S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లధనమని తేలితే శేఖర్‌రెడ్డిని టిటిడి పదవి నుండి తొలగిస్తాం

ద్వారకాతిరుమల, డిసెంబర్ 9: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి వద్ద ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు నల్ల ధనమేనని రుజువైతే ఆయనను పదవి నుండి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. అలాగే ఆయనపై చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని చిన వెంకన్నను శుక్రవారం మంత్రి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

కరెన్సీ లేక జనం ఆందోళన

హైదరాబాద్, డిసెంబర్ 9: వరుసగా బ్యాంకులకు మూడు రోజుల పాటు సెలవులు. రెండవ శనివారం, ఆదివారం, సోమవారం మిలాద్ ఉన్ నబీ బ్యాంకులకు సెలవు. దీంతో పరిస్థితి మరింత దిగజారనుంది. ఎటిఎంలలో నగదు లేక, బ్యాంకుల్లో డబ్బు లేక జనం కటకటలాడిపోతున్నారు.

పంట రుణాల చెల్లింపునకు పాత నోట్లు తీసుకుంటారా?

హైదరాబాద్, డిసెంబర్ 9: రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాల చెల్లింపునకు అనుమతి ఇస్తారా? లేదా? అనే విషయాన్ని తెలియజేయాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)ను హైకోర్టు అడిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన బోడ మంగయ్యతో పాటు ఏడుగురు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. ఆర్‌బిఐని ఈ వివరణ కోరింది. కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

దేశంలో రెండో ఉత్తమ డిస్కాంగా ‘ఈస్టర్న్’

హైదరాబాద్, డిసెంబర్ 9: దేశం మొత్తం మీద పనితీరు బాగా కనపరిచిన రెండు అత్యుత్తమ విద్యుత్ డిస్కాంలలో ఆంధ్ర రాష్ట్రంలోని ఈస్టర్న్ పవర్ డిస్కాం ఒకటని కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఇంధన పొదుపు కార్యక్రమం, గృహ విద్యుద్ధీకరణలో వంద శాతం ఫలితాలను సాధించినందుకు ఈ అవార్డు లభించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల్లో విద్యుత్ రంగంలో అమలు చేసిన వివిధ పథకాల వల్ల ఈస్టర్న్ పవర్ డిస్కాం అత్యుత్తమ స్థానానికి ఎంపికైందని స్వాగతించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధించామన్నారు.

నాలుగేళ్లుగా పనిచేయని చెరుకుపల్లి కృషి విజ్ఞాన్ కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 9: ఏపిలో కృషి విజ్ఞాన కేంద్రాలు 23 ఉన్నాయని, అందులో 17 వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 1991 మంజూరు చేసిన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం 2012 నుంచి పనిచేయడం లేదని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాల తెలిపారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఏపిలో కృషి విజ్ఞాన కేంద్రాల పని తీరుపై అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉద్యాన మిషన్‌లో భాగంగా ఏపి,తెలంగాణ రాష్ట్రాలలో తొమ్మిది జిల్లాలలో విస్తరించివుందని కేంద్రం తెలిపింది.

వివాదంలేని ఆస్తులు 17

హైదరాబాద్, డిసెంబర్ 9: అక్షయ గోల్డ్ కేసుకు సంబంధించి 17 ఆస్తులు వివాదంలేనివని, వీటిని విక్రయించి వచ్చిన సొమ్ముతో డిపాజిట్‌దార్లకు సొమ్ము చెల్లించగలమని ఆంధ్ర సిఐడి అధికారులు హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు ధర్మాసనానికి సిఐడి 17 ఆస్తుల వివరాలను శుక్రవారం అందించింది. ఈ కేసులో పిటిషనర్ కూడా వివాదం లేని ఆస్తులు 7 ఉన్నాయని హైకోర్టుకు జాబితా ఇచ్చారు. అనంతరం హైకోర్టు పరిశీలించి వివాదం లేని ఆస్తులు 22 ఉన్నట్లు గుర్తించింది. ఈ కేసువిచారణను జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అనంతరం అక్షయ గోల్డ్ కేసును కోర్టు విచారించింది.

త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుపై గొడవ చల్లారకముందే త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించనున్నట్లు కేంద్రం తెలియజేసింది. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని, దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సేకరించడం కూడా ప్రారంభమయిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేవారు. పది రూపాయల విలువ కలిగిన బిలియన్ (వందకోట్ల) ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం 2014 ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రకటించింది.

బాధ్యులను వదిలేది లేదు

హైదరాబాద్, గచ్చిబౌలి, డిసెంబర్ 9: నానక్‌రాంగూడ ప్రమాద ఘటనకు కారణమైన బాధ్యులను వదిలేది లేదని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు ప్రకటించారు. శుక్రవారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని అభిప్రాయపడ్డారు. భవన యజమాని సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తుసింగ్ పరారీలో ఉన్నాడని, ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని చెప్పారు. అతని కొడుకు అనిల్‌సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అమెరికా అమ్మ ఒడికి..

ఆదిలాబాద్, డిసెంబర్ 9: కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అంటాడో సినీ కవి. ఆ మాటను ఓ విదేశీ అమ్మ నిజం చేస్తోంది. పేగు తెంచుకుని బిడ్డకు జన్మనిచ్చిన మాతృమూర్తి ఏ కారణం చేతనో పసిగుడ్డును కుప్పతొట్లో వదిలేస్తే, మాతృదేశానికి ఏమాత్రం సంబంధంలేని మహాతల్లి మాత్రం ఆ బిడ్డను భుజానికెత్తుకుంది. అనాధ అన్న ముద్రపడకముందే అక్కున చేర్చుకోవాలని ఐదు రోజులుగా తపన పడుతోంది. నాలుగు నెలల కిందట ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం టోల్‌ప్లాజా సమీపంలో రోజులునిండని పసిగుడ్డు కుప్పతొట్లో కనిపించింది. సమాచారం అందుకున్న ఆదిలాబాద్ పిల్లల సంరక్షణ కేంద్రం సిబ్బంది, అధికారులు ఆ బిడ్డను చేరదీశారు.

విసిల భర్తీకి సుప్రీం ఓకే

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణలో ఖాళీగావున్న మూడు వర్శిటీల వైస్ చాన్స్‌లర్ల నియామకానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విసిల నియామకాలపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. తెలంగాణలో ఖాళీగావున్న మూడు వర్శిటీల విసి పోస్టుల భర్తీకి అనుమతించాలని, యూజిసి నిబంధనల ప్రకారమే నియామకం చేపడుతామని వాదించారు.

Pages