S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/06/2018 - 01:26

* వచ్చే వారాంతంలో 4 రాష్ట్రాల నోటిఫికేషన్ * ఎన్నికల సంసిద్ధతపై ఈసీ సమీక్ష

10/06/2018 - 05:09

* ఏబీపీ న్యూస్, రిపబ్లికన్ టీవీ సీ-ఓటర్ సర్వే వెల్లడి

10/06/2018 - 05:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: కాశ్మీర్‌లో అశాంతిని కలిగించడం తప్ప మరో అజెండా పాకిస్తాన్‌కు లేదని, పాక్ దుర్నీతిని అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ధ్వజమెత్తారు. కాశ్మీర్‌లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో 90 శాతం ప్రజలు పాల్గొనేందుకు ఉవీళ్లూరుతున్నారని ఆయన అన్నారు.

10/06/2018 - 01:02

రాంచీ, అక్టోబర్ 5: కోట్లాది రూపాయల గడ్డి కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు విధించిన జైలుశిక్ష కాలాన్ని పెంచాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించింది.

10/06/2018 - 05:24

నర్హర్‌పూర్ (చత్తీస్‌గఢ్), అక్టోబర్ 5: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 2003వ సంవత్సరం కన్నా ముందు చత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నక్సలైట్లతో కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మావోయిస్టు జాఢ్యాన్ని నియంత్రించడంలో విజయవంతమయిందని ఆయన పేర్కొన్నారు.

10/06/2018 - 00:57

చిత్రం:
=====
హైదరాబాద్ హౌస్‌లో జరిగిన శిఖరాగ్ర భేటీకీ ముందు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్

10/06/2018 - 05:40

చిత్రం:
=====
ఢిల్లీలో శుక్రవారం జరిగిన భారత్-రష్యా ప్రతినిధుల స్థాయ సమావేశానికి వెళుతున్న
విదేశాంగ మంత్రి సుషా మస్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

10/06/2018 - 00:53

చెన్నై, అక్టోబర్ 5: తమిళనాడు ముఖ్యమంత్రి ఓ. పళనిస్వామిని పదవి నుంచి తప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారని అమ్మా మక్కల్ మునే్నట్ర కలంగం (ఏఎంఎంకే) అధినేత టీవీవీ దినకరన్ తెలిపారు. ఈ విషయమై గత సెప్టెంబర్‌లో తనతో సంప్రదించేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నించారని ఈ బహిష్కృత ఏఐఏడీఎంకే నేత ఆరోపించారు.

10/05/2018 - 16:55

న్యూఢిల్లీ: పోలవరం మిగులు జలాలపై మరో అధ్యయనం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు కోరిన అధ్యయనం అవసరం లేదని తెలపటంతో నిల్వ జలాలపై విచారణ కూడా అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 15న నిర్వహిస్తామని జస్టిస్ మదన్ బి. లోకూర్ ధర్మాసనం స్పష్టం చేసింది.

10/05/2018 - 12:59

శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని కర్ఫాలి మొహల్లా ఏరియాలో ఉగ్రవాదాలు శుక్రవారం ఉదయం కాల్పులు జరపడంతో ఇద్దరు నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

Pages