S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

పాడేరు, డిసెంబర్ 9: ప్రజావాణిలో గిరిజనులు తెలియచేసే సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు తెలియచేసే సమస్యలలో పరిష్కారానికి అవకాశం ఉన్నటువంటివి సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. గిరిజనుల నుంచి అందే సమస్యలను శాఖల వారీగా సమన్వయపరిచేందుకు కార్యాలయంలోని ఒక ఉద్యోగిని కో-ఆర్డినేటర్‌గా నియమించాలని ఆయన ఆదేశించారు.

80 కిలోల గంజాయి స్వాధీనం

కోటవుటర్ల, డిసెంబర్ 9: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిపై స్థానిక పోలీసులు శుక్రవారం దాడి చేసి లక్షా 60 వేల రూపాయల విలువైన 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక ఎస్సై తారకేశ్వరరావు పోలీసు సిబ్బందితో మండలంలో పాములవాక పట్టాలమ్మ గుడి వద్ద కాపు కాసారు. శుక్రవారం ఉదయం ఏజన్సీ అన్నవరం నుంచి ఆటోలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈసంఘటనలో 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. ఆటో, ఒక బైక్, మూడు సెల్‌ఫోన్లను సీజ్ చేసినట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.

పేదల ఆరోగ్యంతో చెలగాటం

విశాఖపట్నం, డిసెంబర్ 9: నిరపేదల ఆరోగ్యంతో టిడిపి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఆరోగ్య శ్రీ (ఎన్‌టిఆర్ వైద్య సేవ)ని నిర్వీర్యం చేస్తున్న టిడిపి తీరుపై పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఏటా కోటిన్నర కుటుంబాలు ఈ పథకం కింద వైద్య సేవలు పొందేవని గుర్తు చేశారు.

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే

నెల్లూరు, డిసెంబర్ 9: పేదలు అప్పులపాలు కాకుండా కాపాడే అద్భుతమైన అరోగ్యశ్రీ పథకానికి నిధులు తగ్గించి దానిని నీరుగార్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుదేనని జిల్లా వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ధర్నాలో భాగంగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని, చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కర్షకులకు కొత్త కష్టాలు

ఖమ్మం, డిసెంబర్ 9: ఆరుగాలం శ్రమించి పంటను పండించే రైతన్న పంట చేతికొచ్చిన తర్వాత కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమయ్యే సీజన్‌లో కేంద్రం పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో రైతులకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వాణిజ్య పంటలను వేసిన రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 2,87, 663మంది రైతులు 1,47,373హెక్టార్లలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,37,078మంది రైతులు 1,39, 036హెక్టార్లలో వ్యవసాయం చేశారు. ఇందులో ప్రధానంగా 1,18,472 హెక్టార్లలో పత్తిని సాగుచేశారు.

చారిత్రక వైభవానికి ప్రతీక అనుపు ఉత్సవాలు

విజయపురిసౌత్, డిసెంబర్ 9: అలనాటి చారిత్రక వైభవాన్ని చాటే విధంగా ప్రపంచ పర్యాటక కేంద్రమైన అనుపులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం మాచర్ల మండలం అనుపులో ఇన్ఫోసిస్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు మంత్రులు పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తి, కలెక్టర్ కాంతీలాల్ దండే ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరికి ఇన్ఫోసిస్ అధికారులు ఘన స్వాగతం పలికారు.

మావుళ్ళమ్మ ఉత్సవాలకు సన్నాహాలు

భీమవరం, డిసెంభర్ 9: నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, మావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ, దేవస్థానం సంముక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 13 నుంచి జరిగే మావుళ్ళమ్మ అమ్మవారి 53వ వార్షిక మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద పందిరి రాట ముహూర్తం నిర్వహించారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు రామాయణం గోవిందరావుతో ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం పూజా కార్యక్రమాలు చేయించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరంవలె 36 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 17న అఖండ అన్నసమారాధన నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

రాజానగరం, డిసెంబర్ 9: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై శుక్రవారం వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా నగదు రహిత లావాదేవీలపై ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న 290 యూనిట్లలో సుమారు 1200 గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలపై ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తామని భారత్‌మాత సాక్షిగా ప్రమాణం చేయించారు.

ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం కక్ష సాధింపు చర్యే

చిత్తూరు, డిసెంబర్ 9 : కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీమంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని నిరసిస్తూ వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జరిగిన ధర్నాలో జిల్లాలలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

28న జెఎన్‌టియూ స్నాతకోత్సవం

అనంతపురం సిటీ, డిసెంబర్ 9:జెఎన్‌టియూ అనంతపురం 8వ స్నాతకోత్సవం ఈ నెల 28న నిర్వహించనున్నట్లు జెఎన్‌టియూ విసి ఆచార్య ఎంఎంఎం సర్కార్ తెలిపారు. ఈ స్నాతకోత్సవం జెఎన్‌టియూ అడిటోరియంలో 28న ఉదయం 10 గంటల ప్రారంభమవుతుందని తెలిపారు. గోల్డ్ మెడల్స్ అందుకునే ప్రతి విద్యార్థి 9 గంటలలోగా ఆడిటోరంలో ఉండాలని, 27న ఆడిటోరియంలోకి వచ్చేందుకు పాస్‌లు సంబందిత ఆచార్యుల నుండి పొందాలన్నారు. జెఎన్‌టియూ పరిధిలోని బి.టెక్, బి.్ఫర్మసీ, ఇతర విభాగాల్లో మంచి మార్కులు సాధించి విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందించే గోల్డ్‌మెడల్స్‌ను ఈ సంవత్సరంలో 30 మంది విద్యార్థులను ఏంపిక చేసినట్లు తెలిపారు.

Pages