S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/05/2016 - 01:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: పెద్ద నోట్ల రద్దు తరువాత జన్‌ధన్ ఖాతాల్లో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెరిగిన డిపాజిట్లు ఇప్పుడు తగ్గినట్లు కనిపిస్తోంది. నవంబర్ 30తో ముగిసిన వారంలో కేవలం రూ.1,487 కోట్లు మాత్రమే ఈ ఖాతాల్లో జమ అయ్యాయి. అంతకుముందు వారం రూ. 8,283 కోట్లు ఈ ఖాతాల్లో జమ అయ్యాయి. 25.85 కోట్లు గల ఈ ఖాతాల్లో నవంబర్ 30నాటికి మొత్తం రూ.

12/05/2016 - 01:15

నగదు కష్టాలు ఏ మేరకు పెరిగాయో తెలియజెప్పేందుకు ఈ చిత్రమే చక్కని ఉదాహరణ. ఆదివారం సెలవు రోజు అయనప్పటికీ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు గుర్‌గావ్‌లోని ఓ ఏటిఎం వద్ద పడిగాపులు కాస్తున్న జనం

12/05/2016 - 01:14

అమృత్‌సర్, డిసెంబర్ 4: ప్రధాని నరేంద్ర మోదీ, అప్గానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ ఆదివారం ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, యుద్ధంతో ఛిన్నాభిన్నమైన అఫ్గానిస్తాన్‌లో భారత్ చేపడుతున్న పునర్నిర్మాణ కార్యకలాపాలు, రక్షణ, భద్రత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మార్గాలులాంటి కీలక అంశాలపై ప్రధానంగా ఈ చర్చలు జరిగాయి.

12/05/2016 - 01:11

నాగపూర్, డిసెంబర్ 4: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గడ్కరీ చిన్న కుమార్తె అయిన కెట్కి వివాహం అమెరికాలో ఫేస్‌బుక్ కంపెనీలో పనిచేస్తున్న ఆదిత్య కాష్కేడికర్‌తో జరిగింది.

12/05/2016 - 01:09

అమృత్‌సర్, డిసెంబర్ 4: అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణం కోసం ఉద్దేశించిన ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ సదస్సు అమృత్‌సర్ నగరంలో జరుగుతున్న సందర్భంగా ఆదివారం ఈ సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్‌తో ఈ పురాతన నగరానికి ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేశారు.

12/05/2016 - 01:04

అరుదైన సముద్ర జాతికి చెందిన భారీ తిమింగలం మృత కళేబరం పూరి జిల్లాలోని బైధారా పెంతా బీచ్‌కు కొట్టుకొచ్చింది. దీని పొడవు 42 అడుగులు కాగా వెడల్పు 28 అడుగులు. ఇది పది పదిహేను రోజుల క్రితమే మృతిచెందినట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

12/05/2016 - 01:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: షెడ్యూల్డు కులాల సబ్-ప్లాన్ (ఎస్‌సిఎస్‌పి), గిరిజన సబ్-ప్లాన్ (టిఎస్‌పి)ల కింద ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి కేటాయించిన నిధులు మురిగిపోకుండా, సకాలంలో వాటిని సద్వినియోగం చేయడానికి అవసరమైన మార్గాలను అనే్వషించాలని నీతి ఆయోగ్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

12/05/2016 - 01:01

ముంబయి, డిసెంబర్ 4: ముంబయికి చెందిన ఒక సాధారణ కుటుంబం తనకు రూ.2లక్షల కోట్ల ఆదాయం ఉన్నట్టు ప్రకటించడాన్ని తిరస్కరించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.

12/05/2016 - 01:00

మదురై, డిసెంబర్ 4: గత నెల మదురైలో అరెస్టు చేసిన ఇద్దరు అనుమానిత అల్‌ఖైదా ఉగ్రవాదుల నివాసాల్లో జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సులేమాన్, అబ్బాస్ అలీ నివాసాల్లో శనివారం రాత్రి జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. రాహుల్, ప్రదీప్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల ఎన్‌ఐఏ బృందం ఈ సోదాలు జరిపింది.

12/05/2016 - 01:00

అమృత్‌సర్, డిసెంబర్ 4: ఉగ్రవాద మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాలిబాన్‌సహా అనేక ఉగ్రవాద గ్రూపులకు మద్దతు తెలపడం ద్వారా పాకిస్తాన్ తమ దేశంపై ‘అప్రకటిత యుద్ధాన్ని’ ప్రారంభించిందని ఆయన నిప్పులు చెరిగారు. యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గాన్‌లో భారత్ కార్యకలాపాలు పెరగడం వెనుక ఎటువంటి రహస్య ఒప్పందాలు లేవని ఘనీ స్పష్టం చేశారు.

Pages