S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్బందుల్లో పేదలు

హైదరాబాద్, డిసెంబర్ 9:పెద్ద నోట్ల రద్దు వల్ల డబ్బున్న పెద్ద వాళ్లకే ఇబ్బందులు అని గ్రామీణ ప్రజలు తొలుత భావించారని, కానీ పెద్దలు బాగానే ఉన్నారు, కానీ సమస్యలన్నీ సామాన్యులకే కలుగుతున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం అయిన కరెన్సీ అందుబాటులో లేక పోవడం వల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు , ఆర్‌బిఐ దీనిపై దృష్టిసారించారని, డబ్బుల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. సికిందరాబాద్‌లోని కస్తుర్భా గాంధీ డిగ్రీ కాలేజీలో ఎలక్ట్రానిక్ లావాదేవీలపై అవగాహన కలిగించేందుకు సమావేశం నిర్వహించారు.

అసహనం ఎందుకు?

హైదరాబాద్, డిసెంబర్ 9: సార్వత్రిక ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో ఏ మేరకు అమలు చేశారో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా? అని కాంగ్రెస్ నాయకుడు, శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ రాష్ట్ర మంత్రి టి. హరీష్ రావును ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావుకు అసహనం ఎందుకని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ 182 హామీలు ఇచ్చిందని ఆయన చెప్పారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. సింగూరు ప్రాజెక్టును ఎవరు నిర్మించారని, గిరిజనులకు, మైనారిటీలకు కల్పిస్తామన్న రిజర్వేషన్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

16 నుంచి అసెంబ్లీ

హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ శాసనమండలి, శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేరిట శాసనమండలి (లెజిస్లేచర్) కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజాసదారామ్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఈ నెల 23వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షాలు కోరితే నెలాఖరు వరకూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అంటున్నారు.
13న పోలీసు అధికారులతో భేటీ

కాకినాడ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

శంకర్‌పల్లి, డిసెంబర్ 9: శంకర్‌పల్లి మండల పరిధిలోని రావులపల్లి రైల్వేస్టేషన్ వద్ద పట్టా విరిగిన సంఘటనలో శక్రవారం ఉదయం షిర్డీ నుండి కాకినాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు, శంకర్‌పల్లి స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షిర్డీ నుండి కాకినాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ (వయా సికింద్రాబాద్) శుక్రవారం ఉదయం మండల పరిధిలోని రావులపల్లి స్టేషన్‌కు చేరకముందే పట్టా విరిగి పోయింది. విషయాన్ని గమనించకుండా అలాగే విరిగిన ఆ పట్టాపై నుండే ఇంజన్‌తో పాటు రెండు భోగీలు దాటగానే, గమనించి డ్రైవర్ రైలును ఆపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆన్‌లైన్‌లో ముక్కోటి ఏకాదశి టిక్కెట్లు

భద్రాచలం, డిసెంబర్ 9: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈసారి ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. ప్రయోగాత్మకంగా తొలిసారి ఈ ప్రక్రియకు దేవస్థానం శ్రీకారం చుట్టింది. మొత్తం నాలుగు వేల టిక్కెట్లలో 50 శాతం అంటే 2వేల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. మిగిలిన 50 శాతం టిక్కెట్లలో 25 శాతం దేవస్థానం, 25 శాతం రెవెన్యూ శాఖ ద్వారా విక్రయించనున్నారు. ఏటా శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి వేళల్లో అధికారుల పెత్తనంతో భక్తులకు దర్శన భాగ్యం కల్గడం లేదు. చివరి వరకు టిక్కెట్లను తమ వద్దనే ఉంచుకోవడం, చివరి క్షణంలో టిక్కెట్లు మిగిలాయనడం పరిపాటిగా మారింది.

అవినీతిపై ఏసిబి యుద్ధం!

హైదరాబాద్, డిసెంబర్ 9: అవినీతి నిరోధక వారోత్సవాలు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఏసిబి డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్, డైరెక్టర్ చారుసిన్హాల ఆధ్వర్యంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. వారోత్సవాల్లో భాగంగా ఎసిబి అవినీతికి వ్యతిరేకంగా కరపత్రాలు, స్టిక్కర్లు ముద్రించి ర్యాలీల ద్వారా విశేష ప్రచారం నిర్వహించింది.

ప్రాణదాన ట్రస్టుకు రూ. 1కోటి విరాళం

తిరుపతి, డిసెంబర్ 9: న్యూఢిల్లీకి చెందిన ఎంఎస్ పద్మనాభన్ అనే భక్తుడు శుక్రవారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. ఒక కోటి 11వేలు విరాళంగా అందించారు.
తిరుమలలోని జెఇఓ క్యాంపు కార్యాలయంలో జెఇఓ శ్రీనివాసరాజుకు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు.

చిత్రం..తిరుమలలో విరాళం చెక్కును జెఇఓకు అందజేస్తున్న పద్మనాభన్

తెలంగాణలో ఆ ఒక్క కుటుంబంలోనే అభివృద్ధి

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కెసిఆర్ కుటుంబంలోనే అభివృద్ధి జరిగిందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ విమర్శించారు. తెరాస పాలనలో తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

తెలంగాణను క్రీడల్లో నంబర్ వన్ చేస్తాం

కరీంనగర్, డిసెంబర్ 9: క్రీడలకు, క్రీడాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రానున్న రోజుల్లో దేశంలోనే తెలంగాణ క్రీడల్లో నంబర్ వన్‌గా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌లోని మానేరు హైస్కూళ్లో జరిగిన 62వ అఖిల భారత పాఠశాలల క్రీడా సమాఖ్య జూడో పోటీల ప్రారంభ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేడు దేశంలో హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు క్రీడల్లో ముందంజలో నిలుస్తున్నాయని, ఇక భారత క్రీడల భవిష్యత్ ఆశాకిరణాలుగా తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు.

ఆస్ట్రేలియాతో కీలక ఒప్పందాలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: విద్య, వ్యవసాయం, గనులు, సాంకేతికత తదితర రంగాల్లో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపి భవన్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఢిల్లీలో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్, వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వ కోశాధికారి మైక్ నెహాన్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. వెస్టర్న్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంతో కూడా ఒక ఎంఓయు చేసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. గనుల విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదన్నారు.

Pages