S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/31/2016 - 00:57

ముంబయి, డిసెంబర్ 30: మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఎటిఎస్) మాజీ సీనియర్ ఇన్‌స్పెక్టర్ మెహమూద్ ముజావర్ సోలాపూర్ కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2008లో జరిగిన మాలెగావ్ పేలుళ్ల కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు వాస్తవానికి చనిపోయారని, అయితే ఉన్నతాధికారులు మాత్రం వారు ఇంకా బతికే ఉన్నారని చెబుతున్నారని ఆయన అన్నారు.

12/31/2016 - 00:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 30 : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. గతంలో చేసిన ఐదు ప్రశ్నలనే రాహుల్ సంధించారు. రాహుల్ గాంధీ వారం రోజుల క్రితం మోదీకి ఇవే ప్రశ్నలు వేయటం తెలిసిందే.

12/31/2016 - 00:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితిలో చైనా మరోసారి అడ్డుకుంది. దీనిపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, చైనా తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోందని పేర్కొంది.

12/31/2016 - 00:52

గొడ్డా, డిసెంబర్ 30: జార్ఖండ్‌లోని రాజ్‌మహల్ ప్రాంతంలో ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌కు చెందిన లాల్‌మాటియా ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని గురువారం రాత్రి కుప్పకూలిపోవడంతో కనీసం 9 మంది గని కార్మికులు చనిపోగా, మరికొంతమంది గనిలోపల చిక్కుకు పోయి ఉన్నట్లు భయపడుతున్నారు.

12/31/2016 - 00:51

ఇటానగర్, డిసెంబర్ 30: అరుణాచల్‌ప్రదేశ్‌లో పేమా ఖండూ ప్రభుత్వాన్ని మాత్రమే తమ పార్టీ సమర్థిస్తుందని, మరే ముఖ్యమంత్రిని సమర్థించబోదని ఆ రాష్ట్ర బిజెపి శుక్రవారం స్పష్టం చేసింది.

12/31/2016 - 00:49

ముంబయి, డిసెంబర్ 30: వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. యువతను ఉగ్రవాదంవైపుప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయక్ విదేశాల్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఇడి తాజాగా మనీలాండరింగ్ చట్టం కింద ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ముంబయిలోని జోనల్ ఆఫీసు జకీర్ నాయక్‌పై కేసు నమోదు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

12/31/2016 - 00:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పార్లమెంటు ఇటీవల ఆమోదించిన వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో మూడు నుంచి 4 శాతం వరకు, ఉన్నత విద్యాసంస్థల్లో మూడు నుంచి అయిదు శాతం వరకు రిజర్వేషన్లను ఈ బిల్లు కల్పిస్తోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ శుక్రవారం ఇక్కడ తెలిపారు.

12/30/2016 - 05:21

తిరువనంతపురం, డిసెంబర్ 29: విభేదించే, వివాదించే, సందేహించే స్వేచ్ఛను పరిరక్షించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేసినంతమాత్రాన ఆగ్రహించడం అన్నది దురదృష్టకర పరిణామమని ఆయన విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు తన వాదనను సమర్థించుకోవడం కోసం చరిత్రను వక్రీకరించడం, లేదా వాస్తవంతో రాజీపడే ధోరణులు దేశ భక్తి అనిపించుకోదని కూడా ఆయన స్పష్టం చేశారు.

12/30/2016 - 05:15

చెన్నై, డిసెంబర్ 29: ఎల్లవేళలా జయలలితకు నీడలా ఆమె వెన్నంటి ఉంటూ తెరవెనుక రాజకీయాలు నడపటం మినహా ఎన్నడూ బహిరంగంగా ప్రజాజీవితంలోకి రాని వికె శశికళ గురువారం జయలలిత రాజకీయ వారసురాలిగా ఆవిర్భవించారు. తమిళనాడులో అధికార పార్టీ అయిన ఎఐఎడిఎంకె పార్టీని ముందుకు నడిపించనున్నారు.

12/30/2016 - 02:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 29:పెద్ద నోట్ల రద్దు కష్టాలపై ఇచ్చిన 50రోజుల గడువు శుక్రవారంతో ముగుస్తున్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి మరోసారి మాట్లాడబోతున్నారు. తదుపరి చర్యలకు సంబంధించిన ప్రణాళికను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. కొత్త సంవత్సరం ఆరంభానికి ముందే తన తదుపరి చర్యలను జాతికి తెలియజేయాలని మోదీ భావిస్తున్నట్టుగా వెల్లడించాయి.

Pages