S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/31/2016 - 07:31

సనోసర, ఆగస్టు 30: ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మంగళవారం సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో తొలిసారిగా ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకోసం మోదీ రాజకీయంగా కీలకమైన, పటేళ్ల ప్రాబల్యం కలిగిన సౌరాష్ట్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

08/31/2016 - 08:04

న్యూఢిల్లీ, ఆగస్టు 30: మామూలుగా అయితే రైడర్లు మోటార్‌సైకిళ్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ప్రపంచంలో అత్యంత ఎతె్తైన మోటరబుల్ రోడ్డు ఖర్దుంగ్‌లాపైకి ఓ మహిళల బృందం స్కూటర్లపై సాహసోపేతంగా రైడ్ చేశారు. ఆనమ్ హషీమ్ అనే 21 ఏళ్ల అమ్మాయి మరో పది మంది యువతులతో కలిసి టివిఎస్ స్కూటీ జెస్ట్ వాహనాలకు 110 సిసి ఇంజన్‌లను అమర్చుకుని దాదాపు 18,340 అడుగుల మేర రైడ్ చేశారు.

08/31/2016 - 07:20

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడంలో, సంక్షోభాల నివారణలో రెడ్‌క్రాస్ పాత్ర అమూల్యమైందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు.

08/31/2016 - 07:17

న్యూఢిల్లీ, ఆగస్టు 30:ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-అమెరికాలు చేతులు కలిపాయి. ప్రపంచ శాంతికి గొడ్డలి పెట్టుగా మారిన ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి తగదంటూ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికే చేశాయి. ఇరు దేశాల మధ్య జరిగిన రెండో వ్యూహాత్మక వాణిజ్య చర్చల అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లు సంయుక్తంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

08/31/2016 - 07:16

కోయంబత్తూర్, ఆగస్టు 30: బ్రెయిన్‌డెడ్ అయిన ఓ ఇంజనీర్ ఆరుగురికి ప్రాణభిక్ష ప్రసాదించారు. 21ఏళ్ల సివిల్ ఇంజనీర్ యువరాజ్ ఓ ప్రమాదంలో గాయపడ్డారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా ధారాపురంలో మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. తరువాత కోలుకున్నప్పటికీ తరచూ ఫిట్స్‌వస్తూ ఉండేవి. ఒక్కోసారి అపస్మారక స్థితికి వెళ్లిపోయేవారని యువరాజ్ కుటుంబ సభ్యులు తెలిపారు.

08/31/2016 - 07:15

న్యూఢిల్లీ, ఆగస్టు 30: మహారాష్టల్రోని డ్యాన్స్ బార్లలో నృత్యాలు చేసే మహిళలపై డబ్బులు విసరరాదని, ఇది మహిళలను, భారతీయ సంస్కృతిని కించపరిచే చర్య అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. డ్యాన్స్ బార్లలో మహిళలపై డబ్బులు విసరడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను కోర్టు సమర్థించింది.

08/31/2016 - 06:44

న్యూఢిల్లీ, ఆగస్టు 30: డీఎస్సీ-1998 కేసులో కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల అభ్యర్థనను పరిశీలించి ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ సిఎస్ రాజీవ్‌శర్మను సుప్రీంకోర్టు ఆదేశించింది.

08/31/2016 - 06:43

న్యూఢిల్లీ, ఆగస్టు 30: నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణికి సంబందించిన పిటిషన్లు విచారణను సుప్రీం కోర్టు నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం ఈ పిటిషన్లను జస్టిస్ దిపక్ మిశ్రా ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు తమకు కనీసం మూడు గంటలు సమయం కావాలని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ కోర్టును అభ్యర్థించారు.

08/31/2016 - 06:43

న్యూఢిల్లీ, ఆగస్టు 30: పార్లమెంట్ సభ్యుల జీతాల్ని పెంచే అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. ఎంపీల జీతాలు, అలవెన్స్‌ల పెంపుపై ఏర్పాటయిన సంయుక్త పార్లమెంటరీ ప్యానల్ ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు.

08/31/2016 - 06:38

న్యూఢిల్లీ, ఆగస్టు 30: కృష్ణానది కరకట్ట అనుకుని రాజధాని నిర్మాణం ప్రమాదకరమని, కృష్ణానదికి, కొండవీటి వాగుకు వరదలొస్తే అమరావతికి పెనుముప్పు వాటిల్లుతుందని రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలై పిటిషన్ల తరఫున న్యాయవాది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి)లో వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కేసు విచారణను గ్రీన్ ట్రిబ్యునల్ సెప్టెంబర్ 9 తేదీకి వాయిదా వేసింది.

Pages