S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/06/2016 - 01:11

ముంబయి, డిసెంబర్ 5: ముంబయి నేవల్ డాక్‌యార్డ్‌లో మరమ్మతులకోసం వచ్చి లంగరు వేసి ఉన్న నౌకాదళానికి చెందిన యుద్ద నౌక ఐఎన్‌ఎస్ బెట్వా సోమవారం లంగరు తొలగిస్తున్న సమయంలో ఒక పక్కకు ఒరిగి పోవడంతో ఇద్దరు నేవీ జవాన్లు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.

12/05/2016 - 04:10

చెన్నై, డిసెంబర్ 4: తమిళ సినీ హీరో రజనీకాంత్ శనివారం రాత్రి ఇక్కడ ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా కిందపడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. తదుపరి రానున్న తన సినిమా ‘2.0’లో ఒక సన్నివేశాన్ని ఇక్కడి కెలబాక్కంలో చిత్రీకరిస్తుండగా 66 ఏళ్ల రజనీకాంత్ అనుకోకుండా కిందపడి పోవడంతో అతని మోకాలికి స్వల్ప గాయం అయింది.

12/05/2016 - 03:52

భద్రాచలం, డిసెంబర్ 4: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతరను పేల్చారు. కానీ అప్పటికే బలగాలు దాటిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే... పిఎల్‌జిఏ వారోత్సవాలను పురస్కరించుకుని కాంకేర్ జిల్లా పోలీసులు సమీప అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

12/05/2016 - 02:27

అమృత్‌సర్, డిసెంబర్ 4: దక్షిణాసియాలో అశాంతి, ఉగ్రవాదానికి సంబంధించి ఒక దేశంపై నిందలు వేయటం చాలా తేలికని పాకిస్తాన్ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించారు. అమృత్‌సర్‌లో ముగిసిన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో ప్రధాని మోదీ పాకిస్తాన్‌ను పరోక్షంగా తెగనాడిన నేపథ్యంలో అజీజ్ ఎదురుదాడి చేశారు.

12/05/2016 - 02:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఎమర్జెన్సీ సమయంలో మానవ హక్కుల రద్దుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు తమ వద్ద లేవని కేంద్ర హోం శాఖ కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి)కి తెలియజేసింది. కాగా, దీనికి సంబంధించి కమిషన్‌కు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ హోం శాఖను ఆదేశించింది.

12/05/2016 - 02:24

కోల్‌కతా, డిసెంబర్ 4: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న తైపీ (తైవాన్)లో జరిగిన విమానప్రమాదంలోనే మృతి చెందినట్లు నిరూపించే తిరుగులేని సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని నేతాజీ ముని మనవడు, ప్రముఖ పరిశోధకుడు అశిష్ రే ఆదివారం చెప్పారు. అందువల్ల తైవాన్‌లోని రేంజి ఆలయంలో ఉంచిన నేతాజీ చితాభస్మాన్ని భారత్‌కు తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

12/05/2016 - 01:50

చెన్నై, డిసెంబర్ 4: తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో పరిస్థితి విషమంగా మారింది. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి ప్రకటించిన కొద్దిసేపటికే అమ్మకు గుండెపోటు వచ్చిందని, ఐసియుకు తరలించినట్లు అపోలో ఆసుపత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేయటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

12/05/2016 - 01:59

అమృత్‌సర్, డిసెంబర్ 4: ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కనె్నర్ర జేశారు. ఉగ్రవాద శక్తులపైనే కాకుండా వారికి మద్దతు ఇచ్చే, ఆశ్రయం కల్పించే, శిక్షణ, నిధులు సమకూర్చే వారిపైన కూడా కలిసికట్టుగా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు.

12/05/2016 - 01:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: త్వరలోనే కొత్తగా రూ.20, రూ.50 నోట్లను ప్రవేశపెడుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లు కూడా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. రూ.500, రూ.1000 నోట్లను హఠాత్తుగా రద్దు చేసిన నెలరోజుల తరువాత ఆర్బీఐ తాజా ప్రకటన చేసింది.

12/05/2016 - 01:39

సూళ్లూరుపేట, డిసెంబర్ 4: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 7న పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) సోమవారం డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన షార్‌లో జరగనుంది.

Pages