S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/25/2018 - 13:25

ముంబయి: ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఆర్థిక రాజదాని ముంబయిలో ఇప్పటికే రూ.90లు దాటిన పెట్రోల్ ధర వంద రూపాయల వైపు పరుగులు పెడుతుంది. నేడు మరో 14పైసలు పెరగడంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 90.22కు చేరింది. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 82.86గా ఉంది. కోల్‌కతాలో రూ. 84.68, చెన్నైలో రూ. 86.13, హైదరాబాద్‌లో రూ. 87.84గా ఉంది. ఇక డీజిల్‌ కూడా నేడు 10పైసలు పెరిగి దిల్లీలో లీటర్‌ ధర రూ.

09/25/2018 - 13:22

న్యూఢిల్లీ: క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్న చట్ట సభల సభ్యులు దోషులుగా తేలకముందే వారిపై అనర్హత వేటు వేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైతే వారిని అనర్హలుగా పరిగణించలేమని, ఈ విషయాన్ని పార్లమెంట్ చూసుకుంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది.

09/25/2018 - 12:33

చెన్నై: నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని నరేంద్ర మోదీ పేరును సిఫార్సు చేసినట్లు తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసాయి సౌందర్య రాజన్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మోదీ ఈ పురస్కారానికి అర్హుడని పేర్కొన్నారు.

09/25/2018 - 12:28

న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలడం తదితర కారణాల వల్ల దాదాపు 25మంది మృత్యువాత పడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల బీభత్సానికి జనం అల్లాడుతున్నారు. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఎనిమిది మంది, జమ్మూకాశ్మీర్‌లో ఏడుగురు, పంజాబ్ ఆరుగురు, హరియాణాలో నలుగురు చనిపోయారు. మనాలీ ప్రాంతంలో ముగ్గురు గల్లంతయ్యారు.

09/25/2018 - 03:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: రాఫెల్ డీల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేకెత్తిస్తున్న నేపథ్యంలో ‘ఇవి వారి వారి అభిప్రాయాలకు, భావనలకు సంబంధించిన అంశం’ అని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ అంశంపై విపక్షాలతో దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమవుతున్నామరి సోమవారం నాడు ఇక్కడ వెల్లడించారు.

09/25/2018 - 02:33

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ మరణానికి సంబంధించిన రహస్యాల వెల్లడికి అన్ని రికార్డులను ప్రధాన మంత్రి, హోంమంత్రి ముందు ఉంచాలని సెంట్రల్ ఇన్‌ఫర్‌మేషన్ కమిషన్ (సిఐసి) సోమవారం ఆదేశించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయంలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్‌ఫర్‌మేషన్ అధికారులకు, హోంమంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.

09/25/2018 - 01:43

పనాజి, సెప్టెంబర్ 24: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేశారు. ఇద్దరు మంత్రులను తొలగించి వారి స్థానంలో మరో ఇద్దరిని చేర్చుకున్నారు. ఏడాదిన్నర పాలనలో మంత్రివర్గంలో మార్పులు చేయడం ఇది రెండోసారి. తొలగించిన వారిలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, విద్యుత్ శాఖ మంత్రి పాండురంగ మద్‌కైకర్ ఉన్నారు.

09/25/2018 - 01:38

పాక్‌యాంగ్ (సిక్కిం), సెప్టెంబర్ 24: దేశంలో సామాన్యుడు సైతం విమానాల్లో ప్రయాణించాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడు ఇక్కడ ఉద్ఘాటించారు. హవాయి చెప్పులు వేసుకునేవారు సైతం విమానాల్లో విహరించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ సిక్కింలో మొట్టమొదటి విమానాశ్రయాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. ఈశాన్య భారతాన్ని భారత వృద్ధికి శోధక యంత్రంగా మార్చాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.

09/25/2018 - 01:36

రాయ్‌పూర్, సెప్టెంబర్ 24: నక్సల్స్‌కు వారి సానుభూతిపరుల నుంచి మేధో, ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందకుండా తమ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ అన్నారు.

09/25/2018 - 01:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశంలో పది లక్షల మంది జనాభాకు 19 మంది న్యాయమూర్తులే ఉన్నారని న్యాయ మంత్రిత్వశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా కింది కోర్టులను కలుపుకుని 6000 మంది న్యాయమూర్తుల పోస్టుల ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. కింది కోర్టుల్లోనే కేవలం 5000 మంది జడ్జిలను నియమించాల్సి ఉంది. జడ్జిల ఖాళీలకు సంబంధించి గత మార్చిలో కేంద్ర న్యాయశాఖ ఓ నివేదిక రూపొందించింది.

Pages