S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/06/2016 - 03:04

మొదటినుంచి చదువులో రాణించిన జయలలిత సంపదను-దారిద్య్రాన్ని, గౌరవాన్ని- అవమానాలను సమపాళ్లలో అనుభవించింది. రెండేళ్ల వయసులో తండ్రి మరణించడంతో కుటుంబం కష్టాల్లో పడింది. పొట్టకూటి కోసం తల్లి సంధ్య సినిమాల్లో నటించడం ప్రారంభించగా చిన్నతనమంతా పిన్నివద్ద గడిపింది. బంధువుల ఈసడింపులు భరించలేక ఒంటరిగా ఉంటూ విషాదంలో మునిగిపోయేది.

12/06/2016 - 03:51

ప్రజాదరణలో ఆమెకు సాటి వచ్చే నేతలు లేరు. అభియోగాల విషయంలో కూడా అంతే. మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత రాజకీయ జీవితంలో మొదటి నుంచి సంఘర్షణ, ఎగుడుదిగుడుల మధ్య గడిచింది. ద్రవిడ రాజకీయాలను నాలుగున్నర దశాబ్దాల పాటు శాసించిన జయలలిత జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎఐడిఎంకె పార్టీలో ఆమె తిరుగులేని నాయకురాలు. ఆమె మాట కార్యకర్తలకు శాసనం.., ఆరాధకులకు.. ప్రజలకు వేదవాక్కు.

12/06/2016 - 02:57

1948 ఫిబ్రవరి 24న జయలలిత జన్మించారు. మైసూర్ సమీపంలోని మెలుకోటె ఆమె జన్మస్థానం. తమిళ అయ్యంగార్లయిన వేదవతి, జయరాం ఆమె తల్లిదండ్రులు. తల్లి కోరిక మేరకు విద్యాభ్యాసం దశలోనే జయలలిత సినిమారంగంలోకి అడుగిడారు. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో వందల సంఖ్యలో నటించారు. భరతనాట్యంలో శిక్షణ పొందడమే కాక కథక్, మోహనీఅట్టం, మణిపురి నాట్యంలోనూ ఆమె ప్రతిభ చూపారు.

12/06/2016 - 02:52

* 1982లో ఎంజీఆర్ పిలుపుతో అన్నాడిఎంకెలో చేరిక. 1983లో అసెంబ్లీ నియోజక ప్రచార కార్యదర్శిగా, ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎదుగుదల
* 1984లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నిక
* 1987 డిసెంబర్ 24: ఎంజీఆర్ మరణం. అన్నాడిఎంకెలో చీలిక
* 1989లో ఎమ్మెల్యేగా ఎన్నిక. తమిళనాడులో తొలి మహిళా విపక్ష నేతగా రికార్డు

12/06/2016 - 02:47

చిత్రం..అప్పటి, ఇప్పటి ప్రధానులతో...

12/06/2016 - 02:43

ఒక వ్యక్తి కోసం ఎవరైనా 223 మంది ఆత్మహత్య చేసుకుంటారా? ఒకరి కోసం ఎవరైనా నాలుక కోసుకుంటారా? ఒకరు జైల్లో ఉంటే బయటకు వచ్చే వరకూ పూజలు చేస్తారా? ఉపవాసాలు చేస్తారా? - అలా చేశారంటే ఆ వ్యక్తి ఓ మహా సమ్మోహనశక్తి అయి ఉండాలి. మరెంతో ప్రజాభిమానం సంపాదించుకుని ఉండాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు... పురుచ్చితలైవి. తమిళనాట ‘అమ్మ’... జయలలిత!

12/06/2016 - 02:07

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి, కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం, పురచ్చి తలైవి ఇక లేరన్న వార్త తెలియడంతోనే రాష్టమ్రంతా ఆమె అభిమానుల గుండెలవిసి పోయాయి. ఎక్కడ చూసినా అమ్మ ఇక లేరన్న వార్తను జీర్ణిచుకోలేకపోయిన అభిమానుల రోదనలు మిన్నుముట్టాయి. రాష్టమ్రంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

12/06/2016 - 02:04

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఓ.పన్నీర్ సెల్వం సోమవారం అర్ధరాత్రి ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేత ఇంచార్జి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు దివంగత నేత జయలలితకు గవర్నర్, ఇతర నేతలు, అధికారులు రెండు నిమిషాలు వౌనం పాటించి నివాళి అర్పించారు.

12/06/2016 - 02:02

చెన్నై, డిసెంబర్ 5: తమిళనాడు ప్రజల గుండెల్లో క్షణక్షణం స్పందించే అమ్మ హృదయ స్పందన ఆగిపోయింది. తమిళనాట పేదవాడి అన్నం గినె్న ఒక్కసారిగా తొణికిపోయింది. దాదాపు 74రోజులుగా తమిళనాడు ప్రజలు తమ ప్రియతమ నేత ఆరోగ్యం కోసం రేయింబవళ్లు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. అత్యున్నత ప్రమాణాలతో, అత్యాధునిక వైద్య సేవలు, విశ్వ విఖ్యాత వైద్యనిపుణులు నిరంతరం చేసిన శ్రమ వృథా అయింది.

12/06/2016 - 01:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతిపక్షాలు సోమవారం వరుసగా 13వ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరగకుండా అడ్డుకున్నాయి. ఈ అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగాలని లోక్‌సభలో డిమాండ్ చేసిన విపక్షాలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలంటూ రాజ్యసభలోనూ గందరగోళం సృష్టించాయి.

Pages