S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిరోడ్డుపై ట్రాఫిక్ డ్యూటీ చేసిన ‘డ్రంకన్ డ్రైవర్స్’

విజయవాడ (క్రైం), డిసెంబర్ 9: నడిరోడ్డుపై ‘డ్రంకన్ డ్రైవర్స్’ ట్రాఫిక్ విధులు నిర్వహించారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తాగి రోడ్డుపై విచ్చలవిడిగా వాహనం నడపగా లేనిది.. ట్రాఫిక్ విధులు నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదంటూ జనం నిట్టూర్పు విడిచారు. అసలు విషయానికొస్తే.. తాగి వాహనం నడిపి పోలీసులకు పట్టుబడగా.. కోర్టు వీరికి విధించిన శిక్ష ఇది. కోర్టు ఆదేశాలతో పట్టుబడిన ఎనిమిది మందిలో ఏడుగురు వ్యక్తులు రమేష్ ఆస్పత్రి జంక్షన్ వద్ద, మరొక వ్యక్తి బెంజిసర్కిల్ వద్ద డ్యూటీ చేశారు. వీరిలో ప్రైవేటు ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, ఇద్దరు బిటెక్ విద్యార్థులు ఉన్నారు.

రుణాల మంజూరులో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత నివ్వాలి

విజయవాడ, డిసెంబర్ 9: వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాల మంజూరులో బ్యాంకర్లు అధిక ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్యాంకు అధికారులకు సూచించారు. నగరంలో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అధికారులు, బ్యాంకుల ప్రతినిధులతో జిల్లాస్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్, పిజె చంద్రశేఖర్, బి.నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రస్తుతం మంజూరు చేస్తున్న రుణాలను మరింత పెంచవలసిన అవసరం వుందన్నారు.

కృష్ణాలో 275 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

విజయవాడ, డిసెంబర్ 9: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యానికి 48 గంటల్లోపే చెల్లింపులు జరగాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో 275 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన ధాన్యాన్ని ఈ కొనుగోలు కేంద్రాలు సేకరించి వారికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను అందించాలన్నారు.

క్షేత్ర స్థాయి పరిశీలన

విజయవాడ, డిసెంబర్ 9: విజయవాడ భవానీపురం, గొల్లపూడిలో ఉన్న దర్గా హజరత్ గాలిబ్ షాహీబ్ వక్ఫ్ భూములకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ప్లాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించాకే తదుపరి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రుల బృందం నిర్ణయించింది. వెలగపూడిలోని సచివాలయంలో ఈ భూముల వ్యవహారంపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశమైంది. రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షతన మంత్రులు యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కె.ఇ.కృష్ణమూర్తి, అధికారులు సమావేశమై చర్చించారు. సమావేశం అనంతరం ఈ వివరాలను మంత్రి పల్లె విలేఖరులకు వివరించారు.

విద్యార్ధులు అన్ని రంగాలలో రాణించాలి

పటమట, డిసెంబర్ 9: విద్యార్ధులు కేవలం చదువులకే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలని అనంతపురం జిల్లా కలెక్టర్, లయోలా పూర్వ విద్యార్థి కోనా శశిధర అన్నారు. శుక్రవారం ఉదయం కళాశాల ఆడిటోరియంలో ఆంధ్ర లయోలా కళాశాల వ్యవస్థాపక దినోత్సవం, స్ఫూర్తి ఉత్సవాలు, విభిన్న సంస్కృతుల మేళవింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి. సంప్రదాయలను ప్రపంచదేశాలు ఎంతో గౌరవిస్తాయన్నారు. విద్యార్ధులు సమాజంలోని మార్పులకు అనుగుణంగా మారుతు పేద ప్రజలకు సేవలందించాలని కోరారు.

మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 9: మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ అన్నారు. ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక లేడియాంప్తిల్ మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ మానవ హక్కులను ఉల్లంఘించిన వారు శిక్షార్హులన్నారు. మానవ హక్కులు ఉల్లంఘన జరిగిన సమయంలో మేధావులు, విద్యావంతులు ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

నీతిమంతుడు చంద్రబాబు

మచిలీపట్నం, డిసెంబర్ 9: ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు నిజాయితీని మరోసారి ప్రస్పుటం చేసిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు పట్ల శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనే ఓటుకు నోటు కేసులో ఇరికించారన్నారు. అయితే చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదంటూ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కేసును కొట్టి వేయడం నిజాయితీ గల నాయకులకు శుభ సూచికమన్నారు.

కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు

హైదరాబాద్, డిసెంబర్ 9: హెరిటెజ్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో వందల ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక భవనాలు నేటికీ ఎంతో ధృడంగా ఉన్నా, నగరంలో నిర్మాణంలో ఉన్న భవనాలు వరుసగా కూలటం, పొట్ట్టతిప్పల కోసం కూలీ పనికి వచ్చిన అమాయకులు బలికావటం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బిల్డర్లు, కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి కారణంగా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం, అలాగే అక్రమంగా నిర్మిస్తున్న భవనాలకు సంబంధించి ఫిర్యాదులొస్తే అడ్డదారిలో లక్షలాది రూపాయలు వచ్చినట్టేనని మురిసిపోయే అధికారుల అవినీతే సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసేందుకు కారణమా?

మా వారెక్కడా?

హైదరాబాద్, డిసెంబర్ 9: నానక్‌రాంగూడలో భవనం కుప్పకూలిన ఘటన స్థలంలో మృతుల బంధువులు అధికారులు తీరు పట్ల ఒకింత ఆందోళనను వ్యక్తం చేశారు. భవనం కుప్పకూలిన ఘటనలో పలువురు మృతులు, గాయాలపాలైన వారున్నట్లు మీడియా ద్వారా తెల్సుకున్న విజయనగరం జిల్లా బల్దిపేట్ చిలకపల్లి వాసులు హుటాహుటిన ఉదయం నగరానికి చేరుకున్నారు. వీరిలో కొందరు తమవారి కోసం ఆర్తనాదాలు చేశారు. మృతదేహాలు బయటకు తీస్తున్నపుడు ఆ ప్రాంతం రోదనలతో దద్దరిల్లింది. కానీ విజయనగరం నుంచి వచ్చిన కొందరు మృతుల బంధువులను ఘటనా స్థలానికి పోలీసులు అనుమతించలేదు.

కేసిఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకుందాం

రాజేంద్రనగర్, డిసెంబర్ 9: ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణని కాపాడుకుందామని ప్రజలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ కృతజ్ఞత సభను మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ చౌరస్తాలో నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు దారమోని రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ప్రజలను మభ్యపెడుతూ కేసిఆర్ కుటుంబం కోట్లు కూడబెడుతుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెచ్చింది.. కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు.

Pages