ జారీ చేసింది. మార్చి 31 తర్వాత కూడా రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను భారీ పరిమాణంలో కలిగి ఉంటే క్రిమినల్ నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

12/29/2016 - 04:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఎన్నికల సంఘం ఏ క్షణంలోనయినా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. షెడ్యూల్ విడుదల అయిన వెంటనే ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుతూ ఇసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం దీన్ని సూచిస్తోంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 4వ తేదీలోగా ప్రకటించే అవకాశం ఉందని కమిషన్ వర్గాలు వెల్లడించాయి.

12/29/2016 - 04:06

ముంబయి, డిసెంబర్ 28: నోట్ల రద్దుతో అల్లాడుతున్న జనానికి రిజర్వ్ బ్యాంక్ మరింత ఊరటనిచ్చింది. కోటి రూపాయల వరకు ఉండే గృహరుణాలు, కారు, పంట రుణాలు, ఇతర రుణాల చెల్లింపులకు ఇప్పటికే 60 రోజుల వెసులుబాటు ఇచ్చిన ఆర్‌బిఐ అదనంగా మరో 30 రోజుల గడువు ఇచ్చింది. సమీక్ష అనంతరం నవంబర్ 21న ఇచ్చిన 60 రోజుల గడువుకు అదనంగా మరో 30 రోజుల గడువు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్‌బిఐ బుధవారం తెలిపింది.

12/29/2016 - 04:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: పాలనలో ఏపిలో అమలవుతున్న అధునాతన విధానాలపై హర్యానా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందం కుదర్చుకుంది. బుధవారం నాడు ఏపి భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు.

12/28/2016 - 02:25

చెన్నై, డిసెంబర్ 27: రద్దయిన పెద్ద నోట్లను కోట్లాది రూపాయల మేర కొత్త నోట్లతో మార్చుకున్న కేసులో అరెస్టయిన ఇసుక మైనింగ్ వ్యాపారి శేఖర్ రెడ్డి, మరో నలుగురి బెయిల్ పిటిషన్లకు సంబంధించి తీర్పు 30కి వాయిదా పడింది. ప్రిన్సిపల్ ప్రత్యేక సిబిఐ కోర్టు న్యాయమూర్తి విజయలక్ష్మి ముందు నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదన వినిపించారు.

12/28/2016 - 01:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాల్ని ఛేదించి, అణ్వస్త్రాలను ప్రయోగించగలిగే శక్తి సామర్థ్యాలున్న అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం కావటంతో డిఆర్‌డిఓ శాస్తవ్రేత్తల్లో ఉత్సాహం మిన్నంటింది. ఇక తరువాతి లక్ష్యంగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అగ్ని-6 క్షిపణిని రూపొందించాలని శాస్తవ్రేత్తలు నిర్ణయించారు.

12/28/2016 - 01:55

ఘజియాబాద్, డిసెంబర్ 27: తన జన్‌ధన్ ఖాతాలో 100 కోట్ల రూపాయలు డిపాజిట్ అవడం చూసి నివ్వెర పోయిన ఓ మహిళ తన ఫిర్యాదును బ్యాంకు అధికారులు పట్టించుకోకపోవడంతో నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

12/28/2016 - 01:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: పెద్దనోట్ల రద్దు తన లక్ష్యాన్ని సాధించటంలో విఫలమైందని, నోట్లరద్దు తరువాత అవినీతి మరింత పెరిగిందని, ఉగ్రవాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయని కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్, జెడి (ఎస్), ఆర్‌జెడి, జెఎంఎం, ఏఐయుడిఎఫ్ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.

12/28/2016 - 01:50

కడప, డిసెంబర్ 27: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, కడప జిల్లా ఓబులవారిపల్లె మధ్య నిర్మిస్తున్న రైల్వే సొరంగం ఆసియా ఖండంలోనే అతి పెద్దదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కడప జిల్లా చిట్వేలి మండలం చెర్లోపల్లె సమీపంలో నిర్మిస్తున్న సొరంగాన్ని వెంకయ్యనాయుడు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండలో సొరంగం తొలిచి ఏర్పాటుచేసి రైల్వేలైన్ పనులు చివరదశకు చేరాయన్నారు.

Pages