S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/01/2016 - 06:44

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాజ్యాంగపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్దార్థనాథ్ సింగ్ వెల్లడించారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మూలంగా ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

09/01/2016 - 05:51

పనాజీ, ఆగస్టు 31:కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు శాసనంగా మారేందుకు కీలక ఘట్టం పూర్తయింది. రాజ్యాంగ సవరణలతో పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లు శాసనంగా మారి జిఎస్‌టి కౌన్సిల్ పరిశీలనకు వెళ్లాలంటే 50శాతం రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇప్పటికే 14 రాష్ట్రాలు దీన్ని ఆమోదించాయి.

09/01/2016 - 05:25

న్యూఢిల్లీ,ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ఇవ్వవలసిన ప్రత్కేక సహాయంపై ఎన్‌డిఏ ప్రభుత్వం వారం, పది రోజుల్లో ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో జరిపిన సమావేశంలో ఏపికి అందజేయవలసిన ప్రత్యేక సహాయం గురించి చర్చించినట్లు తెలిసింది.

09/01/2016 - 05:15

న్యూఢిల్లీ, ఆగస్టు 31: పెట్రోలు, డీజిల్ రేట్లను గత రెండు నెలలుగా తగ్గిస్తూ వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బుధవారం అర్థరాత్రి నుంచి వినియోగదారులపై భారీగానే మోత వేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు 13శాతం పెరగడంతో పెట్రోలుపై లీటరుకు 3రూపాయల 38పైసలు, డీజిల్‌పై లీటరుకు 2రూపాయల 67పైసలు పెంచింది. పెరిగిన ఈ ధరలు బుధవారం అర్థరాత్రి నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి.

08/31/2016 - 17:43

దిల్లీ: ‘నేషనల్‌ హెరాల్డ్‌’, ‘నవజీవన్‌’ పత్రికలను మళ్లీ ప్రచురించనున్నట్లు, ఉర్దూ పత్రిక ఖ్వామీ ఆవాజ్‌ త్వరలో వెలువడుతుందని ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఐఎన్‌సీ) బుధవారం ప్రకటించింది. సీనియర్‌ జర్నలిస్టు నీలభ్‌ మిశ్రాను ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా నియమించారు. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ ఈ పత్రికలను ప్రచురించనున్నట్లు తెలిపారు. ఆర్థిక కారణాల వల్ల ఈ పత్రికలను గతంలో నిలిపివేశారు.

08/31/2016 - 17:34

చెన్నై: మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు తమిళనాడు గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య పదవీకాలం బుధవారంతో ముగిసింది. మరోవైపు గుజరాత్‌ గవర్నర్‌ ఓంప్రకాశ్‌ కోహ్లికి మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2011 ఆగస్టు 31న బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఐదేళ్ల పాటు గవర్నర్‌ పదవిలో కొనసాగారు.

08/31/2016 - 16:06

చెన్నై: తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థి మహిళా టీచర్‌ను కత్తితో పొడిచి కిరాతకంగా చంపిన ఘటన తమిళనాడులోని తూత్తుకూడిలో బుధవారం వెలుగు చూసింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వచ్చే నెలలో పెళ్లి కావాల్సిన మహిళా టీచర్ ప్రేమోన్మాది దాడికి బలైపోవడంతో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

08/31/2016 - 16:05

దిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు 2 కోట్లు, కాంస్య పతకం సాధించిన రెజ్లింగ్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకాలను దిల్లీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం అందజేశారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఈ ఇద్దరు యువతులు దేశానికి పేరు తెచ్చారని ఆయన ప్రశంసించారు.

08/31/2016 - 15:19

పనాజీ: భాజపాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ గోవా చీఫ్‌ సుభాష్‌ వెలింకార్‌ను బాధ్యతల నుంచి తొలగించారు. ఇటీవల భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా గోవా పర్యటకు వచ్చిన సమయంలో సుభాష్‌ నల్లజెండాలను ప్రదర్శించారు. ప్రభుత్వ నిధులను ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలకు ఉపయోగిస్తున్నారంటూ ఆరోపించారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

08/31/2016 - 15:03

ఛండీగడ్‌: కాలుష్యాన్ని తగ్గించాలని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టార్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు సైకిళ్లపై బుధవారం అసెంబ్లీకి వెళ్లారు. సీఎం ఖట్టార్‌ ఆయన అధికారిక నివాసం నుంచి అసెంబ్లీ కాంప్లెక్స్‌ వరకు సైకిల్‌ తొక్కుతూ వెళ్లారు. పర్యావరణానికి ఇది ఎంతో మేలు కలిగిస్తుందని, ప్రజలు ఒక్కరోజైనా సైకిల్‌పై ప్రయాణించాలని ఖట్టార్‌ కోరారు.

Pages