S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/04/2016 - 00:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి అభివర్ణించారు. అంతేకాదు, దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో శనివారం నితీశ్ కుమార్ పాల్గొన్నారు.

12/04/2016 - 00:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగాలా? లేదా? (బ్రెగ్జిట్) అనే అంశంపై రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించేందుకు గతంలో తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ శనివారం సమర్ధించుకున్నారు. సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉన్న కీలక అంశాలపై ప్రజల అనుమతి తీసుకోకుండా పార్లమెంట్‌కు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

12/04/2016 - 00:36

జైపూర్, డిసెంబర్ 3: సైన్యంలో వివిధ కేటగిరిల్లో సవరించిన నిబంధల ప్రకారం సిపాయిల నియామకానికి శ్రీకారం చుట్టారు. జవాన్ల నియామకంలో శారీరక పరీక్షలే కాకుడా రాత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే తదుపరి పరీక్షలకు పిలుస్తారు.

12/04/2016 - 00:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రాజకీయాలను నేరరహితం చేయడంతో పాటు రాజకీయ పార్టీలకు అందే విరాళాలను ప్రక్షాళన చేయడానికి వీలుగా ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపించిన ఎన్నికల సంఘం దేశంలోని ఎన్నికలకు సంబంధించిన అన్ని చట్టాలను సమగ్రంగా సమీక్షించే దిశగా సాగుతోంది. తాను పంపించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి స్పందనకోసం ఆతృతగా వేచిచూస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) నసీం జైదీ శనివారం చెప్పారు.

12/04/2016 - 00:32

ముంబయి, డిసెంబర్ 3: పెద్దనోట్ల రద్దు తర్వాత తాము ఇన్నాళ్లుగా దాచుకున్న డబ్బులను కాపాడుకోవడానికి నల్లకుబేరులు అనేక పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ముంబయిలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం రెండు కార్లలో తరలిస్తున్న 2.7 కోట్ల రూపాయల విలువైన 9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

12/04/2016 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా తెలియదంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం దీనిపై స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం అరుణ్ జైట్లీకి ముందే తెలిసి ఉంటుందని వ్యాఖ్యానించారు.

12/04/2016 - 00:30

కోల్‌కతా, డిసెంబర్ 3: ‘ఆర్మీ వంటి బాధ్యతాయుతమైన వ్యవస్థపై ఆరోపణలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి’ అంటూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి పరోక్షంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హితవు పలికారు. బెంగాల్‌లోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద సైనిక బలగాలను మోహరించడాన్ని నిరసిస్తూ, ‘సైనిక కుట్ర’కు పాల్పడుతున్నారా? అంటూ మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే.

12/04/2016 - 00:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రాజధాని ఢిల్లీలో తమ హైకమిషన్‌లో పనిచేస్తున్న అధికారుల వేతనాలు విత్‌డ్రా చేసుకోకుండా భారత్ అడ్డంకులు కల్పిస్తోందని పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. పెద్దనోట్ల రద్దు మిషతో తమ దౌత్య అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పాక్ ధ్వజమెత్తింది. భారత్ తీరు వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించింది.

12/04/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో ఓ అమెరికా మహిళా టూరిస్టుపై అత్యాచారానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ కన్నాట్‌ప్లేస్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో విదేశీ మహిళపై అత్యాచారం జరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆమె ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేశారని వారన్నారు.

12/04/2016 - 00:25

శ్రీనగర్, డిసెంబర్ 3: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు మృతి చెందారు. ఉగ్రవాదులు మాత్రం భద్రతా బలగాల కన్నుగప్పి తప్పించుకోగలిగారు. అధికార వర్గాలు శనివారం ఇక్కడ తెలిపిన వివరాల ప్రకారం..

Pages