S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/01/2016 - 08:27

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ముంబయి ఉగ్రవాద దాడులు, పఠాన్ ఎయిర్‌బేస్‌పై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని కఠినంగా శిక్షించి తీరాలని పాకిస్తాన్‌ను ముక్తకంఠంతో హెచ్చరించిన భారత్, అమెరికాలు అదే తీరులో దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలంటూ చైనాకు హితవు పలికాయి.

09/01/2016 - 08:22

న్యూఢిల్లీ, ఆగస్టు 31: గత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయిన స్థానాలను దత్తత తీసుకుని తదుపరి ఎన్నికల్లో అక్కడ విజయం సాధించడానికి కృషి చేయాలని పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలను అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు. పార్లమెంటులో తాను ఈ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని భావించి వీటి అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీలను కోరారు.

09/01/2016 - 08:20

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కులం, మతం, భాషతో సంబంధం లేకుండా దేశ పౌరులందరి హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ నొక్కి చెప్పారు. జైల్లో పెడతారన్న భయం లేకుండా ప్రజలు శాంతియుతంగా నిరసన తెలపడానికి అనుమతించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. బెంగళూరులో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై దేశద్రోహం కేసు పెట్టిన తర్వాత అమెరికా భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతుగా మాట్లాడడం తెలిసిందే.

09/01/2016 - 08:19

న్యూఢిల్లీ, ఆగస్టు 31: పశ్చిమ బెంగాల్‌లో టాటా మోటార్స్ నానో కార్ల తయారీ ప్లాంట్‌కోసం గతంలో బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం జరిపిన భూ సేకరణ చెల్లదని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. భూ సేకరణ సక్రమమేనని పేర్కొంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, నానో ప్లాంట్‌కోసం సేకరించిన సుమారు వెయ్యి ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చివేయాలని స్పష్టం చేసింది.

09/01/2016 - 08:18

చెన్నై, ఆగస్టు 31: తమిళనాడుకు కొత్త గవర్నర్ ఎవరు కానున్నారు? కొణిజేటి రోశయ్య అయిదేళ్ల పదవీకాలం బుధవారం ముగియటంతో కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అయితే రోశయ్యను మరో అయిదేళ్లపాటు కొనసాగించాలనే జయలలిత భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రోశయ్యనే తమిళనాడు గవర్నర్‌గా కొనసాగించాలని జయ కేంద్రాన్ని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

09/01/2016 - 08:17

న్యూఢిల్లీ, ఆగస్టు 31: కాంగ్రెస్ అధికార పత్రిక ‘నేషనల్ హెరాల్డ్’ తిరిగి ప్రజల్లోకి రానుంది. 2008లో నిలిచిపోయిన ఈ పత్రికను తిరిగి ప్రచురించనున్నట్లు దాని యాజమాన్య సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్) బుధవారం ప్రకటించింది. సీనియర్ జర్నలిస్టు నీలభ్ మిశ్రా ఈ పత్రికకు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తారని తెలిపింది.

09/01/2016 - 08:16

లక్నో, ఆగస్టు 31: నిత్యం పొదుపు గురించి ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులు దాన్ని పాటించే విషయంలో ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఖజానాకు గండిపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలోని మంత్రులు అతిధుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేశారు. టీలు, సమోసాలు, గులాబ్ జామూన్‌లకు ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది.

09/01/2016 - 08:16

న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశంలో ఓబిసిల్లో క్రీమిలేయర్‌లను నిర్ధారించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్ బుధవారం వెల్లడించారు. ఈ ప్రక్రియ ఏడాది చివరినాటికి పూర్తవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఓబిసిలకు 27శాతం కోటా అమల్లో ఉందని అన్నారు.

09/01/2016 - 08:15

పూరి, ఆగస్టు 31: ఒడిశాకు చెందిన ప్రముఖ సైకతశిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తయారుచేసిన ‘ప్రపంచ శాంతి’ సైకతశిల్పం ‘పీపుల్స్ చాయిస్’ పురస్కారాన్ని గెలుచుకున్నది. రష్యా రాజధాని మాస్కోలో ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ సందర్భంగా పట్నాయక్ ‘అహింస, శాంతిని బోధిస్తున్న మహాత్మాగాంధీ’ సైకతశిల్పాన్ని తయారు చేశారు.

09/01/2016 - 07:37

న్యూఢిల్లీ, ఆగస్టు 31:మహిళా, శిశు సంక్షేమ మంత్రి సందీప్ కుమార్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం ఉద్వాసన పలికారు. ఆయన ఓ మహిళతో గడిపిన క్షణాలకు సంబంధించిన అభ్యంతరకర సీడి బయట పడటంతో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు నీతి నియమాలకు కట్టుబడాలన్నదే తమ పార్టీ ధ్యేయమని, వాటిని ఉల్లంఘించినందుకే సందీప్‌ను మంత్రి పదవి నుంచి తొలగించామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Pages