S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/30/2016 - 02:00

ఇటానగర్, డిసెంబర్ 29:అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం అనూహ్యమైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.

12/30/2016 - 01:42

న్యూఢిల్లీ/సికింద్రాబాద్, డిసెంబర్ 29:దశాబ్దాల కల సాకారమైంది. ఇరవైఏళ్లుగా పట్టాలెక్కని జగిత్యాల-మోర్తాడ్ రైలు కూత పెట్టింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం రైల్వే భవన్‌లోఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ రైలును ప్రారంభించారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలు కె కవిత హాజరయ్యారు.

12/30/2016 - 01:28

చెన్నై, డిసెంబర్ 29: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణంపై చెలరేగుతున్న అనుమానాలకు మద్రాసు హైకోర్టు గురువారం చేసిన తీవ్ర వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. చివరి క్షణం వరకూ కోలుకుంటున్నారంటూ ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో జయలలిత ఆకస్మికంగా మరణించడంపై తమకూ అనుమానాలున్నాయని న్యాయమూర్తులు ఎస్ వైద్యనాథన్,పార్థిబన్‌లతో కూడిన హైకోర్టు సెలవుకాలపు బెంచి పేర్కొంది.

12/30/2016 - 01:26

చెన్నై, డిసెంబర్ 29: దాదాపుమూడు దశాబ్దాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వెన్నంటి ఉండి తెరవెనుక అధికార కేంద్రంగా వెలిగిన ఆమె సన్నిహితురాలు వికె శశికళ అధికార అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ సర్వసభ్య మండలి సమావేశానికి శశికళ హాజరు కాకపోయినా ఆమెకు సర్వాధికారాలు కట్టబెడుతూ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు.

12/30/2016 - 01:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: నల్ల కుబేరుల గుట్టు రట్టయ్యే రోజులు దగ్గర పడ్డాయని, వారికెంత మాత్రం దాక్కోలేరని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. నిజాయితీ పరుల జోలికి వెళ్ల..అక్రమార్కులను వదిలిపెట్టమని గురువారం ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దును గట్టిగా సమర్ధించుకున్న మోదీ ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు.

12/30/2016 - 01:52

తిరుపతి, డిసెంబర్ 29: తిరుపతి-వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ను ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం ప్రారంభించారు.

12/30/2016 - 01:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: మార్చి 31 తర్వాత కూడా రద్దయిన పెద్ద నోట్లను కలిగి ఉంటే జరిమానానే తప్ప జైలు శిక్ష ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం జారీ చేసిన ఆర్డినెన్స్‌లో జైలు శిక్ష నిబంధనను తొలగించింది. రద్దయిన నోట్లను పదికి పైగా మార్చి 31 తర్వాత కూడా కలిగి ఉంటే కనీస జరిమానాగా పదివేల రూపాయలు లేదా పట్టుబడ్డ మొత్తం విలువకు ఐదు రెట్లు జరిమానా తెలిపింది.

12/30/2016 - 01:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: దేశంలోని ప్రజారోగ్య కేంద్రాల లోపల చుట్టుపక్కల అత్యుత్తమమైన పరిశుభ్రమైన వాతావరణం, ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించే అలవాట్లను ప్రోత్సహించడానికి కేంద్రం గురువారం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్వచ్ఛ్, స్వాస్థ్ సర్వత్ర’గా పిలవబడే ఈ కార్యక్రమం కింద దేశంలోని 708 బహిరంగ మల విసర్జన రహిత బ్లాక్‌లలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కోదానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు.

12/30/2016 - 01:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: తన వద్ద 13,860 కోట్ల రూపాయల నల్లధనం ఉన్నదంటూ తప్పుడు ప్రకటన చేసిన మహేష్ షాతో ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు సంబంధం ఉన్నదంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా చేసిన ఆరోపణలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు.

12/30/2016 - 01:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం కింద సొంత ఇల్లు లేని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించడానికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి ఆ కుటుంబాల్లోని మహిళా సభ్యులకు భూమిని కేటాయించాలని ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.

Pages