S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూరోక్రాట్లు సమన్వయంతో పనిచేయాలి

హైదరాబాద్, డిసెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేయడం, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేందుకు బ్యూరోక్రాట్లు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంశాఖ పూర్వ కార్యదర్శి పద్మనాభయ్య సూచించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించినట్లు కనపడుతోందని, ఎవరిపని వారు చేసుకుని పోతున్నారన్నారు. శుక్రవారం ఇక్కడ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఐఎఎస్ అధికారుల జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, గతంలో ఐఎఎస్ అధికారులకు విశేషమైన అధికారాలు ఉండేవని, అలాగే సమష్టి భాగస్వామ్యంతో అధికారులు పనిచేసేవారన్నారు.

తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే

మహేశ్వరం, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియమ్మదేనని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గంలోని యూత్ కాంగ్రెస్ తుక్కుగూడ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సోనియమ్మ జన్మదిన వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపిపి స్నేహ, వైస్ ఎంపిపి స్వప్న, పార్టీ అధ్యక్షుడు శివమూర్తి, నేతలు రాజు, వీరేష్, బాల్‌రాజు పాల్గొన్నారు.
ఆర్‌కెపురంలో..

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసి బస్సు

ఘట్‌కేసర్, డిసెంబర్ 9: ద్విచక్రవాహనాన్ని ఆర్టీసి బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైద్రాబాద్-వరంగల్ జాతీయ రహదారి ఘట్‌కేసర్ మండలకేంద్రంలోని మాధవరెడ్డి ఫ్లైఓర్‌పై ఘట్‌కేసర్ నుండి బీబీనగర్ వైపువెళ్తున్న ద్విచక్రవాహనాన్ని భూపాలపల్లి నుండి హైద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఎరుకల నరేష్ (26), సంగీతం వీరేష్(24)లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.

ఏబివిపి విద్యార్ధి ఉద్యమాలతో జెఎన్‌టియుహెచ్‌లో తగ్గిన ఫీజులు

హైదరాబాద్, డిసెంబర్ 9: జెఎన్‌టియు హైదరాబాద్ యూనివర్శిటీ ఎట్టకేలకు విద్యార్ధి ఉద్యమాలకు తలొగ్గి ఫీజులను తగ్గించింది. గతంలో 1520 రూపాయిలున్న ఫీజును 765 రూపాయిలకు తగ్గించారని ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతకుంట సాయికుమార్ తెలిపారు. గత వారం రోజులుగా జెఎన్‌టియు సమస్యలపై విభిన్న రీతిలో ఉద్యమించడంతో యూనివర్శిటీ పాలనా యంత్రాంగం దిగివచ్చిందని అన్నారు. విసి ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ యాదయ్య, సిఇహెచ్ ప్రిన్సిపాల్ గోర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావులు విద్యార్ధుల సమస్యలను అర్ధం చేసుకున్నారని, ఫీజులను తగ్గించడంతో విద్యార్ధుల్లో ఆనందం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలి

వికారాబాద్, డిసెంబర్ 9: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలతో పాటు, ఆసుపత్రుల్లో ప్రసవాల నిర్దేశ లక్ష్యాలను దాటేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డి.దివ్య వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలు, సమస్యలపై వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రుల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగేనీరు, మంచాలు, దుప్పట్ల సదుపాయాలను కల్పించడంతో పాటు మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

నానక్‌రాంగూడ ఘటనకు కెటిఆర్‌దే బాధ్యత

హైదరాబాద్, డిసెంబర్ 9: నానక్‌రాంగూడలో అనుమతి లేకుండా ఏడు అంతస్తుల మేడ కూలిపోయిన ఘటనకు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేసి తన నైతికతను చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ 70వ జన్మదినం సందర్భంగా గాంధీ భవన్‌లో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.

సారీ.. సర్వర్ డౌన్!

హైదరాబాద్, డిసెంబర్ 9: బ్యాంకుల ముందు చాంతాడంతో క్యూలు కనిపిస్తుంటాయి. కానీ ఈ బ్యాంకు క్యూలో ఉన్నది కొద్ది మందే అని ఉత్సాహంగా వెళ్లిన వారికి నిరుత్సాహం తప్పడం లేదు. బ్యాంకుకు వెళ్లగానే సారీ సర్వర్ డౌన్.. ఎప్పుడైనా పని చేస్తుందనే నమ్మకంతో వీళ్లు క్యూలో నిలబడ్డారు. ఆసక్తి ఉంటే మీరూ నిలబడండి అనే సలహా వినిపిస్తోంది. ఇది అల్వాల్‌లోని ఎస్‌బిహెచ్ బ్యాంకు పరిస్థితి. గత రెండు రోజుల నుంచి ఎస్‌బిహెచ్‌తో పాటు పలు బ్యాంకుల్లో పరిస్థితి ఇలానే ఉంది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు, దానికి తోడు రెండు రోజుల నుంచి సర్వర్ డౌన్ అనే మాట వినిపిస్తోంది.

జైలు నుంచి పరారైన ఖైదీ బిహార్‌లో పట్టివేత

వరంగల్, డిసెంబర్ 9: వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీ రాజేశ్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. శుక్రవారం మట్వాడ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిషనర్ సుధీర్‌బాబు రాజేశ్‌యాదవ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివిధ నేరాలలో జైలుశిక్ష పడి చర్లపల్లి సెంట్రల్ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించి, ఆ తరువాత వరంగల్ జైలుకు మార్చబడిన రాజేశ్ యాదవ్, సైనిక్ సింగ్ అనే ఖైదీలు గతనెల 11న జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన విషయం తెలిసిందే.

ముప్పు ఇంట్లోనా.. బయటా?

వరంగల్, డిసెంబర్ 9: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని, కనీసం టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో కెసిఆర్ ప్రభుత్వం ఉందని టి-టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ కొత్తగా క్యాంపు కార్యాలయం పేరిట ముఖ్యమంత్రి కట్టించుకున్న నివాస భవనంలోని తన బాత్‌రూంను బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారని ఆరోపించారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రికైనా భద్రతాపరమైన సమస్య ఏర్పడితే కార్లను బుల్లెట్ ప్రూఫ్‌లుగా మారుస్తారని, కానీ బాత్‌రూంను బుల్లెట్‌ప్రూప్‌గా మార్చటం ఎందుకని ప్రశ్నించారు.

సంక్షేమ పథం.. పొదుపు మంత్రం!

హైదరాబాద్, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల వల్ల గణనీయంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం నేపథ్యంలో ప్రభుత్వ పంథాను ఏ విధంగా మార్చుకుందామనే అంశాన్ని మంత్రి వర్గ సహచరుల ముందు ముఖ్యమంత్రి చర్చకు పెట్టబోతున్నారు. నోట్ల రద్దు వల్ల తగ్గిన రాష్ట్ర ఆదాయాన్ని పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి. అలాగే వృధా ఖర్చులు ఎక్కడెక్కడా ఉన్నాయి? వాటిని ఏ విధంగా అరికడుదాం? ఈ రెండు అంశాలపై ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రివర్గ సహచరులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరనున్నారు.

Pages