S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/31/2016 - 06:16

న్యూఢిల్లీ, ఆగస్టు 30: సి.ఎన్.బి.సి, టి.వి 18 తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఈ సంవత్సరం అత్యంత అధిక ఆశావహ రాష్ట్రం అవార్డును రాష్ట్ర పురపాలక, ఐ.టి శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అరుణ్‌జైట్లీ ఈ అవార్డును రామారావుకు బహూకరించారు.

08/31/2016 - 05:32

కాన్పూర్, ఆగస్టు 30:వైద్యో నారాయణో హరి..ప్రాణ భిక్ష పెట్టే వైద్యుడు దేవుడితో సమానమన్న మాట. ఆ మాటకొస్తే వైద్య కేంద్రాలన్నీ దేవాలయాలే..దేవుళ్లతో సమానమైన వైద్యులతో నిండినవే! కానీ ఓ తండ్రి తన పనె్నండేళ్ల కొడుకును కాపాడాలంటూ వైద్యుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక పోయింది. కొడుకు పరిస్థితి క్షణక్షణానికీ క్షీణించడంతో అతడ్ని భుజాన వేసుకుని మరీ రోడ్లపై పరుగులు పెట్డాడు.

08/31/2016 - 05:29

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అమరావతి నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూములను ల్యాండ్‌పూలింగ్ పేరుతో ఏపి ప్రభుత్వం భూమిని సమీకరించిందని సామాజికవేత్త మేధాపట్కర్ ధ్యజమెత్తారు. ఢిల్లీలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణాన్ని చేపడుతోందని ఆమె విమర్శించారు.

08/31/2016 - 05:28

న్యూఢిల్లీ, ఆగస్టు 30: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశముందని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ చేతనైతే పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావాలనీ, లేనిపక్షంలో రజనీకాంత్‌లా ఇంట్లో కూర్చోవాలని ఆయనకు సలహా ఇచ్చారు. పవన్‌లో కమ్యూనిస్టు భావాలు బాగానే ఉన్నా, ఆయన నడకలో తడబడుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు.

08/31/2016 - 05:27

న్యూఢిల్లీ, ఆగస్టు 30: వ్యాట్, ఎక్సైజ్ పన్నుల నుండి మినహాయించిన వస్తువులకు జిఎస్‌టి నుండి కూడా మినహాయింపు ఇవ్వాలని ఏ.పి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్ర అధ్యక్షతన జరిగిన జిఎస్‌టిఎన్ సాధికారిక కమిటి సమావేశానికి యనమల హాజరయ్యారు.

08/31/2016 - 05:25

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్‌కు ఒక లక్షా 93వేల ఇళ్లు, తెలంగాణ రాష్ట్రానికి 84 వేల ఇళ్లను ఇప్పటివరకు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 9 లక్షల 35వేల ఇళ్లను మంజూరుచేసినట్టు వెల్లడించారు. పదేళ్ల యూపీఏ పాలనలో కేవలం పదిలక్షల ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని విమర్శించారు.

08/31/2016 - 04:38

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రం ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి మంగళవారం ఇక్కడ సమావేశమయ్యారు.

08/31/2016 - 04:52

న్యూఢిల్లీ, ఆగస్టు 30: జాతీయ కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన అన్ని ప్రధాన డిమాండ్లు ఆమోదిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఇందన మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. సెప్టెంబర్ 2న ప్రతిపాదించిన ఒకరోజు జాతీయ సమ్మెను విరమించాలని సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. 2014-15 ఏడాది బోనస్ ఇచ్చేందుకూ కేంద్రం అంగీకరించింది.

08/30/2016 - 15:51

ఢిల్లీ: ఎప్పుడూ వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ స్వామి ఈసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 'లెఫ్టినెంట్ గవర్నర్ వంటి ఉన్నత పదవికి జంగ్ పనికి రారని నా అభిప్రాయం. కేజ్రీవాల్ తరహాలోనే ఆయన కూడా ఓ 420. ఆయన స్థానంలో సంఘ్ పరివార్ వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఉంది' అంటూ స్వామి మంగళవారం ట్వీట్ చేశారు.

08/30/2016 - 13:57

జలంధర్‌: పంజాబ్‌లో బంగారంపై రుణాలిచ్చే ఓ సంస్థలో రూ. 3 కోట్లు విలువ చేసే 10 కిలోల బంగారం చోరీకి గురయింది. రామమండి ప్రాంతంలోని సంస్థ కార్యాలయంలో మోటార్‌సైకిళ్లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సమాచారం. దుండగుల్లో ఓ వ్యక్తి ముందుగా వచ్చి తలుపు తట్టాడు.

Pages